Gundeninda GudiGantalu Today episode june 5th: నిన్నటి ఎపిసోడ్ లో.. మనోజ్ ఇంటర్వ్యూకు వెళ్లి ఇంటికి తిరిగి వస్తుండగా పార్కులో తనకు అప్పిచ్చిన ఫ్రెండు ఎదురవుతాడు. అతని చూసి మనోజ్ పారిపోతుంటే అతను ఎందుకు బ్రో నువ్వు పారిపోతున్నావ్ అని అడుగుతాడు. నీ అప్పు నేను కెనడాకు వెళ్ళిన తర్వాత తీర్చేస్తాను.. నువ్వు మళ్ళీ ఇలా ఇంటికి వచ్చి అడగద్దు అని మనోజ్ అంటాడు. దానికి ఆ వ్యక్తి నువ్వు అప్పు తీర్చాల్సిన అవసరం లేదు బ్రో. ఆల్రెడీ మీ వైఫ్ వడ్డీతో సహా నన్ను వెతుక్కుంటూ వచ్చి ఇచ్చేసింది అని చెప్తాడు. అలాంటి భార్య దొరకడం నిజంగా నీ అదృష్టం బ్రో అనేసి అతను అంటాడు. మనోజ్ ఇంటికి వెళ్లి రోహిణి తో ఈ విషయాన్ని అడుగుతాడు. అయినప్పటి నుంచి నేను నీకు ఏమీ చేయలేదు కదా.. నువ్వు నాకోసం ఎంతో చేస్తున్నావ్ నిజంగా నీలాంటి వైఫ్ దొరకడం నా అదృష్టం అని మనోజ్ తెగ మురిసిపోతాడు. 500 మాలలు కట్టడానికి మీనా మందిని తీసుకొని వచ్చేస్తుంది. ప్రభావతి మీనాను తక్కువ చెయ్యడంతో బస్తి జనాలు మీనాకు సపోర్ట్ గా నిలుస్తారు. మొత్తానికి మాలలు హాల్లో కట్టెందుకు సత్యం పరిమిషన్ ఇవ్వడంతో అందరు ఇంట్లోనే కూర్చుంటారు. ప్రభావతి నా ఇల్లు పూలతో నిండిపోయింది అయ్యిందని తెగ హడావిడి చేస్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. సత్యం పూలను చూసి సంతోషంగా ఫీల్ అవుతుంటాడు. ఇన్ని పువ్వులు ఇలా ఒక్కచోటే చూస్తుంటే ఈ వాసనకి నాకు మనసు ప్రశాంతంగా ఉంది అని అంటాడు. మీరు ఇవే చూస్తున్నారు పూల మార్కెట్ కు రండి.. ఇంకెన్ని పూలు అక్కడ ఉంటాయో అని అక్కడున్న ఒక ఆవిడ అనగానే సత్యం అవునా అమ్మ మనసు ప్రశాంతంగా ఉండాలంటే పూల మార్కెట్ కి రావాలని అంటాడు.. ఇక ప్రభావతిని సత్యం టీ పెట్టమని అడుగుతాడు. ప్రభావతి లోపలికి వెళ్లి కామాక్షికి ఫోన్ చేసి అర్జెంటుగా నువ్వు మా ఇంటికి రావాలని అడుగుతుంది.
బాలు పువ్వులు కట్టడం అయిపోతుందా మళ్ళీ పువ్వులు వచ్చాయి. డబ్బులు ఇవ్వాలి అని ఓనర్ కి చెప్పండి అని మీనాతో అంటాడు. ఇక మీనా కాస్త ఆగిన తర్వాతే డబ్బులు ఇస్తామని చెప్పండి అని అంటుంది. వీరిద్దరి మధ్య సత్యం నలిగిపోతుంటాడు. ఇక సత్యం పువ్వులు కట్టే ఒక అమ్మాయిని నీకు పెళ్లయింది అమ్మ అని అడుగుతాడు. లేదండి ఇంకా కాలేదు అనగానే ప్రభావతి ఏ పెళ్లి చేసుకుంటావా అని ఎగతాళి చేస్తూ మాట్లాడుతుంది. దానికి సత్యం సీరియస్ గా ఒక లుక్ ఇస్తాడు.. ఇక అందరూ మాలలు చకచగా కట్టేస్తుంటారు.
