E-Paper
Advertisement

సత్తా చాటిన కామనర్.. బిగ్ బాస్ 10 తొలి కెప్టెన్ గా లేడీ కంటెస్టెంట్!

సత్తా చాటిన కామనర్.. బిగ్ బాస్ 10 తొలి కెప్టెన్ గా లేడీ కంటెస్టెంట్!
Advertisement

Bigg Boss 10:బిగ్ బాస్ సీజన్ 10 గురించి నిర్వాహకులు ఏదైతే చెప్పి ప్రమోట్ చేశారో.. ఇప్పుడు అక్షరాలా అదే ఆచరిస్తున్నారు. అనే చెప్పాలి. ఊహించని టాస్కులు, భయం గొలిపే ఆటలు, ఊహించని కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అవ్వడం, మళ్ళీ హౌస్ లోకి తీసుకురావడం.. ఇలా ఒక్కటేమిటి ఊహకందని ఎన్నో విషయాలు బిగ్ బాస్ సీజన్ 10 అలియాస్ దశావతారంలో జరుగుతున్నాయి. ఇకపోతే బిగ్ బాస్ హౌస్ లో 12వ రోజు కెప్టెన్సీ టాస్కులు ఉత్కంఠభరితంగా జరిగగా.. పోటీల అనంతరం రైతుబిడ్డగా పేరు తెచ్చుకున్న ఝాన్సీ విజయం సాధించి, బిగ్ బాస్ సీజన్ 10 లో తొలి కెప్టెన్ గా నిలిచి రికార్డు సృష్టించింది..

తొలి కెప్టెన్ గా ఝాన్సీ..

లేటెస్ట్ ఎపిసోడ్ లో కెప్టెన్సీ టెస్ట్ లో భాగంగా చివరి దశలో రామ్ ప్రసాద్ తో పోటీపడిన ఝాన్సీ.. రామ్ ప్రసాద్ కంటే కూడా వేగంగా టాస్క్ పూర్తి చేసి కెప్టెన్సీని సొంతం చేసుకుంది. దీంతో బిగ్ బాస్ ఆమెకు అభినందనలు తెలియజేయడంతో పాటు హౌస్ లో ప్రత్యేకమైన గదిని కూడా కేటాయించారు. బిగ్ బాస్ ఇచ్చిన నిబంధనల ప్రకారం.. కట్టర్ ఉపయోగించి ఫెన్సింగ్ ను కట్ చేసి అవతల వైపుకి చేరుకోవాలి. అక్కడికి చేరుకున్న తర్వాత కెప్టెన్సీ జెండాను ఎగరవేసిన వ్యక్తి విజేతగా నిలుస్తారు. అలా చివరి టాస్క్ ను ఝాన్సీ సునాయాసంగా ఇచ్చిన టైం కంటే ముందే పూర్తి చేసి ఫ్లాగ్ ను ఎగరవేసింది. దీంతో బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 లో తొలి కెప్టెన్ గా ఎంపికై అందరిని ఆశ్చర్యపరిచింది. ఇక మొత్తానికైతే తొలి కెప్టెన్గా అందులోను లేడీ కామనర్ హౌస్ కి కెప్టెన్ గా నిలిచి సరికొత్త రికార్డు సృష్టించింది.

ఎప్పటిలాగే మరోసారి షాలిని – వర్షిణి మధ్య మాటలు యుద్ధం

Advertisement

ఇకపోతే పచ్చ గడ్డి వేసినా షాలిని – వర్షిణి మధ్య భగ్గుమంటుంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే తాజా కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా రాంప్రసాద్ కెప్టెన్ కావాలనేది తమ కోరిక అని , షాలినికి వయస్సు, అనుభవం తక్కువగా ఉండడంతోనే ఆమెను అడ్డుకుంటున్నామని చెప్పడంతో.. షాలిని తీవ్రంగా మండింది. కెప్టెన్ కావడానికి వయసే ప్రమాణమా?, తన వయసును మధ్యలోకి తీసుకురావాల్సిన అవసరం ఏముంది ?, వయసు ఎక్కువగా ఉన్న వారే కెప్టెన్ కావాలన్న నిబంధన ఏదైనా ఉందా? అలాంటప్పుడు ఆటలాడడం ఎందుకు ? అంటూ తనదైన శైలిలో మండిపడుతూ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో ఎప్పటిలాగే ఇద్దరి మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. ఇక అలా వీరిద్దరి గొడవ కూడా ఎపిసోడ్లో హైలెట్గా నిలిచింది.

