Illu Illalu Pillalu Today Episode September 20th: ఇలా ఆవేశపడితే ప్రయోజనం లేదు మావయ్య గారు.. ఎస్సై గారు చెప్పారు కదా మీరు ఏమైనా చేస్తే అందరినీ జైల్లో వేస్తాను అని.. మనము వలస కూడా పెట్టుకోకుండా కేసును వెనక్కి తీసుకుని కాంప్రమైజ్ అవుదాము అని శ్రీవల్లి అంటూ ఉంటుంది ఇక నర్మద కూడా ఏంటి మావయ్య గారు మీరే కొట్టి మీరే కేసు పెడతాను అంటే ఎలా ఉంటుంది అసలు ఎవరు ఒప్పుకోరు కూడా అని నర్మదా అంటుంది. నా కోడలికి వేరే సంబంధం కాయం చేస్తున్నారు అంటే నేను అస్సలు తట్టుకోలేకపోయాను అమ్మ అందుకే అలా ప్రవర్తించాను అని రామరాజు అంటాడు. మనవి కేసుని వెనక్కి తీసుకొని ప్రేమను మన ఇంటికి తీసుకొని వెళ్ళిపోదామని ఇక వేదవతి కూడా అనడంతో రామరాజు కేసులు వెనక్కి తీసుకోవడానికి ఒప్పుకుంటాడు..
మొత్తానికి రెండు కుటుంబాలు కేసును వెనక్కి తీసుకోవడానికి ఒప్పుకుంటాయి. అయితే లోపలికి వెళ్లి ఎస్ఐతో ఈ విషయాన్ని నేను చెప్పాలని అనుకుంటారు ఇక భద్ర వెళుతూ ఉండగా శ్రీవల్లి ఆపి ఈ కేసును వెనక్కి తీసుకోవడానికి మా మామయ్య గారిని నేనే ఒప్పించాను అని చెప్పగానే శ్రీవల్లి చంప వాయించేస్తుంది. ఎందుకు మీరు నన్ను కొట్టారు కేసుని వెనక్కి తీసుకోవడానికి నేను సాయం చేశాను అని చెప్పినా కూడా నన్ను కొడతారేంటి అని శ్రీవల్లి షాక్లో ఉండిపోతుంది.. నా తమ్ముడికి ఆ సుకన్య ఇచ్చి పెళ్లి చేయడానికి కారణం నువ్వే అందుకే నేను కొట్టాను లేకపోతే మీ వాళ్ళందరిని చంపేసే దాన్ని అని భద్ర వార్నింగ్ ఇస్తుంది దాంతో శ్రీవల్లి ఒక్కసారిగా షాక్ అవుతుంది. నేనేం తప్పు చేశానని ఈవిడ నామీద ఇంత కోపంగా ఉన్నారు అని శ్రీవల్లి చాలా భయపడుతూ ఉంటుంది.
ప్రేమని ఎలాగైనా సరే మళ్లీ మన ఇంటికి తీసుకుని వెళ్లాలి అని వేదవతి అందరితో చెప్తుంది అయితే పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్ళిన తర్వాత కూడా వేదవతి మా ప్రేమను మాతో పంపించండి తను మా ఇంటి కోడలు మా ఇంట్లోనే ఉండాలి అని అడగడంతో ఒక్కసారిగా భద్రత పాటు ప్రేమ కూడా షాక్ అవుతుంది. మెల్లో పసుపు తాడు వేసుకుంటే అది తాళిబొట్టు ఎలా అవుతుంది ? ఎవరు సాక్ష్యం లేరు కానీ ఆ పెళ్లి చెల్లదు అంటూ భద్రావతి క్లాసులు పీకుతుంది. అయితే వేదవతి ఎలా జరిగినా అది పెళ్లి అవుతుంది. కానీ వేరే ఉద్దేశం కాదు కదా అని ఎంత చెప్తున్నా సరే భద్రా మాత్రం నా మేన కోడలిని నేను ఎక్కడికి పంపించను అని చెప్తుంది. తన మేనకోడల్ని ఎక్కడికి పంపించను అంటూ భద్ర పెద్ద గొడవే చేస్తుంది దాంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా షాక్ అవుతారు.
