E-Paper
Advertisement

Illu illaalu Pillalu Srivalli : ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు ‘ శ్రీవల్లి ఆస్తులు.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Illu illaalu Pillalu Srivalli : ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు ‘ శ్రీవల్లి ఆస్తులు.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?
Advertisement

Illu illaalu Pillalu Srivalli : తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని సీరియల్ఇల్లు ఇల్లాలు పిల్లలు.. ఉమ్మడి కుటుంబంలోని మనుషుల మధ్య వ్యత్యాసాలు ఎలా మొదలవుతాయి. పెత్తనం కోసం కొందరు వేసే డ్రామాలు కుటుంబంలో ఎలాంటి పరిస్థితులను క్రియేట్ చేస్తాయి.?. కొడుకులు కోసం కష్టపడే తండ్రి ఆవేదన ఎలా ఉంటుంది?. భర్తని బాధ పెట్టకుండా చూసుకోవాలనుకునే భార్య యొక్క ప్రేమ ఆ ఇంటికి అండగా నిలుస్తుందా? డబ్బుల కోసం ఏమైనా చేసే మనుషులు కుటుంబాన్ని చిన్నాభిన్నం చేస్తారా ఇలాంటి ఎన్నో ప్రశ్నలు ఈ సీరియల్ చూస్తున్నా జనాలకి వస్తూ ఉంటాయి. మిగిలిన అందరూ కూడా కుటుంబంలోని మనిషిగా నా కుటుంబమని కలిసిపోతారు. ఆ ఇంటి పెద్ద కోడలు అయిన శ్రీవల్లి మాత్రమే మంచిది అనిపించుకోవడానికి పక్కన వాళ్ళని చెడ్డవాళ్ళని చేస్తూ ఉంటుంది. పెత్తనం కోసం అడ్డదారులు తొక్కుతుంది. చివరికి తాను చేసిన మోసాలు బయటపడి అందరికీ అడ్డంగా దొరికిపోతుంది. అలాంటి శ్రీవల్లి పాత్రలో సీరియల్ నటి త్రివేణి యాదవ్ నటిస్తున్నారు. ఈమె గురించి సోషల్ మీడియాలో ఏదో ఒక వార్త వినిపిస్తూనే ఉంటుంది. తాజాగా ఈమె ఆస్తులు గురించి? అలాగే సీరియల్స్ కి ఇప్పటివరకు తీసుకున్న రెమినరేషన్ గురించి ఓ వార్త చెక్కర్లు కొడుతుంది. మరి ఆమె ఆస్తులు విలువ ఎంత ఉంటుంది? ఇప్పుడు మనం ఒకసారి వివరంగా తెలుసుకుందాం..

శ్రీవల్లి ఆస్తుల విలువ ఎంత..?

టాలెంటు ఎవడబ్బ సొత్తు కాదు. టాలెంట్ అనేది ఉంటే జీవితంలో ఏదో ఒక రోజు అత్యున్నత స్థాయికి చేరుకుంటారు అని చాలామంది నిరూపించారు. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది టాలెంట్ను నమ్ముకుని పైకి వచ్చిన వారే ఉన్నారు. అలా సీరియల్స్లలో కూడా తమ టాలెంట్ తో తెలుగు ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసుకుంటున్నారు.. సీరియల్లో నటించి మంచి గుర్తింపును తెచ్చుకున్న ముద్దుగుమ్మలలో త్రివేణి యాదవ్ ఒకరు. ఈమె గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎన్నో సీరియల్స్లలో నటించి ప్రేక్షకులను మెప్పించింది. అయితే ఈమె ఆస్తులు విలువ గురించి తెలుసుకునేందుకు నెటిజన్లు ఆసక్తి కనబరుస్తున్నారు.. మరి ఆమె ఆస్తుల విషయానికి వస్తే.. ఒకప్పుడు తినడానికి తిండి లేని పరిస్థితి నుంచి ఇప్పుడు తన కుటుంబాన్ని చూసుకునే స్థాయికి ఎదిగింది. వరుసగా సీరియల్స్ చేస్తూ సొంత ఇంటిని కట్టుకుంది. ఆమెకు సొంత ఊరులో కొన్ని ఆస్తులు కూడా ఉన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. త్రివేణి సంపాదించిన ప్రతి రూపాయి కూడా తన కుటుంబం కోసం ఖర్చు పెట్టిందని గతంలో ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టింది. కష్టపడితే ఫలితం దక్కకపోదు అని నిరూపించింది. రోజుకి 5000 తీసుకునే త్రివేణి ఇప్పుడు దాదాపు 25 వేలకు పైగా తీసుకుంటుంది. ఆమె టాలెంట్ కి జనాలు ఫిదా అవుతున్నారు.. ఆమె డెడికేషన్ కి ఎవరైనా సరే సెల్యూట్ చేయాల్సిందే..

