Gundeninda GudiGantalu Today episode October 3rd : నిన్నటి ఎపిసోడ్ లో.. చింటూ ను చూసిన ప్రభావతి వీడు ఇంకా వెళ్లలేదా అని పెద్ద రచ్చ చేస్తుంది. ఇలాంటి వాళ్లని ఇంట్లో ఉంచాలంటే నాకు చిరాగ్గా ఉంటుంది అని ప్రభావతి అంటుంది. అసలు వాళ్ళ అమ్మ ఎవరో కూడా తెలియదు అసలు ఉందో లేదో కూడా తెలియదు అని ప్రభావతి దారుణంగా మాట్లాడటం విన్న రోహిణి ఆ వాళ్ళ అమ్మ ఎవరో కూడా తెలియదు అసలు ఉందో లేదో కూడా తెలియదు.. చచ్చిందో లేక ఎవరితో అయిన వెళ్లిపోయిందో అని ప్రభావతి అనడం విన్నరోహిని కోపంతో ఆపండి అత్తయ్య అని గట్టిగా అరుస్తుంది. చిన్నపిల్లలు ముందు ఏం మాట్లాడుతున్నారో తెలియడం లేదా మీకు అని అరుస్తుంది. బాలు వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి రావడంతో బాలు మాట్లాడిన మాటలకు మీనా బాధపడుతుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. బాలు ఫ్రెండ్ ఇంటికి వస్తాడు. ఏంట్రా ఇన్నాళ్లకు మా ఇంటికి వచ్చావా నువ్వు బాలు అడుగుతాడు. పెళ్లి రా అందుకే కార్డు ఇవ్వడానికి ఇంటికి వచ్చాను అని తన ఫ్రెండ్ అంటాడు. నువ్వు ఇప్పుడు పెళ్లి చేసుకుంటున్నావా అదేంటి అని బాలు వెటకారంగా అడుగుతాడు. నా పెళ్లి కాదురా మా అన్నయ్య పెళ్లి అని బాలు తో తన ఫ్రెండ్ చెప్తాడు. అదేంటి మీ అన్నయ్య పెళ్లికి నువ్వు పిలవడానికి వచ్చావు అని బాలు అడుగుతాడు. అయినా అప్పట్లో మీ అన్నయ్య ఒక ముస్లిం అమ్మాయిని ప్రేమించాడు కదా పెళ్లి కూడా చేసుకుంటాడు అని అనుకున్నారు కదా మరి ఇప్పుడేంటి కొత్తగా ఇంకొక అమ్మాయిని అని బాలు అడుగుతాడు.
అమ్మాయితో మనస్పర్ధలు వచ్చాయి. అందుకే వాళ్ళిద్దరు విడిపోయారు ఇప్పుడు మా అమ్మ నాన్న మళ్ళీ సంబంధం చూశారు పెళ్లి చేసుకుంటున్నాడు అని బాలుతో తన ఫ్రెండు అంటాడు. జాగ్రత్తరా నువ్వు ఆ పెళ్లిలో గనక ఉన్నావంటే మీ అన్నయ్య ఆ హిందీ అమ్మాయి కోసం వెళ్ళిపోయాడు అనుకో ఆ అమ్మాయిని నీకు బలవంతంగా అంటగట్టేస్తాడు. జీవితాంతం నువ్వు భరించాలి అని బాలు అంటాడు. నువ్వు ఏమంటున్నావో నాకు అర్థం కావట్లేదు రాణి బాలు ఫ్రెండ్ అంటాడు. సర్లేరా మీరందరూ పెళ్లికి రండి అని చెప్పేసి వెళ్లిపోతాడు.
బాలు ఇంటికి ఎవరు వచ్చినా సరే మనోజ్ గురించి చెప్పడం మానడం అత్తయ్య అని రోహిణి అడుగుతుంది.. మీకు అలా అర్థమైందా అక్కడ మనోజ్ లేచిపోవడం వల్ల మీనా ను వాళ్ల నాన్న మాట కోసం బలవంతంగా పెళ్లి చేసుకున్నాను. ఇప్పటికీ బలవంతంగా బరిస్తున్నాను అని బాలు అన్నట్లు అనిపించలేదా మీకు అని ప్రభావతి అంటుంది.. వాళ్ళ నాన్న మాట కోసమే కాపురం చేస్తున్నానని అంతా కచ్చితంగా చెప్పాడు కదా ఈ కేకులు పెళ్లిరోజులు ఇవెందుకో మరి నాకర్థం కావట్లేదు అని ప్రభావతి అంటుంది.
ప్రభావతి అన్న మాటని మీనా వింటుంది. అప్పటినుంచి మీనా కోపంగా ఉంటుంది. ఎవరే మరిగినా సరే నేనేం చేయను నన్నేం అడగద్దు అని అంటుంది. టిఫిన్ చేయమని చెప్పిన సరే వెటకారంగా ఇంట్లో పిండి లేదు అది ఇది అంటూ మాట్లాడుతుంది. ఇక బాలు వచ్చి ఎంత అడిగినా సరే మీనా ఏమీ మాట్లాడకుండా ఉంటుంది. నేను టిఫిన్ చేయను ఏం చేయను రేపటి నుంచి బోర్డు పెడతాను టిఫిన్ చేయను అని అంటూ మీనా కోపంగా మాట్లాడుతుంది. దీనికి పొంతన లేకుండా మాట్లాడుతుంది అని ప్రభావతి అనుకుంటుంది.
Also Read :పార్టీ కోసం ప్రేమ రెడీ.. ధీరజ్ మాటకు ఫిదా.. ఐశ్వర్య ఎంట్రీతో ప్రేమకు షాక్..
ఇక బాలు మీన దగ్గరికి వచ్చి మాట్లాడిన సరే మీనా మాట్లాడదు. మీ ఫ్రెండ్ తో అలా మాట్లాడారేంటి అంటే మీరు నన్ను బలవంతంగా భరిస్తున్నారా? నేనంటే మీకు ఇష్టం లేదా అని మీనా అడుగుతుంది. కానీ మీనా మాత్రం కోపంగా ఉందన్న విషయం బాలుకు అర్థమవుతుంది. మీనా టిఫిన్ లేదా అని బాలు అడిగినా సరే ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది. పార్వతి ఫోన్ చేసినా సరే మీనా ఏదో ఒకటి మాట్లాడి ఫోన్ పెట్టేస్తుంది. ఆ తర్వాత బాలు కార్ స్టాండ్ కెళ్ళి కోపంగా ఉండడం చూసి రాజేష్ ఏమైంది రా అని అడుగుతాడు. బాలు కోపంగా మీనా పై నోరు జారిన విషయాన్ని చెప్తాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..