ఏంటి ఆ పెళ్లి చల్లగా ఎందుకు చెల్లదు తన మెడలో నా కొడుకు తాళి కట్టాడు తను నా కోడలే అని రామరాజు అంటాడు. కానీ భద్రావతి మాత్రం పసుపు తాడుని తాళి అని మీరే అంటున్నారు. నా మేనకోడల్ని నేను ఎప్పటికీ పంపించను అని భద్ర అది గట్టిగా కూర్చుంటుంది. ఆ పెళ్లి చెల్లదు అని నువ్వు అంటున్నావు. అదే పెళ్లిని నేను అంగరంగ వైభవంగా చేసి అందరూ ముందు సాక్షాలను సంపాదించి నీకు చూపిస్తాను అని భద్రకు దిమ్మ తిరిగిపోయేలా వార్నింగ్ ఇస్తాడు రామరాజు.. మళ్లీ పెళ్లి చేయడం ఏంటి? ఏం మాట్లాడుతున్నారు అని నర్మదా అంటున్నా సరే సాక్షాలు కావాలని అంటుంది కదా ఆ సాక్షాలు నా కొడుకు కోడలికి మళ్ళీ పెళ్లి చేసి అందరికీ చూపిస్తాను అని రామరాజు ధీమా వ్యక్తం చేస్తాడు. రామరాజు మాట విన్న భద్రావతి ఎలాగైనా సరే ప్రేమని ధీరజ్ని విడగొట్టాలి అని ప్లాన్ చేస్తుంది.
నర్మదా తన రెండు కుటుంబాలు విడిపోవడానికి కారణం శ్రీ వల్లి అని అనుకుంటుంది. అనుకొని మాత్రమే కాదు తన ఫ్రెండ్ ద్వారా శ్రీవల్లి చేసిన ఆగడాలను బయట పెట్టాలి అని అనుకుంటుంది దానికి సంబంధించిన ఆధారాలను తన ఫ్రెండ్ ద్వారా సంపాదించాలి అని నర్మద ఫిట్ అవుతుంది. అయితే నర్మదా తన ఫ్రెండ్ ను కలిసినప్పుడు దాదాపు ఇవన్నీ చేసింది. శ్రీవల్లినే కానీ భద్రకి ఎలా కాంటాక్ట్ అయింది మాత్రం అర్థం కావడం లేదు అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక కాంటాక్ట్ చేసిన నెంబరు దొరికింది అని తన ఫ్రెండ్ చెప్పగానే శ్రీవల్లి పని అయిపోయింది ఇదే ఇంక లాస్ట్ అని అనుకుంటుంది నర్మదా.. మరి శ్రీవల్లి గురించి మొత్తం నిజాలను నర్మద తెలుసుకుంటుందా లేదా అన్నది సస్పెన్స్ గా మారింది..
ప్రేమ ఒంటరిగా కూర్చుని బాధ పడిపోతూ ఉంటుంది అప్పుడే అక్కడికి వచ్చి నాకు భద్ర ఆశైనా ఇద్దరు కూడా వాడు మీ నాన్నని అవమానించడు. మన బంధువులందరికీ మీ నాన్నని కొట్టాడు.. నిన్ను కూడా కొట్టి అవమానించాడు అలాంటి వాడిని నువ్వు పెళ్లి చేసుకుంటావా ? అంత నీ చేతుల్లోనే ఉంది అంటూ భద్ర ప్రేమని రెచ్చగొట్టేలా మాట్లాడుతుంది. ఇక ప్రేమ కూడా భద్ర మాట విని మౌనంగా ఉండిపోతుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…
Also Read :ఆదివారం టీవీల్లోకి హిట్ సినిమాలు.. వీటిని అస్సలు మిస్ చెయ్యొద్దు..