BigTV English

Nindu Noorella Saavasam Serial Today october 3rd: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మిస్సమ్మ ఆరుతో మాట్లాడటం చూసిన అమర్   

Nindu Noorella Saavasam Serial Today october 3rd: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మిస్సమ్మ ఆరుతో మాట్లాడటం చూసిన అమర్   

Nindu Noorella Saavasam Serial Today Episode:  లాన్లో నిలబడిన మిస్సమ్మ ఆరుతో మాట్లాడుతుంటే.. పైనుంచి పిల్లలు చూస్తారు. మిస్సమ్మ తనలో తానే మాట్లాడుకుంటుందేంటి అని షాక్‌ అవుతారు. అయితే అక్కడ ఆత్మ ఉందని అంజు చెప్తుంది. అత్మ ఉండటం ఏంటి అంజు అంటూ ఆనంద్‌ అడగ్గానే.. మన ఇంటి లాన్ లో ఒక ఆత్మ ఉంది. మిస్సమ్మ ఆ ఆత్మతోనే మాట్లాడుతుంది అని అంజు చెప్పగానే.. ఆకాష్‌ కోపంగా నీకేమైనా పిచ్చా..?  మిస్సమ్మ ఆత్మతో మాట్లాడటమేంటి..? అంటాడు. ఒకసారి చూడండి మరి మిస్సమ్మ ఎవరితో మాట్లాడుతుందో ఇప్పుడు చెప్పండి.. ఆత్మతో మాట్లాడుతుంది.


అది కూడా మన అమ్మ ఆత్మ.. అని అంజు చెప్పగానే అందరూ షాకింగ్‌ గా అమ్మ ఆత్మా..? అంటారు. అవును మన అమ్మ ఆత్మతోనే మిస్సమ్మ మాట్లాడుతుంది అని అంజు చెప్పగానే.. మనకు కనిపించని అమ్మ ఆత్మ మిస్సమ్మకు ఎలా కనిపిస్తుందే.. అని అమ్ము అడుగుతుంది. అది కిందకు వెళ్లి అమ్మనే అడగాలి పదండి.. ఏంటి అమ్మను చూడాలని అమ్మతో మాట్లాడాలని మీకు లేదా..? అని అంజు అడగ్గానే.. ఉంది అని అందరూ చెప్తారు. అయితే త్వరగా పదండి మళ్లీ అమ్మ వెళ్లిపోతుంది అని అంజు చెప్పగానే.. అందరూ కిందకు వెళ్తారు.

అమర్‌ హాల్లో కూర్చుని ఏదో ఆలోచిస్తుంటాడు. పిల్లుల బయటకు వెళ్తుంటే..పిల్లలు ఆగండి ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతాడు. బయట లాన్‌లోకి వెళ్తున్నాము డాడ్‌ అని అంజు చెప్తుంది. ఈ టైంలోనా ఎందుకు అని అమర్‌ అడుగుతాడు. అమ్మను చూడ్డానికి డాడ్‌ అమ్మతో మాట్లాడటానికి అని అంజు చెప్పగానే.. అమర్‌ షాక్‌ అవుతాడు. ఏంటి అని అడగ్గానే.. అమ్మ లాన్‌లో ఉండి డాడ్‌ మిస్సమ్మతో మాట్లాడుతుంది అని అంజు చెప్పగానే.. ఎవరు చెప్పారు నీకు అని అమర్‌ అడగ్గానే.. మేము చూశాము లాన్‌లో మిస్సమ్మ మాట్లాడుతుంది. అది అమ్మతోనే.. అంటుంది అంజు.. దీంతో ఆ విషయం నీకెలా తెలుసు అని అమర్‌ అడగ్గానే.. ఆత్మలున్నాయని అమ్మ ఆత్మ ఇంటి బయటే ఉందని రాత్రి నువ్వే కదా చెప్పావు డాడ్‌ అని అంజు చెప్పగానే అమర్‌ తాను రాత్రి చెప్పింది గుర్తు చేసుకుంటాడు.