శృతి డబ్బింగ్ స్టూడియోలో సీరియల్ కి డబ్బింగ్ చెప్తూ ఉంటుంది. డబ్బింగ్ అవ్వగానే నాకు ఆకలేస్తుంది సార్ అనగానే నీ ఆర్డర్ నీకు వచ్చేసింది అని చెప్తాడు. నేనేమి ఆర్డర్ ఇవ్వలేదే నాకు ఎవరు ఆర్డర్ తెచ్చారు అని శృతి బయటికి రాగానే అక్కడున్న రవిని చూసి షాక్ అవుతుంది. నువ్వేంటి రవి ఇలా సడన్ సర్ప్రైజ్ ఇచ్చేసావు అంటే.. నీ మొహం లో ఈ సంతోషం చూడాలని నేను ఇలా నీకు నచ్చిన అన్ని వెరైటీలను చేసుకుని తీసుకొచ్చాను అని రవి అంటాడు. మనం గొడవ పడుతున్నామని ఆంటీ కి డౌట్ వచ్చింది అందుకే నీకు పొద్దున అలా కిస్ చేశాను అని శృతి అంటుంది. ఇంత కోపంలో ఉన్న నువ్వు చేసే వంటలకి ఇట్లే కరిగిపోయి నీ మీద ప్రేమను కురిపిస్తాను. నీ వంటలో ఏదో మ్యాజిక్ ఉంది వంటి అబ్బాయని శృతి సరదాగా అంటుంది.
ఇంట్లో పూలను చూసి కామాక్షి అక్కడికొచ్చి ఏంటి మా ప్రభావతి వదిన ఇంట్లో ఖాళీ చేసి పూల వాళ్లకి అద్దెకిచ్చిందా ఏంటి? ఇంటి నిండా పూలే ఉన్నాయి అంటూ కంగారుపడుతుంది. ప్రభావతి కనిపించకపోవడంతో ప్రభావతికి ఫోన్ చేసి వదిన ఎక్కడున్నావ్ రాత్రికి రాత్రి ఇల్లు ఖాళీ చేసి పూల పల్లకి ఏమైనా అద్దెకిచ్చావా అని అడుగుతుంది. ఈ ఇల్లు నాదే ఈ పూలు నాదే నీకు ఒకసారి వెనక్కి తిరిగి చూడు అని ప్రభావతి కామాక్షి పై సెటైర్లు వేస్తుంది. కామాక్షి ఏంటి మీనా ఇదంతా అని అడుగుతుంది.. పెద్ద ఆర్డర్ వచ్చింది పిన్ని గారు అందుకే ఇలా అందరం కూర్చుని మాలలు కడుతున్నామని అంటుంది. ఇక బాలు కూడా నువ్వు కూడా ఒక చెయ్యి అత్త పూలమాలలు కట్టడం నీకు రాదా ఏంటి అని అంటాడు.
దానికి కామాక్షి అదేంటి బాలు పేకాట ఆడుదాం అన్న ఈజీగా పూలు కడతావని అడిగావు అని అంటుంది. ప్రభావతి కామాక్షికి అలాంటివన్నీ రావు నన్ను చూడ్డానికి వచ్చిందని సెటైర్లు వేస్తుంది. ఈ పూలను చూస్తుంటే నాకు మళ్ళీ పెళ్లి చేసుకోవాలనిపిస్తుందని కామాక్షి అంటుంది. ఈ వయసులో నువ్వు మామ కి అన్యాయం చేస్తావా అని బాలు కామాక్షి పై సెటైర్లు వేస్తాడు. మీ మామని రెండో పెళ్లి చేసుకుందామని ఈ పూలను చూస్తుంటే నాకు అలా అనిపిస్తుంది బాలు అని అంటుంది. ఇక మనోజ్ ని ప్రతిసారి బాలు అవమానించడం చూసి రోహిణి తెగ ఫీల్ అయిపోతుంది..
అప్పుడే అక్కడికి వచ్చిన శృతి రవి ఈ పూల వాసన వీధి చివరి వరకు వస్తుంది.. ఎక్కడ అనుకున్నాను మన ఇంట్లోనేనా అని శృతి అంటుంది. దానికి ప్రభావతి ఏంటి ఈ పూల కంపు వీధి చివరి వరకు వస్తుందా? రేపటి నుంచి అందరు నన్ను పూలకట్టు ప్రభావతి అంటారేమో అని ప్రభావతి కంగారు పడుతూ ఉంటుంది. ప్రభావతి అన్న ప్రతిసారి సత్యం ఏదో ఒక సెటైర్ వేస్తూ కౌంటర్ ఇస్తుంటాడు.. ఇక అందరూ సరదాగా మాలలు కడుతూ ఉంటారు.
గుణ మాత్రం మీనా అన్న మాటని తలుచుకొని కోపంతో రగిలిపోతూ ఉంటాడు.. నాకే వార్నింగ్ ఇస్తుందా మీ నాకు కచ్చితంగా ఏదో ఒకటి చేయాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..