IndiGo flights: ఐదేళ్ల విరామం తర్వాత భారత్-చైనా మధ్య విమాన సర్వీసులు మళ్లీ పట్టాలెక్కుతున్నాయి. విమాన సర్వీసులను పునఃప్రారంభిస్తున్నట్లు ఇండిగో ఎయిర్‌లైన్స్ సంస్థ ప్రకటన చేసింది. అక్టోబర్ 26 నుంచి కోల్‌కతా నుంచి చైనాలోని గ్వాంగ్‌జౌ సిటీకి ప్రతిరోజూ నాన్-స్టాప్‌గా విమానాలను నడపనున్నట్లు వెల్లడించింది. టికెట్ల బుకింగ్ శుక్రవారం నుంచి మొదలుకానున్నాయి.
ఎట్టకేలకు భారత్ -చైనా మధ్య
ఇండియా-చైనా మధ్య విమానాల రాకపోకలు మొదలుకానున్నాయి. సర్వీసులు ప్రారంభించడానికి కేంద్రం ఇండిగో ఎయిర్‌లైన్ సంస్థకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తొలుత కోల్‌కతా నుండి గ్వాంగ్‌జౌ నగరానికి విమాన సర్వీసులు మొదలుకానున్నాయి. అక్టోబర్ 26 నుండి విమానాలు టేకాఫ్ కానున్నాయి. మద్దతు ఇచ్చిన పౌర విమానయాన మంత్రిత్వ శాఖకు ఆ సంస్థ కృతజ్ఞతలు తెలిపింది.
ఆ మార్గంలో ఎయిర్‌బస్ ఏ-320 నియో విమానాలను ఉపయోగించనుంది. ప్రభుత్వ అనుమతులు లభించిన తర్వాత రానున్న రోజుల్లో ఢిల్లీ నుంచి గ్వాంగ్‌జౌకు నేరుగా సర్వీసులు మొదలుపెట్టేందుకు ప్రణాళికలు రెడీ చేస్తున్నట్లు పేర్కొంది.
ఇండిగో విమాన సర్వీసులు
కేంద్రం నిర్ణయంతో పర్యాటక రంగం, వాణిజ్య, వ్యాపార భాగస్వామ్యాలకు కొత్త మార్గాలు తెరుచుకుంటాయని భావిస్తున్నారు. గతంలో చైనాకు విమానాలు నడిపిన అనుభవం ఇండిగో సంస్థకు ఉంది. స్థానిక భాగస్వాములతో పరిచయాల వల్ల సర్వీసులకు ఎలాంటి ఆటంకాలు రాకుండా తిరిగి ప్రారంభిస్తామని ఆ సంస్థ వివరించింది.
ALSO READ: పండుగ రద్దీ వేళ ఆ రూట్లో ప్రత్యేక రైళ్లు
గత నెలలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ షాంఘై సహకార సంస్థ-SCO శిఖరాగ్ర సదస్సు కు వెళ్లారు. దాదాపు ఏడేళ్ల ఆయన చైనాలో పర్యటించారు. ఈ టూర్ లో భాగంగా చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తో సమావేశమయ్యారు. వాణిజ్య సంబంధాలను బలోపేతం చేసుకోవడంపై ఇరుదేశాలు దృష్టి సారించాయి.
కోల్‌కతా – గ్వాంగ్‌జౌ మధ్య విమానాల టిక్కెట్లు శుక్రవారం నుండి ప్రారంభమయ్యాయి. ఎయిరిండియా ఈ ఏడాది చివరి నాటికి షాంఘైకి విమానాలను తిరిగి ప్రారంభించాలని భావిస్తున్నట్లు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. జూలైలో భారత ప్రభుత్వం చైనా జాతీయులకు పర్యాటక వీసాలను తిరిగి ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది.
కోవిడ్-19 మహమ్మారి కారణంగా మార్చి, 2020 నుంచి భారత్-చైనా మధ్య అంతర్జాతీయ విమాన సర్వీసులు నిలిచిపోయాయి. అనేక దేశాలకు ఆంక్షలు క్రమంగా సడలించాయి. ఈలోగా గాల్వాన్ ఘటన తర్వాత చైనాకు విమానాలు నిలిపివేశాయి దేశీయ ఎయిర్‌లైన్స్ సంస్థలు. ఇండిగో విమానాలు అక్టోబర్ చివరి ఆదివారం నుంచి చైనాకు విమానాలు తిరిగి మొదలుకానున్నాయి.
శీతాకాలం మొదటి రోజున ప్రారంభమవుతాయి. విమానయాన సంస్థలు సర్వీసులను ప్లాన్ చేసుకోవడానికి, సర్దుబాటు చేయడానికి అనుమతిస్తుంది. వేసవి షెడ్యూల్ మార్చి చివరి ఆదివారం నుండి కొనసాగునున్నాయి. ఎయిర్ చైనా, చైనా ఈస్టర్న్ ఎయిర్‌లైన్స్, చైనా సదరన్ ఎయిర్‌లైన్స్, షాన్ డాంగ్ ఎయిర్‌లైన్స్ వంటి చైనా క్యారియర్‌ల విమాన సర్వీసులు తిరిగి ప్రారంభించనున్నాయి.
అయితే ప్రభుత్వానికి తమ దరఖాస్తులను సమర్పించడంలో ఆలస్యం జరిగిందని ఎయిర్ లైన్స్ వర్గాలు చెబుతున్నాయి. ఎయిర్ చైనా విమానం తొలుత బీజింగ్-ఢిల్లీ, ఆ తర్వాత ముంబైతో అనుసంధానించడానికి అనుమతి కోరినట్లు పరిశ్రమకు చెందిన ఓ వ్యక్తి తెలిపారు.
We’re delighted to announce the resumption of our flights to China, with direct flights to Guangzhou from Kolkata starting 26th October, 2025 further strengthening our commitment to making air travel more accessible for our customers. We are thankful to the Ministry of Civil…
— IndiGo (@IndiGo6E) October 2, 2025