E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episode: ప్రాణాలతో బయటపడ్డ రామరాజు.. అమూల్యను కొట్టిన విశ్వం.. అయ్యో ఇరుక్కున్న వల్లి..

Illu Illalu Pillalu Today Episode: ప్రాణాలతో బయటపడ్డ రామరాజు.. అమూల్యను కొట్టిన విశ్వం.. అయ్యో ఇరుక్కున్న వల్లి..
Advertisement

Illu Illalu Pillalu Today Episode February 7th: నిన్నటి ఎపిసోడ్ లో.. అమూల్య నిన్ను విశ్వంతో మాట్లాడమని వల్లి ఎందుకు తీసుకొని వెళ్ళింది అని అడుగుతారు. అసలు విశ్వం నన్ను ప్రేమిస్తున్నాడని చెప్పిందే వల్లి వదిన అని అసలు మ్యాటర్ ని వాళ్లకి చెప్పేస్తుంది అమూల్య.. ఇక అమూల్య చెప్పడంతో ప్రేమ సీరియస్ అవుతుంది. నాకు మొదటి నుంచే ఆ బల్లి మీద డౌట్ ఉంది అక్క చూసావా ఇప్పుడు ఎంతటికి తెగించిందో దాని సంగతి ఇప్పుడు తేలుస్తాను అని ప్రేమ అంటుంది.. అమూల్య వద్దు వదిన నా జీవితం ఏదో ఇలా అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ నువ్వు వల్లి వదిన జీవితాన్ని నాశనం చెయ్యొద్దు..

మీరు నాకు మాట ఇచ్చారు. ఇంకేం మాట్లాడొద్దు.. అన్నయ్యకి పెళ్లి కావడం లేదని నాన్న చాలా బాధపడ్డాడు.. ఎన్నో సంబంధాలు చూసిన తర్వాత ఏరి కోరి తెచ్చుకున్న కోడలు వల్లి వదిన.. తన గురించి ఇలా అని తెలిస్తే ఇంక తట్టుకోలేడు.. మీకు చెప్పిన ఈ నిజాన్ని మీరు బయట పెట్టొద్దు అని అమూల్య బ్రతిమలాడుతుంది.. ఇక నర్మదా శ్రీవల్లికి నిజం తెలిసిపోయింది ఇంకొకసారి నువ్వు ఇలానే గనక ఉంటే నీకు వేరేలా ఉంటుంది అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.

Advertisement

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. నర్మదవల నాన్న రామరాజుని చూడడానికి హాస్పిటల్ కి వస్తాడు. అక్కడ ఆయన్ని చూసి మీరేం బాధపడకండి ఆయన వెంటనే కోల్కుంటాడు అని చెప్తాడు. ఆ తర్వాత అందరూ అక్కడికి వచ్చిన తర్వాత ఒక కూతురు ఇలాంటి పని చేస్తే ఏ తంరికైనా ఇదే గతి పడుతుంది అని అంటారు.. అలాగే ఏ తండ్రికి ఇలాంటి కష్టం రాకూడదు అని అతను అంటాడు.. ఇక సాగరును బయటికి రమ్మని పిలుస్తాడు. గవర్నమెంట్ జాబు కొట్టాలి అంటే రేపే లాస్ట్ డేటు ఆ డబ్బులు అరేంజ్ చేసుకుంటే అతనికి డబ్బులు ఇచ్చి జాబ్ కి ఆఫర్ లెటర్ తీసుకోవచ్చు అని అంటాడు. ఇక తర్వాత నర్మదా ప్రేమ ఇద్దరు కూడా భోజనం చేయడానికి అని అందరికీ భోజనం తెస్తారు. తినమని వేదవతిని ఎంతగా బ్రతిమలాడినా సరే.. వేదవతి తినకపోగా వేదవతి బాధపడిపోతూ ఉంటుంది..

రామరాజుకు స్పృహ వచ్చింది అని నర్స్ చెప్పగానే అందరూ సంతోషంతో లోపలికి పరిగెత్తుకొని వెళ్తారు. రామరాజు స్పృహలోకి రావడం చూసి అందరూ సంతోషపడతారు.. అప్పుడే అక్కడికి వచ్చిన డాక్టర్ అతనికి ఊపిరాడనివ్వండి. ఇప్పుడే స్పృహలోకి వచ్చారు కదా మీరు ఇలా గుంపుగా ఉంటే అతను మళ్లీ స్పృహ కోల్పోతాడు అని అంటారు. ఆ తర్వాత రామరాజు హెల్త్ కండిషన్ బాగుంది అని డాక్టర్ చెప్పగానే అందరూ చాలా సంతోషంగా ఫీల్ అవుతారు. భాగ్యం శ్రీవల్లి మాత్రం నర్మదకు తెలిసిన విషయం ఇంట్లో వాళ్లకు తెలిస్తే నన్ను చంపేస్తారు అని టెన్షన్ పడిపోతూ ఉంటారు. ముఖ్యంగా మా ఆయన గనక ఈ విషయం తెలిస్తే నన్ను అసలు బతకనివ్వడు అని శ్రీవల్లి భయపడిపోతూ ఉంటుంది.

