Bigg Boss 9 Promo:బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 అప్పుడే మూడు వారాలు పూర్తి చేసుకుంది. ఇక సోమవారంతో నాలుగవ వారం కూడా ప్రారంభమైన విషయం తెలిసిందే. ప్రస్తుతం హౌస్ లో కంటెస్టెంట్స్ ఎవరికి వారు పోటీపడుతూ హౌస్ బ్యాటరీ ఛార్జ్ ను పెంపొందిస్తూ నామినేషన్స్ నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇకపోతే ఈరోజు నామినేషన్ జరగాల్సి ఉండగా.. అందులో భాగంగానే ఇమ్యూనిటీ స్టార్ అంటూ ఒక టాస్క్ నిర్వహించారు బిగ్ బాస్. అందులో కంటెస్టెంట్స్ భారీగా కష్టపడ్డా కూడా ప్రతిఫలం దక్కినట్లు అనిపించలేదు మరి అసలేం జరిగిందో ఇప్పుడు చూద్దాం.
తాజాగా 22వ రోజుకు సంబంధించిన మొదటి ప్రోమోని నిర్వాహకులు విడుదల చేశారు. ప్రోమో మొదలవగానే బిగ్ బాస్ మాట్లాడుతూ..” నామినేషన్స్ నుంచి విముక్తి పొంది సేవ్ అవ్వడానికి మేము ఇస్తున్న టాస్క్ ఇమ్యూనిటీ స్టార్”. అంటూ తెలిపారు. దీనికి పవన్ బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ ను వివరిస్తూ.. ఎదురుగా ఉన్న స్క్వేర్ బ్లాక్స్ బోర్డు ని చూపిస్తూ ఇక్కడ ఉన్న అన్ని బ్లాక్స్ ను పగలగొట్టి.. పైన ఉన్న స్టార్ ను ఒకసారి ఒక గోల్డెన్ స్టార్ ను మాత్రమే తీసుకొని వచ్చి కింద ఉన్న బాక్స్ లో పెట్టాలి ” అంటూ టాస్క్ నిర్వహించారు బిగ్ బాస్. ఇక మొదటి టాస్క్ లో భాగంగా నలుగురు పోటీపడ్డారు. కానీ బ్లాక్స్ పూర్తి చేయకుండానే స్టార్ ను తమ బాస్కెట్ లో వేసుకున్నారు. ఆ తర్వాత మరో టీం వచ్చింది. ఆ టీమ్ కూడా సేమ్ అలాగే రిపీట్ చేయడంతో.. కెప్టెన్ గా ఉన్న పవన్ గేమ్ లో ఇద్దరు ఫాల్ గేమ్ ఆడారు కాబట్టి ఇద్దరిలో ఎవరు విజయం కాదు అంటూ క్లారిటీ ఇచ్చారు. మొత్తానికైతే ఈ బ్లాక్స్ పగలగొట్టే క్రమంలో అందరూ ఎంత కష్టపడినా ఫలితం మాత్రం శూన్యం అని తెలుస్తోంది. మరి దీనిపై బిగ్ బాస్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
ALSO READ:OG Piracy: ఓజీని పైరసీ చేసిన ముఠా అరెస్ట్… హార్డ్ డిస్క్‌లన్నీ స్వాధీనం
బిగ్ బాస్ 9..
ఇక బిగ్ బాస్ కార్యక్రమం విషయానికి వస్తే.. మొత్తం 9 మంది సెలబ్రిటీలు, 6 మంది కామనర్స్ హౌస్ లోకి అడుగుపెట్టారు. అందులో మొదటి వీక్ ప్రముఖ కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ ఎలిమినేట్ అయింది. రెండవ వారం కామనర్ మర్యాద మనీష్ ఎలిమినేట్ అయ్యారు. మూడవ వారం కామనర్ ప్రియా శెట్టి కూడా ఎలిమినేట్ అయిపోయింది. హౌస్ లో 13 మంది కొనసాగుతూ ఉండగా…దివ్య నిఖిత అనే కామనర్ హౌస్ లోకి వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అలా మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ అయ్యారు కానీ నిన్న మూడవ వారంలో భాగంగా ప్రియాశెట్టి ఎలిమినేట్ అవ్వడంతో ఇప్పుడు ప్రస్తుతం 13 మంది హౌస్ లో కొనసాగుతున్నారు. ఇక ఈవారం నామినేషన్ లో ఎవరు నిలుస్తారు ? ఎవరు హౌస్ నుంచి ఎలిమినేట్ అవుతారు? అనే విషయాలు కూడా వైరల్ గా మారుతున్నాయి.