ఇంతలో అంజు రండి డాడ్‌.. అమ్మను చూద్దాం అంటూ అడగ్గానే.. అమర్‌ పిల్లలతో కలిసి బయటకు వస్తాడు. బయటి నుంచి కారులో మనోహరి వస్తుంది. అమర్‌ను చూసిన రాథోడ్‌ అమ్మో సార్‌ వచ్చారేంటి..? మిస్సమ్మ, మేడంతో మాట్లాడటం చూస్తారా..? అని భయపడుతుంటాడు. మనోహరి కూడా భయంతో భాగీ ఆరు ఆత్మతో మాట్లాడుతున్నట్టు అమర్‌కు తెలిసిపోయిందా..? అది ఆరు ఆత్మ ఉన్నట్టు భాగీ అమరేంద్రతో చెప్పేసిందా అని కంగారు పడుతుంది. రాథోడ్‌ మాత్రం కూల్‌గా ఈ టైంలో పిల్లలను తీసుకుని ఎక్కడికి వెళ్తున్నారు సార్‌ అని అడుగుతాడు. మా అమ్మను చూడటానికి అని అంజు చెప్తుంది. ఇవేమీ పట్టించుకోకుండా మిస్సమ్మ, ఆరు మాట్లాడుతుంటారు. ఇంతలో అమర్‌, పిల్లలు  రావడం చూసిన గుప్త.. బాలిక నీ పతిదేవుడు.. నీ పిల్ల పిచ్చుకలు వస్తున్నారు అని చెప్పగానే.. ఆరు వాళ్లను చూసి షాక్‌ అవుతుంది. మిస్సమ్మ ఏంటక్కా ఏం మాట్లాడకుండా అలా ఉండిపోయారు..? మాట్లాడు అక్కా అంటుంది.

ఇంతలో వెనక నుంచి వచ్చిన అమర్‌ భాగీ అంటూ పిలవగానే మిస్సమ్మ షాక్ అవుతుంది. మెల్లగా తిరిగి చూస్తుంది. ఎవరితో మాట్లాడుతున్నావు.. ఎవరున్నారు ఇక్కడ అని అడుగుతాడు అమర్‌. దీంతో ఆరు భయపడుతుంది. మిస్సమ్మ మాత్రం ఎవ్వరూ లేరు నాలో నేనే మాట్లాడుకుంటున్నాను.. అని చెప్తుంది. దీంతో ఆరు షాక్‌ అవుతుంది. మిస్సమ్మకు నిజం తెలిసిందా అన్నట్టు గుప్తను చూస్తుంది. అవునన్నట్టు గుప్త తలూపుతాడు. ఇంతలో అమర్‌ నీలో నువ్వు మాట్లాడుకోవడం ఏంటి..? ఇదెప్పటి నుంచి అని అడుగుతాడు. ఇంతలో అంజు నిజం చెప్పు మిస్సమ్మ నువ్వు అమ్మ ఆత్మతో మాట్లాడుతున్నావు కదా..? అమ్మ ఆత్మ ఇప్పుడు ఇక్కడే ఉంది కదా..? అని అడుగుతుంది.

లేదు అంజు నేను ఎవ్వరితోనూ మాట్లాడటం లేదు. నాలో నేనే మాట్లాడుకుంటున్నాను అదే నిజం అంటుంది. దీంతో అమర్‌ భాగీ ఆర్‌యూ ఓకే అంటూ అడగ్గానే.. ఓకే అండి అంటుంది. దీంతో అమర్‌ ఈ టైంలో ఇక్కడ ఉండటం మంచిది కాదు లోపలికి వెళ్దాం పదండి అంటాడు. సరే అంటూ అందరూ లోపలికి వెళ్తారుఉ. మనోహరి ఊపిరి పీల్చుకుంటుంది. థాంక్ గాడ్‌ భాగీ అమర్‌కు నిజం చెప్పలేదు అనుకుంటుంది. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

Intinti Ramayanam Today Episode: పండక్కి గొడవ పెట్టిన పల్లవి.. శ్రీయాకు స్ట్రాంగ్ వార్నింగ్.. డబ్బులు మాయం..

GudiGantalu Today episode: నోరు జారిన బాలు.. మీనాకు కోపం తెప్పించిన ప్రభావతి..ఇంట్లోంచి వెళ్ళిపోయిన మీనా..

Brahmamudi Serial Today October 3rd: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కావ్యకు నిజం చెప్పబోయిన కళ్యాణ్‌  

Illu Illalu Pillalu Today Episode: పార్టీ కోసం ప్రేమ రెడీ.. ధీరజ్ మాటకు ఫిదా.. ఐశ్వర్య ఎంట్రీతో ప్రేమకు షాక్..

Today Movies in TV : శుక్రవారం టీవీల్లోకి రాబోతున్న సినిమాలు.. అవి మిస్ చేయొద్దు..

Jayammu Nischayammuraa: నాగ చైతన్య శోభిత మధ్య గొడవలు.. మాట్లాడడం లేదంటూ!

Intinti Ramayanam Today Episode: అవనిని ఇరికించబోతున్న పల్లవి.. శ్రీకర్ కు డెడ్ లైన్.. అక్షయ్ డబ్బులు కొట్టేసింది ఎవరు..?

Big Stories

×