Gundeninda Gudigantalu : తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న గుండెలను గుడిగంటల సీరియల్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ఇప్పటికే ఈ సీరియల్ గురించి రోజుకో వార్త సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉంటుంది. ఈ సీరియల్ లో బాలు వదిన క్యారెక్టర్ లో మనోజ్ భార్య పాత్రలో నటిస్తున్న రోహిణి గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. రోహిణి ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో హైపర్ ఆక్టివ్ గా ఉంటూ తన లేటెస్ట్ ఫోటోలతో పాటుగా డాన్స్ వీడియోలను కూడా షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. ఈ సీరియల్ ద్వారా మంచి క్రేజ్ ని సంపాదించుకున్న ఈ అమ్మడు ఇప్పుడు ఒక షాకింగ్ నిర్ణయం తీసుకుందని వార్తలు వినిపిస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు రెండు చేతుల సంపాదిస్తూ సోషల్ మీడియా ద్వారా అభిమానులని ఆకట్టుకుంటూ వచ్చిన రోహిణి ఇప్పుడు తీసుకుని నిర్ణయం అభిమానులకు చేదువార్తగా అనిపించడం కూడా.. కొంతమందికి మాత్రం ఈ గుడ్ న్యూస్ అనే చెప్పాలి. మరి రోహిణి ఇంతకీ ఏ నిర్ణయం తీసుకుంది అన్నది ఇప్పుడు కాస్త మనం వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం..
ఈ మధ్యకాలంలో హీరోయిన్ కన్నా ఎక్కువగా సీరియల్ హీరోయిన్లు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తమ గురించి ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకుంటున్నారు. మొన్నటివరకు సీరియల్స్ తో బిజీగా ఉన్నా కూడా సోషల్ మీడియాలో హైపర్ యాక్టివ్ గా ఉంటూ హాట్ యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు సీరియల్ హీరోయిన్లు. కానీ ఈ మధ్య చాలామంది సోషల్ మీడియా కి గుడ్ బాయ్ కూడా చెప్పేస్తుంటారు. ఏమైందో తెలియకుండానే సోషల్ మీడియాకి దూరంగా ఉంటున్నామని ప్రకటించి ఆ తర్వాత మాయమైపోతున్నారు. ఇప్పుడు గుండె నిండా గుడి గంటలు సీరియల్ నటి రోహిణి అలియాస్ జ్యోతిక కూడా సోషల్ మీడియాకి గుడ్ బై చెప్పబోతుంది అంటూ ఓ వార్త నెట్ ప్రచారంలో ఉంది. అందులో నిజం ఎంత ఉందో తెలియదు గానీ ప్రస్తుతం ఇది అయితే చర్చనీయాంశంగా మారింది.. నిజంగానే జ్యోతిక సోషల్ మీడియాకి గుడ్ బై చెప్తుందా? లేక వేరే ఏదైనా కారణం ఉందా అన్నది తెలియాలి అంటే ఆమె స్పందించేంతవరకు వెయిట్ చేయాల్సిందే…
గుండె నిండా గుడి గంటలు సీరియల్ లో నటించిన రోహిణి గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ఈమె గతంలో అనేక సీరియల్స్లలో నటించి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటూ వచ్చింది.. ఇప్పటివరకు ఈమె నటించిన ప్రతి సీరియల్ కూడా మంచి క్రేజ్ ని అందించాయి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.. ప్రస్తుతం గుండెనిండా గుడి గంటలు సీరియల్ తో విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్న రోహిణి సోషల్ మీడియాకి గుడ్ బై చెప్పబోతున్న అంటూ వార్తలు సంచలనంగా మారాయి.. ఏది ఏమైనా కూడా తన హాట్ అందాలతో రెచ్చగొడుతున్నాయి ముద్దుగుమ్మ సోషల్ మీడియాకి సడన్గా బ్రేక్ ఇవ్వడమేంటి అన్న ప్రశ్నలు కూడా అభిమానుల్లో వినిపిస్తున్నాయి. మరి ఇందులో నిజం ఎంత ఉందో తెలియలేదు కానీ ఇదైతే హాట్ టాపిక్ గా మారింది. మరోవైపు జ్యోతిక తను ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోబోతుంది అంటూ వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మరి దానిపై త్వరలోనే ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో సమాచారం.