E-Paper
Advertisement

Intinti Ramayanam Today Episode: పల్లవికి శ్రీయా స్ట్రాంగ్ కౌంటర్.. అవని దెబ్బ అదుర్స్.. రాజేశ్వరి ఎంట్రీతో మైండ్ బ్లాక్..

Intinti Ramayanam Today Episode: పల్లవికి శ్రీయా స్ట్రాంగ్ కౌంటర్.. అవని దెబ్బ అదుర్స్.. రాజేశ్వరి ఎంట్రీతో మైండ్ బ్లాక్..
Advertisement

Intinti Ramayanam Today Episode May 28th : ఫంక్షన్ ఏర్పాట్లలో కమల్ హడావిడి చేస్తూ ఉంటాడు. అక్కడ ఫంక్షన్కి కావాల్సిన డెకరేషన్ చేస్తూ ఉండగా పల్లవి కూర్చొని ఉండడంతో కమల్ పల్లవిని బెలూన్స్ కట్టమని చెప్తాడు కానీ అవి పగిలిపోవడంతో తను షాక్ అవుతుంది.. అందరూ సరదాగా నవ్వుకుంటూ ఉండగా శ్రీకర్, శ్రీయ ఇద్దరు కూడా సడన్ గా రావడంతో పల్లవి ఒక్కసారిగా శాఖ అయిపోతుంది. అందరూ వాళ్ళిద్దరు రావడంతో చాలా సంతోషంగా ఉంటారు. శ్రేయ శ్రీకర్ రావడంతో పల్లవి షాక్ లో ఉండిపోతుంది. ఇద్దరు నిజంగానే ఇక్కడికి వచ్చేసారా లేకపోతే ఏదైనా కారణం వల్ల వచ్చారా అనే పల్లవి టెన్షన్ పడిపోతూ ఉంటుంది..

పల్లవికి బుర్రహీటేక్కించిన శ్రీయా..

పల్లవి అసలు శ్రీయా వాళ్ళు ఎందుకు వచ్చారు అని ఆలోచిస్తూ ఉంటుంది.. పల్లవి శ్రేయాన్ని చూసి తెగ ఆలోచించేస్తూ ఉంటుంది.. మీరు ఆరాధ్య బర్త్ డే కి విష్ చేయడానికి వచ్చారు కదా అని అంటుంది. లేదు మేము ఇక్కడే ఉండిపోవడానికి వచ్చాము అనే శ్రీకర్ చెప్పగానే.. పల్లవి మైండ్ బుర్రన తిరుగుతుంది.. అందరూ లోపలికి వెళ్లి సంతోషంగా ఉంటారు అయితే ఒంటరిగా దొరికిన శ్రీయాని పల్లవి ఏంటి మళ్లీ నువ్వు యూటర్న్ తీసుకున్నావు అని అడుగుతుంది.. ఇంటికి రానని చెప్పి వెళ్ళిపోయావు కదా.. మళ్లీ ఎందుకు వచ్చావు అని పల్లవి అడుగుతుంది. మరి నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోయావు కదా కమల్ నిన్ను మెడ పట్టి బయటకి గెట్టేశాడుగా మళ్లీ నువ్వు సిగ్గు లేకుండా ఇంటికి ఎందుకు వచ్చావు అని అడుగుతుంది.. నేను ఎందుకు వచ్చానో నీకు అవసరం లేదు అని చెప్పగానే పల్లవి షాక్ అవుతుంది..

పల్లవిని చిటికెలు వేసి వార్నింగ్..

Advertisement

శ్రీయ జ్యూస్ అడగడంతో అవని తీసుకొని వచ్చి ఇస్తుంది. అది జ్యూస్ ని తాగిన శ్రియ జ్యూస్ చాలా బాగుంది అక్క అని అంటుంది.. నా ప్రేమను అంత దీంట్లో కలిపి మరి నీకోసం స్పెషల్ గా చేశాను అని పల్లవి అనగానే థాంక్స్ అక్క అని శ్రియ అంటుంది. వీరిద్దరి మాటలు చూస్తున్న పల్లవి మధ్యలో ఏం జరుగుతుందని షాక్ అయిపోతూ ఉంటుంది. నేను వెళ్లి అత్తయ్యతో మాట్లాడుతానని శ్రియ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.. అయితే వెళ్ళిపోతున్న పల్లవిని పిలిచి చిటికెలు వేసి మరి పిలుస్తుంది.. ఏంటి శ్రీయ వచ్చేటప్పటి నుంచి నీ ముఖంలో రంగులు మారిపోయాయి అని పల్లవిని అడుగుతుంది అవని.. నీ గురించి నాకు బాగా తెలుసు కదా ఇంకా నీకు షాక్ ఇచ్చిన న్యూస్ ఒకటి ఉంది.. మరి కాసేపట్లో మీ అమ్మ, భరత్ వాళ్లు కూడా వస్తారు.. ఈ వేడి నుంచి బయటపడాలి అంటే ఫ్రిజ్ లో ఐస్ క్యూబ్స్ ఉన్నాయి. వాటిని తీసుకొని తల మీద పెట్టుకొని అవని అంటుంది..

