BigTV English

OTT Movie : పెళ్లి రోజే కాబోయే భర్త జంప్… మతి మరుపుతో ప్రియుడు కూడా… ఓటీటీలో దుమ్ము లేపుతున్న సరికొత్త లవ్ స్టోరీ

OTT Movie : పెళ్లి రోజే కాబోయే భర్త  జంప్… మతి మరుపుతో ప్రియుడు కూడా… ఓటీటీలో దుమ్ము లేపుతున్న సరికొత్త లవ్ స్టోరీ

OTT Movie : ఈ ఏడాది బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ‘సాయారా’ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ సినిమా బాక్సాఫీస్‌లో ₹579 కోట్లు సాధించి రికార్డ్ సృష్టించింది. చూడ చక్కని లవ్ స్టోరీ, వినసొంపైన పాటలతో ఈ సినిమా థియేటర్లలో ఆడియన్స్ ని బాగా అలరించింది. ఈ కథలో ప్రియురాలు ఆల్జైమర్స్ వ్యాధి వల్ల గతం మరచిపోవడంతో అసలు కథ మొదలవుతుంది. అయితే ప్రియుడు తన పాటల ద్వారా, ఆమె ప్రేమను తిరిగి పొందటానికి చేసే ప్రయత్నాలు కళ్ళు చెమ్మ గిల్లేలా చేస్తాయి. ఈ సినిమా ఓటీటీలో కూడా దూసుకెళ్తోంది. ఇది ఏ ఓటీటీలో ఉంది ? కథ ఏమిటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.


నెట్‌ఫ్లిక్స్‌లో

‘సాయారా’ 2025లో విడుదలైన హిందీ రొమాన్టిక్ మ్యూజికల్ డ్రామా చిత్రం. మొహిత్ సూరి దర్శకత్వంలో, అహాన్ పాండే (కృష్), అనీత్ పద్దా (వాణి) ప్రధాన పాత్రల్లోనటించారు. మిథూన్, శాస్వత్ సచేత్ సంగీతం అందించారు. సుమారు 2 గంటల నిడివి ఉన్న ఈ సినిమా, IMDbలో 6.4/10 రేటింగ్ పొందింది. ఈ సినిమా 2025 జూలై 18న థియేటర్లలో విడుదలైంది. నెట్‌ఫ్లిక్స్‌లో సెప్టెంబర్ 12 నుంచి స్ట్రీమింగ్‌లో ఉంది.

స్టోరీలోకి వెళ్తే

వాణి అనే యువతి జర్నలిస్ట్ గా ఉంటూ, కవితలు కూడా రాస్తుంటుంది. ఆమెకు పెళ్లి జరిరగిన రోజే భర్త ఆమెను వదిలేసి వెళ్లిపోతాడు. ఆ రోజు నుంచి ఆమె చాలా డిప్రెషన్ లో ఉంటుంది. ఆ బాధలో ఆమె కవితలు రాయడం మొదలు పెడుతుంది. ఆరు నెలల తర్వాత, వాణి జర్నలిస్ట్‌గా పని చేస్తూ క్రిష్ అనే వ్యక్తిని కలుస్తుంది. ఈ యువకుడు ఒక సంగీతకారుడు. కానీ కొంచెం కోపిష్టి. అతని కలలు పెద్ద స్థాయిలో ఉంటాయి. కానీ తన జీవితంలో అతను ఇంకా పెద్ద అవకాశం పొందలేదు. ఈ సమయంలో క్రిష్ వాణి కవితలు చిదివి, వాటికి చాలా ఇంప్రెస్ అవుతాడు. అవి అతని సంగీతానికి సరిపోతాయని అనుకుంటాడు. అతను వాణిని ఒప్పించి, తన పాటలకు లిరిక్స్ రాయమని అడుగుతాడు. మొదట వాణి ఒప్పుకోదు, ఎందుకంటే ఆమె ఇంకా తన గత బాధ నుండి బయటపడలేదు. కానీ క్రిష్ ఆమెను ఒప్పిస్తాడు. వాళ్లు కలిసి పని చేయడం మొదలు పెడతారు. కృష్ పాటలు పాడుతాడు, వాణి ఆ పాటలకు మాటలు రాస్తుంది. ఈ ఇద్దరూ కలసి పని చేస్తున్న సమయంలో, వాళ్ల మధ్య ప్రేమ మొదలవుతుంది.


