Intinti Ramayanam Today Episode October 3rd : నిన్నటి ఎపిసోడ్ లో.. భరత్ ని చూసిన చక్రధర్ తన ఫ్రెండ్ ని పంపించి డబ్బులు ఇవ్వమని చెప్తాడు. అయితే ఆ డబ్బులను ఇవ్వడానికి చక్రధర్ రాలేదా అని అడుగుతాడు భరత్. ఈ డబ్బులు నీకు ఇచ్చిన తర్వాత ఎవరికీ చెప్పదని ఆయన అన్నారు ఆయన కొంచెం బిజీగా ఉండి రాలేకపోయారు అని ఆ వచ్చిన వ్యక్తి అంటాడు. భరత్ కి ఆ వచ్చిన వ్యక్తి 50 లక్షలు డబ్బులు ఇచ్చి ఈ డబ్బుల గురించి ఎవరి దగ్గర చెప్పొద్దని చెప్పమని అన్నట్లు చెప్తాడు. అలాగే అండి బాబాయ్ గారికి నేను ఎవరికీ చెప్పను అని చెప్పండి అని అంటాడు. భరత్ కి డబ్బులు ఇచ్చిన విషయాన్ని పల్లవికి చెప్తాడు చక్రధర్. వాడింక రాలేదు డాడ్ వాడి కోసమే నేను వెయిట్ చేస్తున్నాను అని పల్లవి అంటుంది. ప్లాన్లో ఎటువంటి డౌట్ లేదు కచ్చితంగా జరిగిపోతుంది ఆ అవని ఇరుక్కోవడం ఖాయమని పల్లవి అంటుంది. ఇంట్లోకి భరత్ ఎంట్రీ అవ్వడం చూసి పల్లవి మ్యానేజ్ చేసి లోపలికి పంపిస్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. ఇంట్లో దసరా కోసం విగ్రహాన్ని తీసుకుని వస్తారు కమల్ భరత్.. నువ్వు బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నావు కదా అన్నయ్య ఆ డబ్బులన్నీ దేవుడి దగ్గర పెట్టి బిజినెస్ స్టార్ట్ చేయి నీకు అంత మంచే జరుగుతుందని అమ్మవారి విగ్రహాన్ని తీసుకొచ్చాను నువ్వు కూడా ఈ విగ్రహాన్ని పట్టుకొని అక్కడ పెట్టు అని కమలంటాడు.. ఇక పార్వతి కూడా అవును రా నువ్వు దేవుడి దగ్గర ఆ డబ్బులను పెట్టి పూజ చేస్తే నీకు అంతా మంచే జరుగుతుంది అని అంటుంది. ఇంట్లోకి అమ్మవారి విగ్రహాన్ని తీసుకొచ్చి అక్షయ్ పూజకి ఏర్పాటు చేస్తున్న స్థలంలో పెడతారు.
ఇక తర్వాత అమ్మవారిని అలంకరించిన అవని అందరికీ పండగ పూట బట్టలు తెచ్చేస్తుంది. ఆ బట్టల్ని చూసినా పల్లవి ఏంటి అక్క నువ్వు ఇంట్లో పనిమనిషికిచ్చే అంత విలువలో కూడా బట్టలు తెచ్చి ఇవ్వలేదు అని గొడవ పెడుతుంది. పండక్కి చూడాల్సింది ఇచ్చే మనిషిని బట్టి తప్ప రేటును కాదు అని రాజేంద్రప్రసాద్ అంటాడు.. పల్లవికి ఎంత చెప్పిన సరే వినకుండా కచ్చితంగా దీన్ని గొడవకి తెరలేపాలని అనుకుంటుంది. అందరూ తలా ఒక మాట అనడంతో పల్లవి సైలెంట్ అవుతుంది.పూజకి మొత్తం సిద్ధం చేస్తారు..
పూజ మొదలుకాకుండానే శ్రీకర్ నాన్న నాకు ఒక పది లక్షలు కావాలి అని అడుగుతాడు. నీకు 10 లక్షలు ఇప్పుడెందుకు రా అని రాజేంద్రప్రసాద్ అడుగుతాడు. అయితే శ్రీయా ఏదో నగలు కొనుక్కోవాలంట అందుకే డబ్బులు కావాలని అడిగింది ఒక 10 లక్షలు ఇవ్వండి అని శ్రీకర్ అడుగుతాడు. ఇప్పుడు మీ ఆవిడ నగలు లేకుండా ఉండలేదు కదా ఎందుకు నగల గురించి మాట్లాడుతున్నారు అని అంటుంది.. ఇదంతా కాదు అన్నయ్యకు 50 లక్షలు ఇచ్చినప్పుడు నీకెందుకు కనీసం 10 లక్షలు కూడా ఇవ్వట్లేదు.. అసలు నువ్వు మీ అమ్మ మీ నాన్నకి పుట్టావా అని శ్రీకర్ని శ్రీయా అడుగుతుంది.
పార్వతి నోరు ముయ్ అని శ్రియా కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తుంది. నీకు డబ్బులు ఇవ్వలేదని నా కొడుకుని నా కొడుకులు కాదు అని అంటావా నోటికి వచ్చినట్టు మాట్లాడతావా? పెంపకం సరిగా ఉంటే ఇలా తయారయ్యే దానివి కాదు నువ్వు ఏదో మంచి దానివి అని అనుకున్నాను అని పార్వతి అంటుంది. ఇక కమల్ మీ నాన్న సిటీ లోనే పెద్ద లాయర్ కోట్లు సంపాదించాడు. మీ నాన్న కూడా పెద్ద బిజినెస్ మాన్ కదా కోట్లు సంపాదించాడు. మీకు ఏమైనా కావాలంటే మీ నాన్నని అడగొచ్చు కదా.. మా అమ్మ నాన్నని ఎందుకు అడుగుతున్నావు అని అంటాడు.
Also Read : పార్టీ కోసం ప్రేమ రెడీ.. ధీరజ్ మాటకు ఫిదా.. ఐశ్వర్య ఎంట్రీతో ప్రేమకు షాక్..
మా నాన్న గురించి మాట్లాడే రైటు నీకు లేదు అని శ్రియ అంటుంది. అక్షయ్ ఇదంతా పక్కన పెట్టేసి పూజలో నీకు ఇచ్చిన డబ్బులు పెట్టి పూజ చేయాలి తీసుకురాపో అనేసి రాజేంద్రప్రసాద్ అంటాడు. అక్షయ్ వెళ్లి డబ్బుల కోసం వెతికితే అక్కడ డబ్బులు కనిపించవు. దాంతో అక్షయ్ షాక్ అవుతాడు. ఏమైనా తీసి దాచిపెట్టిందా అని ఆలోచిస్తూ ఉంటాడు. అక్కడ డబ్బులు లేవని తెలుసుకొని కిందకు వెళ్లి ఆ విషయాన్ని అందరితో చెప్తాడు. డబ్బులు కనిపించడం లేదు అనగానే మన ఇంట్లో వల్లే ఎవరో తీసి ఉంటారు అని అందరూ వెతకడానికి ట్రై చేస్తారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్లో భరత్ దొంగతనం చేశాడని అందరూ అనుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో చూడాలి..