Advertisement

నర్మదా అసలే చిరుత పులి ఏదైనా చేస్తుంది. ఇప్పుడు నన్ను ఎన్ని మాటలు అనింది నాకు చెంప పగలగొట్టింది కూడా. అది ఎప్పుడు ఎప్పుడు నా గురించి ఇంట్లో వాళ్లకు చెప్తుందా అని నాకు భయంగా ఉంది అమ్మ అని శ్రీవల్లి అంటుంది. అది విన్న భాగ్యం నువ్వేమి కంగారు పడకు నిన్న మునిగినోడికి చలేమీ ఉండదు. ఈ సమస్య నుంచి బయటపడడానికి ఏదో ఒక మార్గం ఉంటుంది అని అంటుంది. తల్లి కూతురు మాత్రం టెన్షన్ పడిపోతూ ఉంటే. ఆనంద్ రావు తన కామెడీ టైమింగ్ తో వాళ్ళిద్దరి చేత చివాట్లు తినడంతో పాటుగా దెబ్బలు తింటాడు. ఇక ఆ తర్వాత రామరాజు వస్తున్నాడు అని తెలుసుకొని దిష్టి తీయడానికి అన్ని సిద్ధం చేస్తారు.. రామరాజు ఇంట్లోకి రాగానే అమూల్య ని చూసి కన్నీళ్లు పెట్టుకుంటాడు. అమూల్య నావల్ల ఇదంతా అయ్యింది నన్ను క్షమించండి నాన్న అని అనుకుంటుంది.

Also Read :రాజేంద్రను తోసేసింది లేడీ..పల్లవి, చక్రధర్ ప్లాన్.. పార్వతి పరిస్థితి సీరియస్..?

ఇక భాగ్యం ఆగండి అన్నయ్యగారు మీకు దిష్టి తీయాలి అని గుమ్మడికాయ తీసుకొని వస్తుంది. అయితే నర్మదా ఆ గుమ్మడికాయని మా అత్తయ్య గారికి ఇవ్వండి దిష్టి తీస్తోంది అని భాగ్యంతో అనగానే భాగ్యం షాక్ అవుతుంది. నేను సొంత చెల్లె లాంటిదని నేను తీసిన కూడా అన్నయ్య గారికి శుభమే జరుగుతుంది అని ఎంత చెప్తున్నా సరే. మా అత్తయ్య గారికి ఇవ్వండి అని నర్మదా అంటుంది. గుమ్మడికాయతో దిష్టి తీసిన తర్వాత అమూల్య అక్కడుండటం చూసిన విశ్వం ఇక్కడ ఏం చేస్తున్నావే అని కొడతాడు.. ఇక్కడ ఏం పని నీకు పదా లోపలికి అని అంటాడు. అయితే చందు ధీరజ్ ఇద్దరు కూడా పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటే వేదవతి ఆపుతుంది. ఆ తర్వాత తిరుపతి విశ్వంకి వార్నింగ్ ఇచ్చి వస్తాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…

 

Related News

సింగర్ అంతడుపుల రమాదేవి ఒక్క పాటకు ఎంత తీసుకుంటారో తెలుసా?

Telugu Tv Serials : సీరియల్స్ వీక్లీ రౌండప్.. ఆ ఒక్కటే మళ్లీ టాప్..

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి కొత్త టెన్షన్.. చింటును బాలు తెస్తాడా..? గుణ ప్లానేంటి..?

Podarillu Today Episode : నారాయణకు అడ్డంగా దొరికిన జమున.. కన్నా సీరియస్.. ఇదేం ట్విస్ట్..

Intinti Ramayanam Today Episode: అక్షయ్ మాటతో మీనాక్షి షాక్.. పల్లవికి మైండ్ బ్లాక్.. అరెస్ట్ చేస్తారా..?

Illu Illalu Pillalu Today Episodes: రెచ్చిపోయిన భాగ్యం.. రామరాజు మాస్ వార్నింగ్.. వల్లికి ఇంకో ఛాన్స్..

Sunday TV Movies : ఆదివారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. మస్ట్ వాచ్..

Nindu Noorella Saavasam Serial Today Episode October 18th‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి కోల్‌ కతా వెళ్లడానికి వైజయంతి ఒప్పుకుంటుందా..?

Big Stories

Advertisement
×