రాజేశ్వరి ఎంట్రీతో పల్లవి మైండ్ బ్లాక్..

అవని అందరికీ మజ్జిగ తెచ్చి ఇస్తూ ఉంటుంది. పల్లవిని తీసుకోమని చెప్పిన కూడా పల్లవి వినకపోవడంతో తీస్కో చల్లబడతావని అవని ఎంత చెప్పినా సరే వినదు. ఎదురుగా రాజేశ్వరి వాళ్ళు రావడం చూసి పల్లవి ఒక్కసారేగా షాక్ అయిపోతుంది.. వీళ్ళు వచ్చారని అవని అందర్నీ పిలుస్తుంది. పల్లవి మాత్రం రాజేశ్వరిని పక్కకు తీసుకుని వెళ్లి మాట్లాడడానికి ప్రయత్నం చేస్తుంది కానీ తను మాట్లాడుకున్న మౌనంగా లోపలికి వెళ్తుంది. అందరూ కూడా రాజేశ్వర్ రావడం చూసి షాక్ అవుతారు.. జరిగినవన్నీ పక్కన పెట్టేసి నువ్వు రావడం మాకు చాలా సంతోషంగా ఉంది అని అందరూ అంటారు కానీ రాజేశ్వరి మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది.. ఇక చక్రధర్ మీనాక్షి ఇద్దరు కలిసి ఆరాధ్య కోసం బట్టలు తీసుకొని వస్తారు. ఇద్దరు కలిసి జంటగా బట్టలు పెట్టాలి అని పార్వతి చెప్పగానే రాజేశ్వరి షాక్ అవుతుంది.. పల్లవి మా అమ్మని అవమానించడానికే అవని పిలిచింది అని అనుకుంటుంది. ఎలాగైనా సరే వీళ్ళు సంతోషాన్ని దూరం చేయాలి అని అనుకుంటుంది పల్లవి. చక్రధర్ తన భార్య మీనాక్షితో కలిసి ఆరాధ్య కు బొట్టు పెట్టి అక్షతలు వేసి బట్టలు ఇస్తారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో మీనాక్షిని గోరంగా అవమానిస్తుంది పల్లవి.. కానీ చక్రధర్ మాత్రం తన కన్న తల్లి ఎవరు అన్న నిజాన్ని బయట పెట్టేస్తాడు.. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి.

Advertisement

Also Read :Intinti Ramayanam Pallavi : ‘ఇంటింటి రామాయణం ‘ పల్లవి భర్త ఎవరో తెలుసా..? మెంటలెక్కిపోవాల్సిందే..

Related News

Karthika Deepam 2 Serial Today Episode October 17th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని ఎదురుగానే జ్యోత్స్న చేయి పట్టుకున్న సూరజ్            

Gundeninda GudiGantalu Today episode: బాలును ఇరికించే ప్లాన్.. దొంగగా రోహిణి.. ఇది కదా అసలు ట్విస్ట్..

Brahmamudi Serial Today Episode October 17th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  అపర్ణ రాసిన లెటర్ శేషు జీవితాన్ని మలుపు తిప్పుతుందా..? 

Saturday TV Movies : శనివారం టీవీ సినిమాలు.. మూవీ లవర్స్ కు జాతరే..

Nindu Noorella Saavasam Serial Today Episode October 17th‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: పార్థు హత్య కేసు నుంచి మనోహరి ఎస్కేప్ అవుతుందా..? 

సోషల్ మీడియాని షేక్ చేస్తున్న నల్గొండ గద్దర్ నరసన్న.. రమణిలో బతుకమ్మ పాటతో రచ్చ!

మాధురి రాథోడ్ లైఫ్‌లో జరిగినదే పాటలో ఉందా? ‘భామ సుందరా’ గ్లింప్స్ వైరల్!

త్రిగుణ్ ధూత.. వైల్డ్ కార్డ్స్ కి ఊహించని దెబ్బ..ఇది కదా అసలు గేమ్ అంటే?

Big Stories

Advertisement
×