E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episode: మరదలను దారుణంగా అవమానించిన కామాక్షి.. చందును కంట్రోల్లో పెట్టుకున్న శ్రీవల్లి..

Illu Illalu Pillalu Today Episode: మరదలను దారుణంగా అవమానించిన కామాక్షి.. చందును కంట్రోల్లో పెట్టుకున్న శ్రీవల్లి..
Advertisement

Illu Illalu Pillalu Today Episode April 20th : నిన్నటి ఎపిసోడ్ లో.. భాగ్యం మాత్రం తన కూతురిని ఇంటిని మొత్తం నీ కంట్రోల్లో పెట్టుకోవాలని క్లాసు పీకుతుంది.. ఇంకా చందు చేతిలో శ్రీవల్లిని పెట్టి అప్పగిస్తారు.. తల్లి కూతుర్లు ఇద్దరు కలిసి కన్నీళ్లు పెట్టుకుంటారు. వీరిద్దరినీ చూసి అక్కడ వాళ్లు అందరు ఎమోషనల్ అవుతారు. ఇక వేదవతి ఇద్దరి కోడళ్లనీ ఇంటికి పంపిస్తుంది. ఇంట్లో పెద్దోడు శ్రీవల్లి వచ్చేలాగా హారతిని ఏర్పరిచాలని ఇంటికి పంపిస్తుంది అయితే తోడుగా ధీరజ్ ను పంపిస్తుంది. ధీరజ్ ప్రేమ గొడవ చూసి నర్మదా షాక్ అవుతుంది. ఏమైంది అంటే ఏం కాలేదు అని అంటారు. కానీ మీ ఇద్దరు ఎప్పుడు ఇలాగే కొట్టుకుంటారా అని నర్మదా అడుగుతుంది. శ్రీవల్లిని అప్పగిస్తూ భాగ్యం కన్నీళ్లు పెట్టుకుంటుంది. వీళ్ళను చూసి సాగర్ కన్నీళ్లు పెట్టుకుంటాడు. ఇదంతా చూసిన వారంతా సాగర్ పై సెటైర్స్ వేస్తారు. ఇక శ్రీవల్లిని చందు చేతిలో పెడుతుంది. మా అమ్మిని కన్నీళ్లు పెట్టకుండా చూసుకోవాలని అప్పగించి పక్కకు తీసుకెళ్లి నువ్వు చక్రం తిప్పాలి. నేను చూసుకుంటాను అని భాగ్యం అంటుంది.. ఇక వాళ్లను చూసి భాగ్యం పెళ్లి అయితే చేశాను. ఇక పెత్తనం మొత్తం నా కూతురి చేతికి వచ్చేలా ప్లాన్ చేస్తుంది. ఆనందరావు మాత్రం నువ్వు ఏదైనా చేస్తావు అని అంటాడు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.

ఇక ఇవాళ ప్రోమో విషయానికొస్తే.. శ్రీవల్లి తన తల్లిదండ్రులను వదిలేసి వస్తున్నందుకు కన్నీళ్లు పెట్టుకుంటుంది. చందు ఎంత ఓదార్చినా తను కంట్రోల్ అవ్వదు. కామాక్షి మాత్రం నువ్వేమీ వేరే దేశానికి వెళ్ళట్లేదు ఇదే ఊర్లోనే మీ అమ్మానాన్న ఉంటారు. నువ్వు ఎప్పుడు కాబట్టి అప్పుడు వెళ్లేసి రావచ్చు అని అంటుంది. ఇక సాగర్ నువ్వు అలా ఏడవకు వదిన నువ్వు ఏడుస్తుంటే నాకు కన్నీళ్లు వస్తున్నాయని కన్నీళ్లు పెట్టుకుంటాడు. ఇక కారులో సరదాగా ఉండాలని పాటలు పెడతాడు. సిచ్యువేషన్ తగ్గట్టు పాటలు వస్తున్నాయి అనగానే శ్రీవల్లిని ఇంకా బాధ పెడతాయి.. ఇక కామాక్షి గోల భరించలేక సాగర్ పాటలు ఆపేస్తాడు.

