OTT Movie : ఆడియన్స్ భయపెట్టడానికి దర్శకులు తమ వంతు ప్రయత్నం చేస్తుంటారు. డిఫరెంట్ స్టోరీలను తెరకెక్కిస్తుంటారు. ఈ ప్రయత్నంలో భాగంగా ఒక సూపర్ నాచురల్ హారర్ సినిమా ప్రేక్షకులను బాగానే భయపెట్టించింది. ఈ కథ ఒక మొబైల్ యాప్ చుట్టూ తిరిగే హారర్ థీమ్‌తో సాగుతుంది. ఈ యాప్ ని ఎవరైతే డౌన్ లోడ్ చేసుకుంటారో, వాళ్ళ డెత్ టైమ్ అందులో చూపిస్తుంది. ఆ తరువాత వాళ్ళ చావు కన్ఫార్మ్ అయిపోతుంది. ఒక క్రియేచర్ భయంకరంగా చంపుతుంటుంది. ఈ అమెరికన్ హారర్ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాలల్లోకి వెళ్తే …
‘కౌంట్‌డౌన్’ (Countdown) 2019లో విడుదలైన అమెరికన్ సూపర్ నాచురల్ హారర్ చిత్రం. జస్టిన్ డెక్ దీనికి దర్శకత్వం వహించారు. ఇందులో ఎలిజబెత్ లైల్ (క్విన్ హ్యారిస్), జోర్డాన్ కాలోవే (మ్యాట్), టాలిథా బటమాన్ (జోర్డాన్) ప్రధాన పాత్రల్లో నటించారు. 1 గంట 30 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమా, IMDbలో 5.4/10 రేటింగ్ పొందింది. ఈ సినిమా 2019 అక్టోబర్ 25న థియేటర్లలో విడుదలైంది. ప్రస్తుతం ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్‌లో ఉంది
ఒక పార్టీలో టీనేజర్లు ఎంజాయ్ చేస్తూ ‘కౌంట్‌డౌన్’ అనే యాప్ డౌన్‌లోడ్ చేస్తారు. ఇది యూజర్ డెత్ టైం ని చూపిస్తుంది. ఈ యాప్ డౌన్‌లోడ్ చేసిన కోర్ట్నీకి 3 గంటల్లో చావు వస్తుందని తెలుస్తుంది. ఆమె డ్రంక్ బాయ్ ఫ్రెండ్ ఎవాన్‌తో కారులో వెళ్తుండగా, యాప్ టైమర్ జీరో అయ్యేసరికి ఒక సూపర్ నాచురల్ క్రిచర్ ఆమెను చంపేస్తుంది. అదే సమయంలో ఎవాన్ కారు యాక్సిడెంట్‌లో గాయపడి హాస్పిటల్‌కు వస్తాడు. అతను సర్జరీకి భయపడుతాడు, ఎందుకంటే ఈ యాప్ అతని డెత్ టైంని, సర్జరీ సమయంతో మ్యాచ్ చేస్తుంది. హాస్పిటల్ నర్స్ క్విన్ హ్యారిస్ యాప్ గురించి తెలుసుకుని డౌన్‌లోడ్ చేస్తుంది. ఆమెకు మరణం కేవలం 3 రోజులు మాత్రమే ఉందని తెలుస్తుంది.ఇది చూసి క్విన్ పానిక్ అవుతుంది. ఆమె తమ్ముడు మ్యాట్ తో కలిసి యాప్ రివ్యూవ్ చేస్తారు. అక్కడ ఇది ఒక డెమన్ యాప్‌గా, యూజర్ అగ్రీమెంట్ బ్రేక్ చేస్తే మరణాన్ని తప్పించలేమని తెలుస్తుంది.
క్విన్ చెల్లి జోర్డాన్ జోర్డాన్ కూడా యాప్ డౌన్‌లోడ్ చేసుకుంటుంది. దీంతో క్విన్ ఇంకా భయపడుతుంది. ఈ సమయంలో వీళ్లకు డెరెక్ అనే ఒక డెమన్ ఎక్స్‌పర్ట్ సహాయం చేస్తాడు. డెమన్ ఈ యాప్ ద్వారా వస్తుంది, హాల్యుసినేషన్స్ తో వేధిస్తుందని తెలుసుకుంటాడు. డెరెక్ కోడ్‌లో మార్పు చేసి టైమర్ ని పెంచుతాడు. కానీ డెమన్ దానిని మళ్ళీ రిసెట్ చేస్తుంది. ఇక ఈ క్లైమాక్స్ భయంకరమైన ట్విస్టులతో నడుస్తుంది. చివరికి క్విన్ డెమన్‌ను ఎలా ఎదుర్కొంటుంది ? ఆమె తన చెల్లెల్ని కాపాడుకుంటుందా ? ఈ యాప్ స్టోరీ ఏమిటి ? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే, ఈ సినిమాను మిస్ కాకుండా చుడండి.
Read Also : అర్దరాత్రి అపార్ట్మెంట్లో వింత సౌండ్స్… డోర్ తీస్తే గుండె జారిపోయే సీన్లు… ఈ హర్రర్ మూవీ అరాచకం సామీ