Karthika Deepam 2 serial today Episode: కార్తీక్ ఎమోషనల్‌గా మాట్లాడుతుంటే అందరూ ఆసక్తిగా వింటుంటారు. శివనారాయణను తన మాటలతో నిలదీస్తుంటే.. శివనారాయణ ఎమోషనల్ అవుతుంటాడు. కార్తీక్ ఎంత మాట్లాడినా శివనారాయణ మౌనంగా ఉంటాడు. దీంతో కార్తీక్ తాను వెళ్లిపోతున్నానని చెప్పి వెళ్లిపోతుంటే.. శివనారాయణ చేయి పట్టుకుని ఆపేస్తాడు. అది చూసిన పారిజాతం, జ్యోత్స్న షాక్ అవుతారు.
శివనారాయణ ఏడుస్తూ.. ఇప్పుడు కానీ నువ్వు ఇంట్లోంచి బయటకు వెళ్లిపోతుంటే.. ఇన్నాళ్ల శివనారాయణ ఆదర్శానికి పాడె కట్టినట్టు.. నా ఆవేశం కోపం నిజంగానే నాలోని మంచితనాన్ని చంపేశాయి. నేను రక్తం ఇచ్చినప్పుడు ఎవరికి ఇచ్చానో గుర్తు లేదు. ప్రాణం తీసేవడి కన్నా ప్రాణం పోసేవాడే గొప్పవాడు అన్న నా ధర్మానికే నేను ఎప్పుడూ కట్టుబడతాను. నువ్వు నా మనవడిగా నా ధర్మాన్ని పాటించడమే కాదు. నా ధర్మాన్ని కాపాడావు.. ఓరేయ్ నువ్వు తండ్రినే కాదు ఈ తాతను కూడా కాపాడావు.. కాంచన నీ పెంపకాన్ని చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది అంటూ ఎమోషనల్ అవుతూ శివనారాయణ లోపలికి వెళ్లిపోతాడు. కార్తీక్ ఎమోషనల్ అవుతుంటాడు. సుమిత్ర ఏడుస్తూ కార్తీక్ దగ్గరకు వస్తుంది. కార్తీక్ తాత ఇప్పుడు బాగానే ఉన్నాడు అత్త అని చెప్పగానే.. లోపలికి వెళ్లిపోతుంది. కాంచన, శ్రీధర్ ఎమోషనల్ అవుతుంటారు. ఇద్దరూ కలిసి పారిజాతం, జ్యోత్స్నను తిడతారు. జ్యోత్స్న, పారిజాతం వెళ్లిపోతారు.
స్వప్నకు జ్వరం వచ్చిందని కంగారుపడుతుంది కావేరీ, అప్పుడే కాశీ వస్తాడు. కాశీకి విషయం చెప్తుంది. వెంటనే కాశీ పరుగెత్తుకుంటూ స్వప్న దగ్గరకు వెళ్తాడు. వేడి నీళ్లు కాపురం పెడతానని స్వప్న కాళ్లు పట్టుకుంటాడు కాశీ. దీంతో స్వప్న షాక్ అవుతుంది. నా కాళ్లు పట్టుకోవద్దని స్వప్న చెప్తుంది. దీంతో తల్లికూతుళ్ల బంధం కన్నా భార్యాభర్తల బంధం గొప్పదని కాశీ చెప్పి స్వప్న పాదాలకు వేడి నీళ్లతో కాపురం పెడతాడు. స్వప్న ఎమోషనల్ అవుతుంది.
జ్యోత్స్న, పారిజాతం రూంలోకి వెళ్లి ఇరిటేటింగ్ గా ఫీలవుతుంటారు. పారిజాతం, జ్యోత్స్నను జాగ్రత్తగా ఉండమని చెప్తుంది ఈ గొడవకు కారణం నువ్వే అని తెలిసింది కాబట్టి నిన్ను అంత తేలికగా ఎందుకు వదిలిపెడతారు. ఇప్పుడు వాడు చాన్స్ తీసుకోవడానికే చూస్తాడు.. అని చెప్పగానే.. ఆ చాన్స్ బావకు దొరకదు గ్రాని అంటుంది. దీంతో పారిజాతం భయంగా మళ్లీ ఏ సమస్య ఇంట్లో అడుగుపెడుతుందోనని నాకు భయంగా ఉందే అంటుంది.. అప్పుడే సూరజ్ ఇంట్లోకి అడుగుపెడతాడు. సూరజ్‌ను చూసిన కార్తీక్ ఆశ్చర్యపోతాడు. ఎందుకొచ్చావని అడగ్గానే.. నష్టపరిహారం కోసం వచ్చానని పెద్దాయనతో మాట్లాడాలని చెప్తాడు. కార్తీక్ వెంటనే శివనారాయణను పిలుస్తాడు. పారిజాతం ఏంట్రా అరుస్తున్నావు అంటూ వస్తుంది. మిగతా అందరూ ఎంట్రీ ఇస్తారు. జ్యోత్స్న కూడా వచ్చి సూరజ్‌ను చూసి భయపడుతుంది.
సూరజ్ తనకు జ్యోత్స్న చేసిన అన్యాయం తన ఫుడ్ స్టాల్‌ను నాశనం చేసిందని చెప్తుంటే.. జ్యోత్స్న కోపంగా సూరజ్‌ను తిడుతుంది. దీంతో శివనారాయణ కల్పించుకుని జ్యోత్స్నను ఆపేసి సూరజ్‌ను చెప్పమని చెప్తాడు. సూరజ్ తనకు నష్టం కలిగిందని నష్టపరిహారం కావాలి అంటూ తన గురించి చెప్పుకుంటాడు. తన స్టాల్‌ను జ్యోత్స్న మొత్తం డ్యామేజ్ చేయించిందని సూరజ్ చెప్తాడు. జరిగిన దానికి అంతా కార్తీక్ గారే సాక్ష్యమని చెప్తాడు. దీంతో శివనారాయణ కార్తీక్‌ను సూరజ్ చెప్పేది నిజమా అని అడగ్గానే.. కార్తీక్ అవునని సూరజ్ చేసేది నిజమేనని.. పెద్ద మేడం గారే స్టాల్ ను తీసేయించారు. అనగానే.. జ్యోత్స్న కోపంగా కార్తీక్‌ను తిడుతుంటే.. సూరజ్ తన దగ్గర ఫ్రూప్స్ ఉన్నాయని యూట్యూబ్‌లో ఉన్న వీడియో చూపిస్తాడు. వీడియో చూసిన శివనారాయణ షాక్ అవుతాడు. ఇంతలో కార్తీకదీపం2 ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.