Advertisement

అటు ఇంటి దగ్గర నర్మదా ప్రేమ ఇద్దరూ తమకు జరగని వాటిని తలుచుకొని బాధపడుతూ ఉంటారు. ఇక ధీరజ్ వచ్చి వాళ్లంతా వస్తున్నారు. మీరిద్దరూ ఏం చేస్తున్నారు. ఇక్కడ ఎదో జరుగుతుంది అని అంటారు. ఇంట్లో అంతా సిద్ధం హరతి ఇచ్చి లోపలికి తీసుకురావడమే తరువాయి అని అంటుంది నర్మదా.. అప్పుడే అక్కడకు వాళ్లు వచ్చేస్తారు. ఇంతలో వేదవతి.. నా కోడళ్లు ఇస్తారులే అని వాళ్ల మధ్య పుల్ల పెడుతుంది. ఈమె చేసేవన్నీ ఇలాంటి వంకరపనులే. సాంప్రదాయం ప్రకారం ఇంటి ఆడపడుచే హారతి ఇస్తుంది. కానీ.. వేదవతి మాత్రం కోడళ్లతో హారతి ఇప్పిస్తుంది. నేను ఈ ఇంటి ఆడబిడ్డని నేను కదా హారతి ఇవ్వాలి.. వాళ్లని ఇవ్వమంటావ్ ఏంటి? కడిగిపారేస్తుంది కూతురు కామాక్షి. ఒసేయ్ వాళ్లు ఈ ఇంటి కొడళ్లే.. తోడుకోడళుకి హారతి ఇస్తే బావుంటుంది అని ఫిటింగ్ పెడుతుంది వేదవతి. లేదు లేదు.. నేను ఒప్పుకోను.. ఇంటి ఆడపడుచుగా నేనే హారతి ఇస్తాను అని మొండికేస్తుంది కామాక్షి..

హారతి ఇచ్చిన తరువాత ప్లేట్‌లో డబ్బులు వేస్తారు కదా.. మరి అవి ఎవరికి ఇస్తారు? అని అడుగుతుంది కామాక్షి. దానికి అంతా పెద్దగా నవ్వుకుని.. నువ్వు సూపరెహే.. హారతి ఇస్తానంటే వాళ్ల పై ప్రేమతో అనుకున్నా.. ఆ డబ్బులపై ప్రేమతోనా? .. ఆ డబ్బులు నువ్వే తీసుకుందువులే కానీ.. హారతి ఇవ్వనువ్వు అని అంటాడు రామరాజు. దాంతో సరేనని అంటుంది కామాక్షి. ఆ తరువాత ఇద్దరు కోడళ్లు.. కొత్త కోడలికి హారతి ఇచ్చి లోపలికి తీసుకురావాలని అనుకుంటారు. కానీ కామాక్షి మాత్రం పేర్లు చెప్పేవరకు లోపలికి రానివ్వను అని అంటుంది.

Advertisement

శ్రీవల్లి చందు పేరు చెప్పడానికి తెగ సిగ్గు పడిపోతుంది. అందరూ కలిసి శ్రీవల్లిని ఒక ఆట ఆడుకుంటారు. శ్రీవల్లి సిగ్గుపడే సీన్ అయితే హైలైట్ అంతే. ఆ తంతు ముగిసిన తరువాత.. అత్తారింట్లో కుడికాలు పెట్టేస్తుంది శ్రీవల్లి. ఇక ఈ పెళ్లి తంతు అంతా చూసిన తరువాత.. ప్రేమ, నర్మదలు మళ్లీ ఎమోషనల్ అవుతారు. ఇంతగొప్ప సంతోషాన్ని మేం కోల్పోయాం అని మళ్లీ బాధపడతారు. తమ పెళ్లిళ్ల విషయంలో జరిగిన గొడవల్ని తలుచుకుని కన్నీళ్లుపెట్టుకుంటారు.. కామాక్షి నాన్న నీకు ముగ్గురు కోడలు వచ్చారు కానీ ఒక్క కోడలు మాత్రమే సాంప్రదాయంగా పద్ధతిగా వచ్చింది అని కామాక్షి అంటుంది. మిగతా వాళ్ళు ఏమి తీసుకురాలేదని ఎద్దేవా చేస్తుంది. ప్రోమో ఎండ్ అవుతుంది.. సోమవారం ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Related News

Intinti Ramayanam Today Episode: పాపం మీనాక్షికి కన్నీళ్లు.. పల్లవి, కమల్ రొమాన్స్.. యోగా టీచర్ ఎంట్రీ అదుర్స్..

Brahmamudi Serial Today Episode July 21st ‘బ్రహ్మముడి’ సీరియల్‌: దుగ్గిరాల ఇంటికి వచ్చిన రాజు   

Actress Sirisha : నటి శిరీష నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

Godhavari Janu : ‘గోదావరి ‘ లవర్స్ కు షాకింగ్ న్యూస్.. హీరోయిన్ అవుట్..

Telugu Serials : సీరియల్స్ కు పేమెంట్ ఎలా ఇస్తారు..? అర్రె ఇన్నాళ్లు ఇది మిస్ అయ్యామా..?

Tuesday Movies in Tv : మంగళవారం టీవీ సినిమాలు.. వీటిని మిస్ చెయ్యకండి..

బిగ్ బాస్ సీజన్ 10కి ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడంటే?

డైరెక్టర్ అనిల్ రావిపూడి కాలర్ పట్టుకున్న సుడిగాలి సుధీర్.. ఏం జరిగింది?

Big Stories

Advertisement
×