Employee Kills Manager| ఆవేశంలో విచక్షణ లేకుండా హింసకు పాల్పడితే అనర్థాలే ఎదురవుతాయి. ఇటీవలే ఒక ఆఫీసులో పని చేసే మేనేజర్.. అతని వద్ద పనిచేసే ఉద్యోగి పనితీరు విషయంలో మందలించాడు. అయినా అతను నిర్లక్ష్యంగా ఉండే సరికి కోపడ్డాడు. ఆ తరువాత ఇదంతా మనసులో పెట్టుకొని ఆ ఉద్యోగి తన మేనేజర్ పై హింసాత్మకంగా దాడి చేశాడు. దాంతో అతను చికిత్స పొందుతూ మరణించాడు. ఈ ఘటన తమిళనాడులో జరిగింది.
వివరాల్లోకి వెళితే.. తమిళనాడు రాజధాని చెన్నై నగరానికి 44 కిలోమీటర్ల దూరంలో ఉన్న తిరువల్లూర్ లో మనాలి న్యూ టౌన్ సమీపంలోని వెల్లి వయాల్ చావడి ప్రాంతంలో ఒక యార్డు ఉంది. ఆ యార్డులో పెద్ద పెద్ద గోడౌన్లు ఉన్నాయి. కంపెనీ సరుకులు అక్కడ స్టోర్ చేసి పెడుతుంటారు. అవసరమైనప్పుడు తీసుకెళుతుంటారు. ఈ క్రమంలో అక్కడ సరుకు లోడింగ్ అన్ లోడింగ్ పని చేసే లేబర్ గా బాలాజీ అనే 25 ఏళ్ల యువకుడు పనిచేస్తున్నాడు.
ఆ గోడౌన్ లోని ఆఫీస్ మేనేజర్ గా 45 ఏళ్ల సాయి ప్రశాంత్ ఉద్యోగం చేస్తున్నాడు. ఆంధ్ర ప్రదేశ్ లోని కుడూర్ ప్రాంతానికి చెందిన సాయి ప్రశాంత్ అక్కడ సిన్సియర్ మేనేజర్ గా పేరు తెచ్చుకున్నాడు . ఈ క్రమంల కొన్ని రోజుల క్రితం లేబర్ గా పనిచేస్తున్న బాలాజీ అనుమతి లేకుండా డ్యూటీ నుంచి తాను సెలవు తీసుకుంటున్నట్లు చెప్పి వెళ్లిపోయాడు. దీంతో అక్కడ పని చాలా ఆలస్యమైంది. కంటెయినర్లలో లోడింగ్ అన్ లోడింగ్ ఆగిపోయింది. పనిలో తీవ్ర జాప్యం కావడంతో సమస్య మేనేజర్ సాయి ప్రశాంత్ దృష్టకి వెళ్లింది.
దీంతో మరుసటి రోజు డ్యూటీకి వచ్చిన లేబర్ బాలాజీని మేనేజర్ సాయి ప్రశాంత్ పిలిచి తన అనుమతి లేకుండా వెళ్లిపోవడం తప్పు అని.. మళ్లీ ఇలా చేస్తే క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించాడు. కానీ బాలాజీ మాత్రం ఆయనతో వాగ్వాదం చేశాడు. దీంతో ఆగ్రహించిన మేనేజన్ ప్రశాంత్.. బాలాజీని అక్కడ ఉద్యోగం నుంచి తొలగించేశాడు. మరోసారి యార్డులోకి అడుగుపెట్టకూడదని బాలాజీకి వార్నింగ్ ఇచ్చాడు.
ఇదంతా అక్కడ ఉన్నవారందరి ముందు జరగడంతో బాలాజీ తనకు జరిగిన అవమానంగా ఫీలయ్యాడు. అందుకే సాయి ప్రశాంత్ పై పగబట్టాడు. మరుసటి రోజు రాత్రి బాలాజీ మరో ఏడుగురు మంది తన మిత్రులతో కలిసి తిరిగి వచ్చాడు. వారిని లోపల రాకుండా సెక్యూరిటీ గార్డ్ అడ్డుకున్నాడు. కానీ బాలాజీ మాత్రం కేవలం కాసేపు వెళ్లిపోతామని చెప్పి తన స్నేహితులతో సహా బలవంతంగా యార్డు లోపలకి దూరాడు.
Also Read: 3 నిమిషాల్లో 102 ఖరీదైన వాచీలు చోరీ.. పోలీస్ స్టేషన్ పక్కనే దొంగతనం
లోపల గోడౌన్ ఆఫీస్ క్యాబిన్ లో ఉన్న మేనేజన్ ప్రశాంత్ వద్దకు బాలాజీ, అతని ఏడుగురు స్నేహితులు దూసుకుపోయి తమతో తెచ్చుకున్న రాడ్లు, కత్తితో దాడి చేశాడు. మేనేజర్ ప్రశాంత్ కడుపులో కత్తితో పలుమార్లు పొడిచారు. ఆ తరువాత ప్రశాంత్ అపస్మారక స్థితిలో ఉండేసరికి అతడిని అక్కడే వదిలి పారిపోయారు. గోడౌన్ లోని సెక్యూరిటీ సిబ్బంది మేనేజర్ ప్రశాంత్ ని వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే అతన మరణించినట్లు డాక్టర్లు ధృవీకరించారు.
పోలీసులు మేనేజర్ సాయి ప్రశాంత్ హత్య కేసు నమోదు చేసుకొని నిందితుడు బాలాజీ, అతని స్నేహితుల కోసం గాలిస్తున్నారు.