త్రివేణి సీరియల్స్ విషయానికొస్తే..

Advertisement

ఇల్లు ఇల్లాలు పిల్లలు హీరోయిన్ శ్రీవల్లి అలియాస్ త్రివేణి గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన మొదటి సీరియల్ నుంచి ఇప్పటివరకు ఒక్కో సీరియల్ తో తన గ్రేస్ ని పెంచుకుంటూ స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకుంది.. ఈ అమ్మడు ప్రముఖ తెలుగు ఛానల్ జెమినీ టీవీలో ప్రసారమైన సుందరి అనే సీరియల్ ద్వారా బుల్లితెరకు పరిచయమైంది. ఆ సీరియలు ఎంత క్రేజ్ ని సంపాదించుకుందో అందరికీ తెలుసు. ఆ సీరియల్ తర్వాత ఈమెకు అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. సీరియల్స్ తో పాటుగా సినిమాలు కూడా చేసింది. సప్తగిరి ఎల్ ఎల్ బీ, మిడిల్ క్లాస్ మెమొరీస్, క్రాక్, కేసీఆర్ బయోపిక్ వంటి సినిమాల్లో నటించింది. ఆంధ్రాలోని గుంటూరులో పుట్టిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత వైజాగ్ లో తన బాల్యాన్ని చదువుని పూర్తి చేసుకుంది.. నటనపై ఇంట్రెస్ట్ తో ఇండస్ట్రీ వైపు అడుగులు వేసింది. ఒక్కో సీరియల్ తో తన టాలెంట్ నే నిరూపించుకుంటూ ఒక్కో మెట్టు ఎదుగుతూ ఇప్పుడు టాప్ నటిగా కొనసాగుతుంది. ప్రస్తుతం ఈమె ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్లో నటిస్తూ బిజీగా ఉంది.

Also Read :‘ఇల్లు ఇల్లాలు పిల్లలు ‘ సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. ప్రేమ అవుట్..!

Related News

సింగర్ అంతడుపుల రమాదేవి ఒక్క పాటకు ఎంత తీసుకుంటారో తెలుసా?

Telugu Tv Serials : సీరియల్స్ వీక్లీ రౌండప్.. ఆ ఒక్కటే మళ్లీ టాప్..

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి కొత్త టెన్షన్.. చింటును బాలు తెస్తాడా..? గుణ ప్లానేంటి..?

Podarillu Today Episode : నారాయణకు అడ్డంగా దొరికిన జమున.. కన్నా సీరియస్.. ఇదేం ట్విస్ట్..

Intinti Ramayanam Today Episode: అక్షయ్ మాటతో మీనాక్షి షాక్.. పల్లవికి మైండ్ బ్లాక్.. అరెస్ట్ చేస్తారా..?

Illu Illalu Pillalu Today Episodes: రెచ్చిపోయిన భాగ్యం.. రామరాజు మాస్ వార్నింగ్.. వల్లికి ఇంకో ఛాన్స్..

Sunday TV Movies : ఆదివారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. మస్ట్ వాచ్..

Nindu Noorella Saavasam Serial Today Episode October 18th‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి కోల్‌ కతా వెళ్లడానికి వైజయంతి ఒప్పుకుంటుందా..?

Big Stories

Advertisement
×