Umar Akmal: ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( ICC T20 World Cup 2026 tournament) ఇవాల్టి నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. మరికొన్ని గంటల్లోనే ఈ మెగా టోర్నమెంట్ ప్రారంభం అవుతుంది. ఉదయం 11 గంటల సమయంలో నెదర్లాండ్స్ వర్సెస్ పాకిస్తాన్ ( Pakistan vs Netherlands, 1st Match) మధ్య తొలి మ్యాచ్ జరుగనుంది. ఈ మేరకు ఇప్పటికే షెడ్యూల్ కూడా ఖరారు అయింది. అయితే, ఈ టోర్నమెంట్ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్ ఉమర్ అక్మల్ ( Umar Akmal) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండియాతో పాకిస్తాన్ ( India vs Pakistan) మ్యాచ్ ఒకవేళ జరిగితే సైమ్ అయూబ్ ( Saim Ayub ) రెచ్చిపోతాడని వెల్లడించారు ఉమర్ అక్మల్. కేవలం 19 బంతుల్లోనే సెంచరీ కొడతాడని ఇండియన్స్ కు వార్నింగ్ ఇచ్చాడు. దీంతో ఉమర్ అక్మల్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
ఐసీసీ T20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( ICC T20 World Cup 2026 tournament) ఇవాల్టి నుంచి మార్చి 8వ తేదీ వరకు కొనసాగనున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు ఇప్పటికే షెడ్యూల్ కూడా ఖరారైంది. అయితే ఈ టోర్నమెంట్ షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 15వ తేదీన ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ( India vs Pakistan) మధ్య మ్యాచ్ జరగాల్సి ఉంది. అయితే ఈ మ్యాచ్ ఆడబోమని ఇప్పటికే బహిష్కరించింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్. బంగ్లాదేశ్ పట్ల వ్యవహరించిన తీరు నేపథ్యంలో వాళ్లకు సపోర్ట్ గా నిలుస్తూ ఇండియాతో జరిగే మ్యాచ్ ను బహిష్కరిస్తున్నట్లు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఇప్పటికే ప్రకటించింది. అలాగే షేక్ హ్యాండ్ వివాదాన్ని కూడా తాజాగా తెరపైకి తీసుకువచ్చింది. షేక్ హ్యాండ్ ఇవ్వని ప్లేయర్లతో మావాళ్లు క్రికెట్ ఆడబోరని కూడా చెబుతోంది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ( Pakistan Cricket Board).
అయితే ఇలాంటి నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్ ఉమర్ అక్మల్ ( Umar Akmal) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండియాకు నేరుగా వార్నింగ్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఒకవేళ ఫిబ్రవరి 15 వ తేదీన ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగితే, సైమ్ అయూబ్ 19 బంతుల్లోనే సెంచరీ కొట్టేవాడని హెచ్చరించారు. ఈ దెబ్బకు ఇండియన్ క్రికెటర్లు పారిపోయే వారిని కూడా వెల్లడించారు. అయితే ఇండియా అదృష్టం వల్ల ఫిబ్రవరి 15వ తేదీన మ్యాచ్ జరిగే అవకాశాలు లేవని ఉమర్ అక్మల్ వెల్లడించారు. అయితే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ( India vs Pakistan) మధ్య మ్యాచ్ జరిగితే చూడాలని అందరికీ ఉంటుందని స్పష్టం చేశారు.