మహిళల వన్డే వరల్డ్ కప్ లో భాగంగా పాకిస్తాన్ వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య నిన్న మ్యాచ్ జరిగింది. అయితే ఇందులో పాకిస్తాన్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో… వివాదాస్పద సంఘటన చోటుచేసుకుంది. నటాలియా అనే ప్లేయర్ అజాద్ కశ్మీర్…. నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారని కామెంటేటర్ బాంబు పేల్చారు. దీంతో ఇండియా అలాగే పాకిస్తాన్ దేశాలకు సున్నితమైన ప్రాంతం అయిన కాశ్మీర్ గురించి… ఈ వ్యాఖ్యలు చేయడం ఏంటని భారతీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. క్రికెట్ నుంచి రాజకీయాలను దూరంగా ఉంచాలని నీతులు చెబుతున్న పాకిస్తాన్ నేతలు…. ఈ వ్యాఖ్యలపై ఎలా స్పందిస్తారని నిలదీస్తున్నారు నెటిజన్స్. అయితే ఇక్కడ ప్రత్యేక విషయం ఏంటంటే… అజాది కాశ్మీర్ అనే వ్యాఖ్యలు చేసిన కామెంట్రేటర్ సనా మిర్. ఆమె పాకిస్తాన్ దేశానికి సంబంధించిన మాజీ క్రికెటర్. మాజీ క్రికెటర్ కావడంతో… ఇలాంటి వ్యాఖ్యలు చేయడంపై నేటిజన్స్ మరింత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వివాదంలో చిక్కుకున్న సనా మిర్ పైన ఐసీసీకి ఫిర్యాదు చేసేందుకు బీసీసీఐకి సంబంధించిన కొంతమంది అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారట. అయితే ఇలాంటి నేపథ్యంలో ఈ వివాదం పై సనా మిర్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించకుండా… తన వ్యాఖ్యలు సరైనవి అన్నట్లుగా వ్యవహరించారు. నటాలియా అనే అమ్మాయి అజాద్ కశ్మీర్ ప్రాంతం నుంచి వచ్చిందని… ఆమె కుటుంబ పరిస్థితులను వివరించినట్లు వెల్లడించారు. కశ్మీర్ నుంచి… వచ్చి నటాలియా లాహోర్ లో క్రికెట్ ఆడుతున్నట్లు వెల్లడించారు. నటాలియా పరిస్థితులు దారుణంగా ఉన్నాయని… చెప్పే ప్రయత్నంలో భాగంగా తన వ్యాఖ్యలు ఉన్నాయని సనా మిర్ వెల్లడించారు. ఇందులో ఎలాంటి తప్పుడు వ్యాఖ్యా లు లేవని కూడా చెప్పే ప్రయత్నం చేశారు. తాను ఎలాంటి క్షమాపణలు చెప్పబోను అంటూ ఫైర్ అయ్యారు.
Dear @ICC
please take action against Sana Mir.
It is not slip of tongue. Initial she said "kashmir" than she corrected herself by "Azad kashmir".
She need to be sacked. Enough is enough. @BCCI file the complaint asap.pic.twitter.com/Exa1jUt7xu— Kumbhkarni🥴 (@misskumbhkarni) October 2, 2025