E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today episode: మీనా మాట విన్న బాలు.. శృతికి పురిటీ నొప్పులు..రోహిణి ఇలా దొరికిపోయిందేంటి..?

Gundeninda GudiGantalu Today episode: మీనా మాట విన్న బాలు.. శృతికి పురిటీ నొప్పులు..రోహిణి ఇలా దొరికిపోయిందేంటి..?
Advertisement

Gundeninda GudiGantalu Today episode December 12th: నిన్నటి ఎపిసోడ్ లో.. సత్యంని ఎలాగైనా సరే గదిలోకి పంపించాలని బాలు మీనా ప్రయత్నాలు చేసి మొత్తానికి గదిలోకి పంపించేస్తారు. ఇక ప్రభావతి నేను అక్కడేం పడుకొని ఇక్కడే పడుకుంటానని కింద పడుకుంటుంది. ఉదయం మీనా వంట గదిలో కాఫీ చేస్తూ ఉండగా శృతి లేచి వస్తుంది. వెంటనే రోహిణి కూడా వస్తుంది.. ఇంత ఉదయం నువ్వెందుకు లేచావని శృతిని చూసి రోహిణి మీనా ఇద్దరు షాక్ అవుతారు.. ఇక అందరూ కలిసి నగల గురించి మరోసారి చర్చ మొదలు పెడతారు. రోహిణి శృతి మధ్య చిన్నపాటి యుద్ధం మొదలవుతుంది. ఎందుకు నువ్వు ఊరికే అన్ని నీ మీద వేసుకొని మాట్లాడతావు అని రోహిణి అంటుంది.. నేనే మాట్లాడను మనోజ్ చేసిన తప్పు కాదు అని నువ్వు అంటున్నావు. రోహిణిని శృతి మాత్రం అస్సలు వదలకుండా ఏదో ఒకటి అంటూనే ఉంటుంది.. ప్రభావతి కూడా మీనానే తిట్టడంతో శృతి రెచ్చిపోతుంది.. కామాక్షి ఎంత చెప్తున్నా సరే మీనాదే తప్పు అంటూ ప్రభావతి అంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. ప్రభావతి కామాక్షి దగ్గరికి వెళ్లి ఏం జరిగింది అన్నది చెప్తుంది.. మీనాని అనకుండా అసలు ఉండలేవా వదిన అని కామాక్షి ప్రభావతికి గడ్డి పెడుతుంది.. నాకు ఇంట్లో మనశ్శాంతి లేకుండా పోతుంది.. ఈ పూలు అమ్ముకునేది నన్ను నా ఇంట్లోనే ఉండనివ్వకుండా చేస్తుంది అని ప్రభావతి మీనా పై ఘోరంగా నిందలు వేస్తుంది.. ఇక బాలు సెకండ్ హ్యాండ్ లో మరొక కారు కొనాలని రాజేష్ ని తీసుకొని షో రూమ్ కి వెళ్తాడు. కార్లను చెక్ చేసిన బాలు మీ నాకు ఫోన్ చేసి రమ్మని పిలుస్తాడు. ఇద్దరు కలిసి సెలెక్ట్ చేస్తారు కానీ మీనా ఇప్పుడు ఇంట్లో ఉన్న పరిస్థితులను బట్టి మనం కొనకపోవడమే మంచిది అని అంటుంది..

Advertisement

అదేంటి నువ్వే కదా కొనమని చెప్పావు.. మరి ఇప్పుడు నువ్వు వద్దులే అంటావేంటి మీనా అని బాలు అంటాడు.. ఇప్పుడు మనం రెండు కార్లు కొంటే అత్తయ్య మామయ్య చిరు ఒక కార్లో ఎక్కుతారు కానీ వాళ్ళిద్దరూ కలిసి ఒక కారులో ఎక్కరు కదా అని మీనా అంటుంది. ఇద్దరు కలిసిన తర్వాత మనం కొత్త కారు కొంటే బాగుంటుంది అని మీనా అంటుంది. ఇంత చేసిన మనోజ్ రోహిణి దులిపేసుకొని బాగానే ఉన్నారు కానీ ఇక్కడ బాధపడుతుంది మాత్రం అత్తయ్య మామయ్యనే.. వాళ్ళిద్దరూ కలిపిన తర్వాత మనం కారు కొందాం అనేసి అంటారు.. మీనా మాటను బాలు వింటాడు.. ఇక బాలు రాజేష్కు ఈ కార్లను తర్వాత కొంత మంది చెప్పు అని అంటాడు.

డబ్బింగ్ స్టూడియోలో శృతి డబ్బింగ్ చెప్తుంది. ఈ సిమ్ తో అయిపోయింది కదా సీరియల్ ఇక ఏవైనా ఉన్నాయా అని శృతి అడుగుతుంది.. లాస్ట్ ఒకే ఒక ఎమోషనల్ సీన్ ఉందండి ఆ సీన్ గురించి చెప్పండి మేడం అని శృతిని అడుగుతారు. చాలా ఎమోషనల్ సీన్.. మీరు ఎమోషనల్ గా చెప్పాలి అని శృతిని డబ్బింగ్ స్టూడియో ఓనర్ అడుగుతాడు. ఒకసారి ఆ సీన్ ని ప్లే చేయండి నేను చూస్తాను అని శృతి అడుగుతుంది. ఆ సీన్ ను చూడగానే శృతి ఎమోషనల్ అయిపోతుంది.. ఆ సీన్ కి డబ్బింగ్ చెప్పు శృతి ఆటోమేటిక్గా ఏడ్చేసింది..

