Brahmamudi serial today Episode: నేను హాస్పిటల్‌కు వెళ్లిన విషయం స్వప్న అక్క చెప్పింది అనుకోవచ్చు కానీ నేను డాక్టర్‌ను కలవలేదని అంత కచ్చితంగా ఎలా చెప్పారు.. అంటే నన్ను ఫాలో అవుతున్నావా..? అని అడుగుతుది కావ్య. నేను అలా చేస్తాను వదిన అయినా నేను నాన్నమ్మ ఆయిల్ కోసం అంత దూరం వెళ్లిన నేను నిన్ను ఎలా ఫాలో చేస్తాను అంటాడు కళ్యాణ్. దీంతో మరి నేను డాక్టర్‌ను కలవలేదన్న విషయం మీకెలా తెలుసు అని కావ్య అడగ్గానే.. గెస్ చేశాను వదిన హాస్పిటల్‌కు వెళితే చాలా టైం పడుతుంది కదా.. మీరేమో త్వరగా వచ్చారు అందుకే గెస్ చేశాను.. నాకు అర్జెంట్ వర్క్ ఉంది వస్తాను వదిన అంటూ కళ్యాణ్ వెళ్తాడు.
తర్వాత రూంలోకి వెళ్లి కళ్యాణ్‌కు ఈ విషయం ఎలా తెలుసు.. ఆయన ఆయిల్ తీసుకురాకుండా కవిగారిని ఎందుకు పంపారు అంటూ మొదటి నుంచి కళ్యాణ్ ఏమేం మాట్లాడాడో అంతా గుర్తు చేసుకుంటుంది. డౌటు లేదు కచ్చితంగా కవిగారికి నిజం తెలిసే ఉంటుంది. వెంటనే వెళ్లి కవిగారిని గట్టిగా అడిగేస్తాను.. అనుకుంటూ కళ్యాణ్ దగ్గరకు వెళ్తుంది కావ్య.
తన రూంలోకి వచ్చిన కావ్యను చూసిన కళ్యాణ్ షాక్ అవుతాడు.. ఏంటి వదిన అలా సడెన్‌గా వచ్చేశావు అని అడుగుతాడు. దీంతో అవసరం పడింది అని కావ్య చెప్పగానే.. అప్పుతోనా వదిన అంటాడు కళ్యాణ్ కాదు నీతోనే అంటుంది కావ్య. ఏం చెప్పాలి వదిన అని అడుగుతుంది కావ్య. ఏం నిజం వదిన అని కళ్యాణ్ అడగ్గానే.. మీరు నా దగ్గర దాచిన నిజం ఇంకా దాస్తున్న నిజం అని కావ్య చెప్పగానే.. నేను నీ దగ్గర నిజాలు దాయడం ఏంటి వదిన అసలు మీరు దేని గురించి మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు వదిన అంటాడు.
దీంతో కావ్య ఇంకా ఎందుకు కవిగారు దాస్తారు. అమ్మ దగ్గర అబద్దం ఆడినంత మాత్రాన నిజం దాగదు కదా కవిగారు. మీరు చెప్పకపోయినా నాకు నిజం ఏంటో తెలిసిపోయింది. మీ అన్నయ్య మీరు కలిసి ఆడుతున్న డ్రామా గురించి తెలుసుకోలేని పిచ్చిదాన్ని అనుకున్నారా.? చెప్పండి కవి గారు ఇంత పెద్ద నిజాన్ని నాకు చెప్పకుండా ఎందుకు దాచారు.. చెప్పండి కవిగారు ఎందుకు దాచారు.. మీ మౌనం నాకు సమాధానం కాదు కవిగారు.. చెప్పండి ఎందుకు దాచారు అంటూ కావ్య నిలదీయగానే.. అంటే వదిన అది మీకు ముందే చెప్పాలనుకున్నాం కానీ అన్నయ్యే చెప్పొద్దు అన్నారు అంటాడు కళ్యాణ్.