వాణి తన బాధను మరచి, క్రిష్ తో సంతోషంగా ఉంటుంది. కృష్ కూడా తన కోపాన్ని తగ్గించుకుని, వాణి సహాయంతో తన కలల వైపు ముందుకు సాగుతాడు. వాళ్ల అందంగా సాగుతుంది. సంగీతం, పాటలు వాళ్ల సంబంధాన్ని మరింత బలపరుస్తాయి. కానీ జీవితం అంత సులభంగా ఉండదు. వాణికి ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఆమెకు ఆల్జైమర్స్ అనే వ్యాధి ఉందని తెలుస్తుంది. అది ఆరంభ దశలో ఉంటుంది. దీంతో ఆమె తన జ్ఞాపకశక్తిని కోల్పోతుంటుంది. వాణి ఇది తెలుసుకుని భయపడుతుంది. ఆమె ఈ విషయాన్ని క్రిష్ తో పంచుకోదు, ఎందుకంటే అతన్ని బాధపెట్టకూడదని అనుకుంటుంది. ఈ వ్యాధి వల్ల వాణి తన చిన్న చిన్న విషయాలు మర్చిపోతుంది. క్రిష్ ఆమె మార్పును గమనిస్తాడు.

వాళ్ల ప్రేమలో ఇప్పుడు భయం, బాధలు వస్తాయి. కృష్ తన సంగీత కెరీర్‌లో కొంచెం ముందుకు వెళ్తాడు. వాణి లిరిక్స్ వల్ల అతని పాటలు పాపులర్ అవుతాయి. కానీ వాణి వ్యాధి మరింత తీవ్రమవుతుంది. ఆమె గత జ్ఞాపకాలు, క్రిష్ తో గడిపిన క్షణాలు మర్చిపోతుంది. క్రిష్ ఆమెకు సపోర్ట్ అవ్వడానికి ప్రయత్నిస్తాడు. అతను ఆమెను చికిత్స తీసుకునేలా చేస్తాడు, కానీ వ్యాధి ముదిరి, ఆమె క్రిష్ ని పూర్తిగా మర్చిపోతుంది. కానీ క్రిష్ ఆమెను పాటలు, కవితలు ద్వారా, గతం గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఈ క్లైమాక్స్‌ ఒక ఎమోషనల్ టచ్ తో ముగుస్తుంది. వాణి, క్రిష్ ల ప్రేమ చివరికి ఏమవుతుందనేది ఈ సినిమాని చూసి తెలుసుకోవాల్సిందే.

Read Also : ట్రాన్స్ జెండర్ పై మోహం… ఒక్కసారి చూడడం స్టార్ట్ చేస్తే ఆపరు భయ్యా

Related News

OTT Movie : చావును ముందే పసిగట్టే యాప్… ప్రతీ 5 నిమిషాలకో ట్విస్ట్… మైండ్ బెండయ్యే ట్విస్టులు

OTT Movie : భర్తపోయి బాధపడుతున్న అమ్మాయితో ఇదెక్కడి దిక్కుమాలిన పని ? సైకోకు అమ్మాయి ఇచ్చే షాక్ హైలెట్ భయ్యా

OTT Movie : మొగుడి మీద అనుమానం… మరో అమ్మాయిని భర్త రూమ్ లోకి పంపి… ఈ స్టోరీ మైండ్ బ్లోయింగ్

OTT Movie : 38 ఏళ్ళ ఆంటీతో 20 ఏళ్ళ అబ్బాయి… స్టూడెంట్ తోనే పని కానిచ్చే కథ… సింగిల్స్ కు పండగే

OTT Movie : ఆంటీ అరాచకం… టీనేజ్ అబ్బాయితో పాడు పనులు… ఒంటరిగా చూడాల్సిన మూవీ

OTT Movie : డైవింగ్ కు వెళ్లి దిక్కుమాలిన చావు… ఒళ్ళు జలదరించే సీన్స్ ఉన్న సర్వైవల్ థ్రిల్లర్

OTT Movie : అలాంటి అమ్మాయిలను చూసి సొల్లుకార్చే ఆటగాడు… చివరికి లడ్డూలాంటి పాపతో ఆ పని… క్లైమాక్స్ ట్విస్ట్ అదుర్స్

Big Stories

×