Advertisement

ఈ సీన్ చాలా ఎమోషనల్ గా ఉంది కన్నీళ్లు వచ్చేసాయి అని శృతి అనుకుంటుంది. శృతిని చూసినా డబ్బింగ్ ఓనరు ఏంటి మేడం ఏడుస్తున్నారు అని అడుగుతాడు. ఈ సీన్చాలా ఎమోషనల్ గా ఉందండి. నేను చెప్పాను కదా మేడం చాలా ఎమోషనల్ అని అతను అంటాడు.. ఇకపోతే ఆ సీన్ చూసి బయటికి వచ్చినా శృతి ఎంత కష్టపడి పిల్లల్ని కనింటుందో అనేసి వాళ్ళ అమ్మకి ఫోన్ చేసి సారీ చెప్తుంది. అమ్మ గొప్పతనం గురించి నువ్వు ఇంతగా అడుగుతున్నావు అంటే నువ్వు ఏమైనా గుడ్ న్యూస్ చెప్తున్నావా అని శోభ అడుగుతుంది. ఇప్పట్లో అలాంటి ఆలోచనలు లేవు మమ్మీ అని శృతి అంటుంది.

రోహిణి అలసిపోయి ఇంటికి వస్తుంది. మీనా ఏమైంది రోహిణి అని అడుగుతుంది.. అప్పుడే ఇంటికి వచ్చిన శృతి నొప్పులు పడాలి నేను వెళ్తున్నాను అని అనడం వింటారు.. ఏంటి ఏమైంది నీకు అని అడుగుతారు.. కానీ శృతి మాత్రం నేను నొప్పులు పడాలి వెళ్తున్నాను అని అంటుంది.. ఏదో జరిగింది కూర్చో ఇలా అనేసి వాళ్ళిద్దరు కూర్చుని అడుగుతారు. మీనా గెట్టిగా అరవడంతో శృతి మళ్లీ ఈ లోకంలోకి వస్తుంది. ఇప్పుడు చెప్పు ఏమైంది అంటే నేను డబ్బింగ్ సీన్ చెప్తున్నప్పుడు ఒక ఆవిడ ఇంతగా నొప్పులు పడింది. తల్లి అంత నొప్పులు పడితేనే బిడ్డ బయటకు వస్తుందా అని అడుగుతుంది..

Also Read : ‘పొదరిల్లు’ సీరియల్ నటీనటులు.. ఎవరు ఏ పాత్రలో నటిస్తున్నారంటే..?

శృతి ఆ మాట చెప్పగానే రోహిణి ఈ నొప్పులకే నువ్వు ఇంతగా బాధపడుతున్నావా..? కానీ మూడు నెలలు వాంతులు అవుతాయి ఆ తర్వాత నొప్పులు నడుము నొప్పులు చాలా ఉంటాయి.. బిడ్డను పని ఎంతవరకు ఎన్ని నొప్పులు పడాలో అన్ని నొప్పులు పడతారు. చాలా పెయిన్ ఫుల్ గా రోహిణి చెప్పడం విన్నా శృతి మీనా ఇద్దరు కూడా షాక్ అవుతారు. ఏదో ఆ నొప్పులని భరించి బిడ్డను తన్నట్లు అలా చెప్తున్నావేంటి అని మీన అడుగుతుంది.. నా క్లైంట్స్ చెప్తుంటే విన్నాను అని రోహిణి ఏదో కవర్ చేస్తుంది. ఆ తర్వాత బాలు సుశీలను ఇంటికి తీసుకొని వస్తాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. ఇక రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

 

Related News

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Podarillu Today Episode : చక్రితో అంట్లు కడిగించిన మహా.. నారాయణ హర్ట్.. జయంతి మాటతో షాక్..

Karthika Deepam 2 Serial Today Episode September 4th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని ఇంట్లో పని మనుషుల్లాగా ఉంటామన్న దీప, కార్తీక్         

Illu Illalu Pillalu Today Episodes: శ్రీవల్లి మాటతో నర్మద షాక్.. విశ్వంకు భద్ర వార్నింగ్.. కన్నీళ్లు పెట్టుకున్న వేదవతి..

Intinti Ramayanam Today Episode: పల్లవికి టెన్షన్.. ప్రణతి ఎంట్రీతో ఆల్ హ్యాపీ.. ఫైనల్ ట్విస్ట్ అదిరింది..

Ye Devi Varamo Neevu Hero : సీరియల్ హీరోకు ఎంతకష్టం వచ్చింది.. అసలేం జరిగింది..?

Friday Movies in Tv : శుక్రవారం టీవీల్లోకి సూపర్ హిట్ సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..

Big Stories

Advertisement
×