దీంతో కావ్య ఆయన చెప్పొద్దు అంటే మీరు ఆగిపోతారా..? ఎప్పుడూ తల్లి కొంగు పట్టుకుని తిరిగే పిల్లాడిలా ప్రతి విషయం నాతో షేర్ చేసుకుంటారు కదా..? ఈ విషయం చెప్పడానికి ఏమైంది కవిగారు అని అడుగుతుంది. దీంతో కళ్యాణ్ నువ్వు ఎలా రిసీవ్ చేసుకుంటావో అని చెప్పలేదు వదిన అసలు ఏం జరిగింది అంటే మేము టెస్ట్ రిపోర్టులు తెద్దామని హాస్పిటల్‌కు వెళ్తుంటే.. అని చెప్పబోతుంటే అప్పుడే రాజ్ వచ్చి డోర్ దగ్గర నుంచి చెప్పొద్దు అంటూ సైగ చేస్తాడు. దీంతో కళ్యాణ్ మాట మారుస్తాడు. ఏదో సినిమా జోలి చెప్తాడు. ఇంతలో రాజ్ లోపలికి వచ్చి సర్ది చెప్పబోతుంటే కావ్య తిట్టి అక్కడి నుంచి వెళ్లిపోతుంది.
సుభాష్ ఫ్రెండ్ తన కూతురు సీమంతానికి పిలవడానికి దుగ్గిరాల ఇంటికి వస్తాడు. అందరినీ ఫంక్షన్‌కు రమ్మని చెప్పిన ఆయన రాజ్, కావ్యకు ఎందుకు అబార్షన్ చేయించబోతున్నాడు అని అడుగుతాడు. దీంతో సుభాష్, అపర్ణ షాక్ అవుతారు. ఎవరు చెప్పారని అపర్ణ అడగ్గానే.. మన సర్కిల్ అందరు అనుకుంటున్నారని చెప్తాడు. దీంతో అపర్ణ అదేం లేదని సర్ది చెప్తుంది.
తర్వాత దేవుడి దగ్గరకు వెళ్లి ఎమోషనల్ అవుతుంది. కృష్ణా ఎందుకిలా నా జీవితాన్ని అయోమయం చేస్తున్నావు.. నీకు గోపికలను ఏడిపించే అలవాటు ఉందని విన్నాను కానీ ఇలా నీ భక్తులను కూడా ఎందుకు ఏడిపిస్తున్నావు కృష్ణా..? నాకు బిడ్డను ప్రసాదించావని ఆనందించే లోపే ఆ బిడ్డకు వాళ్ల నాన్న రూపంలోనే ఎందుకు మృత్యు గండాన్ని ఇచ్చావు. మా ఆయన తల్లిగా నాకెందుకు కడుపుకోత మిగల్చాలనుకుంటున్నారో కారణం చెప్పడం లేదు కృష్ణా.. అందుకే చివరిగా నేను ఇంకో ప్రయత్నం చేద్దామని నిర్ణయించుకున్నా.. అందుకే కొంచెం కఠినమైన నిర్ణయం తీసుకోబోతున్నాను కృష్ణా.. అందుకే ఆయనకు విడాకులు ఇచ్చేస్తాను. ఏ ఆడపిల్లైనా జీవితాంతం భర్తతోనే కలిసి ఉండాలని కోరుకుంటుంది అంటూ కావ్య ఎమోషనల్ అవుతుంది.
తర్వాత కింద రాజ్ దగ్గరకు అపర్ణ, సుభాష్ వచ్చి తిడతారు. సుభాస్ ఫ్రెండ్ చెప్పిన విషయాల గురించి చెప్తూ.. రాజ్ నువ్వు చేసిన పని వల్ల ఈ ఇంటి పరువు గంగలో కలిసిపోయింది అంటూ తిడతాడు సుభాష్.. మీ నాన్న గారు ఒకరికి సలహాలు ఇచ్చే వారే కానీ ఒకరి దగ్గర సలహాలు తీసుకునే వారే కాదు కానీ నీ వల్ల అది జరిగింది అంటూ తిడుతుంది అపర్ణ. వాళ్ల మధ్యలో గొడవకు రుద్రాణి ఆజ్యం పోస్తుంది. ఇంకా గొడవ పెట్టడానికి ట్రై చేస్తుంది. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.