ALSO READ:సోషల్ మీడియా దెబ్బకు దిగివచ్చిన అను ఇమ్మాన్యుయేల్.. ?

అసలు బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ ఏంటి?

Advertisement

కెప్టెన్సీ టాస్క్ లో బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ విషయానికి వస్తే.. రామ్ ప్రసాద్ , షాలిని, ఝాన్సీ , ముఖేష్ కెప్టెన్సీ కంటెండర్లు గా పోటీపడ్డారు. బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ ప్రకారం ఈ ఐదుగురు జైలులో ఉంటే.. మిగిలిన హౌస్ మేట్స్ గార్డులుగా వ్యవహరించాలి. వంశీ, రోహిత్ గార్డులను నియంత్రించే బాధ్యతలు తీసుకున్నారు. జైలు గేటు తెరిచిన వెంటనే కంటెండర్లు బయటకు వచ్చి గోడ దూకి సేఫ్ జోన్ లోకి చేరుకోవాల్సి ఉంటుంది. అయితే గార్డులు తమకు కెప్టెన్ గా చూడకూడదు అనుకున్న కంటెండర్ ను అడ్డుకునే అవకాశం కూడా ఉంటుంది. ప్రతి రౌండ్లో గార్డులకు చిక్కిన కంటెండర్ టాస్క్ నుంచి బయటకు వెళ్లాల్సి ఉంటుంది . ఈ క్రమంలో రెండు గ్రూపులుగా విడిపోయారు. నరేష్ దేబ్జానీ , వర్షిని తదితరులు షాలినీని లక్ష్యంగా చేసుకున్నారు. మరొకవైపు రాంప్రసాద్ , ముఖేష్ గౌడ సేఫ్ జోన్ లోకి వెళ్లిపోయారు. ఝాన్సీ ని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. కానీ షాలినిని అడ్డుకునే సమయంలో గార్డుల దృష్టి ఝాన్సీ పై నుంచి మళ్లడంతో ఆమె సేఫ్ జోన్ లోకి వెళ్ళింది. తర్వాత జరిగిన రౌండ్లో ముకేష్ , త్రిగుణ్ తప్పుకోగా చివరికి రాంప్రసాద్ , ఝాన్సీ పోటీపడ్డారు.. ఇక ఝాన్సీ విజేతగా నిలిచి తొలి కెప్టెన్గా బాధ్యతలు చేపట్టింది.

Related News

గుండెనిండా గుడిగంటలు రోహిణి షాకింగ్ నిర్ణయం..?హమ్మయ్య ఫ్యాన్స్ హ్యాపీ..

ఇండస్ట్రీకి రోహిణి గుడ్ బై.. ఎందుకో తెలుసా..?

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ రోహిణిని విడగొట్టేందుకు ప్లాన్.. మీనా ఫుల్ హ్యాపీ.. మనోజ్ కు వార్నింగ్..

Podarillu Today Episode : చక్రీ పంట పండిందిరోయ్.. అస్సలు ఊహించని ట్విస్ట్.. చక్రీ మాస్టర్ ప్లాన్..

Karthika Deepam 2 Serial Today Episode September 19th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలినిని ప్రశ్నించిన సూరజ్ – కార్తీక్ ఇంటికి వెళ్లిన శివనారాయణ ఫ్యామిలీ         

Intinti Ramayanam Today Episode: తాగొచ్చి రచ్చ చేసిన కమల్.. పార్వతికి అనుమానం..పల్లవి మాస్టర్ ప్లాన్..

Saturday Movies in Tv : శనివారం సినిమాల సందడి.. జాతర మాములుగా లేదు..

Big Stories

Advertisement
×