కానీ ఇక్కడ ఓ తల్లి చేసిన పనికి.. సభ్య సమాజం తలదించుకునేలా చేసింది. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన కన్నతల్లే.. కూతురు జీవితాన్ని బుగ్గిపాలు చేసింది. కామంతో కళ్లు మూసుకుపోయి.. ప్రియుడి మోజులో పడి ఓ తల్లి మానవత్వం మరిచిపోయింది. ఆ చిన్నారిపై దారుణానికి పాల్పడింది. ఏ తల్లి చేయకూడని నీచానికి ఒడికట్టింది.
అసలేం జరిగిందంటే..
సైదాబాద్‌లో అమానుష ఘటన చోటుచేసుకుంది. బాలిక తల్లి జగన్ అనే వ్యక్తితో అక్రమ సంబంధం కొనసాగిస్తూ ఉండగా.. అతడు బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ కేసులో దారుణమైన విషయం ఏంటంటే.. బాలిక తల్లే ఈ దారుణానికి అంగీకరించడం. జగన్ అనే వ్యక్తితో బాలిక తల్లికి వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ సంబంధం కొనసాగుతుండగానే.. ఆమె కూతురిపై కన్నేశాడు అతను. ఇదే విషయాన్ని ఆ తల్లికి చెప్పడం.. దానికి ఆమె అంగీకరించడం జరిగింది. జగన్‌తో పాటు అతని స్నేహితుడు బాలరాజు కూడా ఆ బాలికపై అత్యాచారానికి ఒడిగట్టాడు. విషయం తెలుసుకున్న తండ్రి.. ముగ్గురిపై కేసు పెట్టాడు. నిందితులపై సైదాబాద్ పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. నిందితులు జగన్, బాలరాజ్‌తో పాటు బాలిక తల్లిని అరెస్ట్ చేశారు.
స్థానికుల ఆగ్రహం
ఇలాంటి ఘటనలు మళ్లీ రిపీట్ కాకుండా ఉండాలంటే.. నిందితులపై కఠినమైన చర్యలు తీసుకోవాలంటూ.. స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. చిన్నారుల భద్రత కోసం ప్రభుత్వం మరింత కఠినమైన నిబంధనలు తీసుకురావాలని అభిప్రాయపడుతున్నారు.
ఇదిలా ఉంటే.. వైఎస్సార్ జిల్లా మైలవరంలో నాలుగేళ్ల చిన్నారి అత్యాచారం కేసు నిందితుడు.. రహమతుల్లా ఆత్మహత్య చేసుకున్నాడు. మైలవరం జలాశయంలో మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. రహమతుల్లా డెడ్‌బాడీని పోలీసులు తల్లికి అప్పగించగా.. డెడ్‌బాడీని తీసుకోవడానికి తల్లి నిరాకరించింది. మున్సిపల్ సిబ్బందికి అప్పగించడంతో దహన సంస్కారాలు చేపట్టారు. మృతుడు రహంతుల్లా ఘటన జరిగిన రోజునే పారిపోయినట్లు పోలీసులు తెలుపారు.