BigTV English

RCB VS CSK : థియేటర్ లోనే కొట్టుకున్న ధోని, కోహ్లీ ఫ్యాన్స్… జెర్సీలు పట్టుకుని మరీ

RCB VS CSK : థియేటర్ లోనే కొట్టుకున్న ధోని, కోహ్లీ ఫ్యాన్స్… జెర్సీలు పట్టుకుని మరీ

RCB VS CSK :  సాధారణంగా సమ్మర్ వచ్చిందంటే చాలు ఐపీఎల్ సీజన్ ప్రారంభం అవుతుంది. ఐపీఎల్ సీజన్ లో ఎవరికీ నచ్చిన ఆటగాడి టీమ్ కి వారు మద్దతు ఇస్తుంటారు. ప్రస్తుతం విరాట్ కోహ్లీ, ఎం.ధోనీకి ఉన్నటువంటి క్రేజీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. చెన్నై టీమ్ ఇప్పటికీ 5 సార్లు ఐపీఎల్ టైటిల్ సాధించింది. అయినప్పటికీ ఒక్క టైటిల్ కూడా సాధించని ఆర్సీబీకి కూడా ఫ్యాన్స్ ఫాలోయింగ్ బాగానే ఉంది. అందుకు కారణం టీమిండియా కీలక ఆటగాడు విరాట్ కోహ్లీ అని చెప్పవచ్చు. ఆర్సీబీ రెండు సార్లు ఐపీఎల్ ఫైనల్ కి వెళ్లినప్పటికీ రెండు సార్లు హైదరాబాద్ చేతిలోనే ఓటమి చెందింది.


Also Read : Memes on RCB : ఎంతకు తెగించార్రా.. RCB ని All Out తో కూడా ట్రోలింగ్ చేస్తున్నారా !

తమిళ హీరో విజయ్ దళపతి నటించిన   సచిన్ మూవీ ఇటీవలే రీ రిలీజ్  అయింది. ఈ మూవీ రిలీజ్ సందర్భంగా తమిళనాడులో అభిమానులు CSK జెండాలను, అలాగే కొంత మంది ఆర్సీబీ అభిమానులు జెర్సీలు, జెండాలను పట్టుకొని థియేటర్ కి వచ్చారు. కొందరూ ఒక సైడ్, మరికొందరూ ఒకసైడ్ థియేటర్ లోని స్క్రీన్ పైకి ఎక్కి డ్యాన్స్ లు కూడా చేశారు. కొంత మంది థియేటర్లోనే చెన్నై సూపర్ కింగ్స్, ఆర్సీబీ అభిమానులు కొట్టుకున్నారు.  ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఎప్పుడో రిలీజ్ మూవీకి ఇంత క్రేజ్ ఉందేంటి..? అని చర్చించుకుంటున్నారు.  ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ కావడంతో ఎవ్వరి అభిమానులు వారికి మద్దతు తెలుపుతూ ఎంజాయ్ చేయడం విశేషం.


ఈ సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు పేలవ ప్రదర్శన కనబరుస్తోంది. కెప్టెన్ గా ఉన్నటువంటి రుతురాజ్ గైక్వాడ్ ఈ సీజన్ కి దూరమైన విషయం తెలిసిందే. ఆ తరువాత సీనియర్ కెప్టెన్ ఎం.ఎస్. ధోనీకి మళ్లీ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. అయినప్పటికీ చెన్నై ఆటగాళ్ల ఆటతీరు మాత్రం మారడం లేదు. ఇప్పటివరకు 7 మ్యాచ్ లు ఆడితే.. అందులో కేవలం 2 మ్యాచ్ లలో మాత్రమే విజయం సాధించి చెన్నై సూపర్ కింగ్స్ జట్టు పాయింట్ల పట్టిక లో చివరి స్థానంలో కొనసాగుతోంది. రన్ రేట్ 1.276 గా ఉంది. మరోవైపు ఆర్సీబీ జట్టు కాస్త మెరుగైన ప్రదర్శననే కనబరుస్తోంది.

ఇప్పటి వరకు ఆర్సీబీ జట్టు 7 మ్యాచ్ లు ఆడగా.. అందులో 4 మ్యాచ్ ల్లో విజయం సాధించి.. పాయింట్ల పట్టికలో 5వస్థానంలో కొనసాగుతోంది. రన్ రేట్ కూడా పాజిటివ్ లోనే ఉంది. 0.446 కొనసాగుతోంది. ఈ సీజన్ లో ఆర్సీబీకి బౌలింగ్ కాస్త బలంగా ఉందనే చెప్పాలి. భువనేశ్వర్, హజెల్ వుడ్, యశ్ దయాల్ బౌలింగ్ బాగానే చేస్తున్నారు. వీరికి తోడు స్పిన్నర్లలో కృనాల్ పాండ్యా, సుయాష్ పర్వాలేదనిపిస్తున్నారు. మొన్న పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో మాత్రం స్పిన్నర్లు ప్రతిభ కనబరచలేకపోయారు. ఇవాళ పంజాబ్ కింగ్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ జరుగనుంది. మొన్న చిన్న స్వామి స్టేడియంలో బెంగళూరు 14 ఓవర్లలో కేవలం 95 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇక ఇవాళ పంజాబ్ సొంత స్టేడియం అయినా ముల్లాన్ పూర్ లో మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్ లో ఎవ్వరూ విజయం సాధిస్తారో వేచి చూడాలి మరీ. 

Related News

BCCI : రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలకు BCCI బిగ్ షాక్…2027 వరల్డ్ కప్ కంటే ముందే కుట్రలు !

Sanju Samson – CSK : సంజూకు ఝలక్.. CSK లోకి అతను వచ్చేస్తున్నాడు!

Digvesh Rathi : దిగ్వేష్ ఒక్కడే పిచ్చోడు అనుకున్నాం.. కానీ వాడిని మించినోడు వచ్చాడు.. ఈ వీడియో చూస్తే పిచ్చెక్కి పోవాల్సిందే

Pakistan Cricketer : ఇంగ్లాండ్ ను ఓడించేందుకు వాజిలిన్ వాడారు…. భారత బౌలర్ల పై పాక్ సంచలన ఆరోపణలు

Mohammed Siraj : ఇండియా గడ్డపై అడుగుపెట్టిన సిరాజ్… ఎయిర్ పోర్టులో ఆయన ఫాలోయింగ్ చూడండి

Jasprit Bumrah: టీమిండియాకు దరిద్రంగా మారిన బుమ్రా.. అతడు ఆడితే ఓటమే.. ఇదిగో లెక్కలు!

Big Stories

×