Intinti Ramayanam Today Episode December 13th : నిన్నటి ఎపిసోడ్ లో.. పార్వతీ భానుమతి కమల్ అరెస్టు అవడంపై టెన్షన్ పడుతూంటారు. ఇంకా కోమలి వినోదులు కూడా అమలుకు సిగరెట్ కాల్చడమే రాదు అలాంటిది మత్తు పదార్థాలు ఎలా వాడింటాడు అనేసి ఇద్దరు మాట్లాడుకుంటుంటారు.. అప్పుడే కమల్ రాజేంద్రప్రసాద్, అవని పల్లవిలు ఇంటికొస్తారు. కమల్ బయటికి రావడంతో సంతోషంగా ఉంటుంది.. అవని పార్వతి దగ్గరికి వెళ్లి మీ అబ్బాయిని పోలీసులు మత్తు పదార్థాల కేసులు అరెస్ట్ చేశారు అత్తయ్య అనగానే షాక్ అవుతారు. ఇక రాజేంద్రప్రసాద్ మన ఇంట్లో ఎవరో తెలిసిన వాళ్ళే అక్షయ్ అంటే పడని వల్లే ఇవన్నీ కావాలని ఇరికిస్తున్నారనేసి అంటాడు. పల్లవి చక్రధర్ కు ఫోన్ చేసి ఏంటమ్మా అక్షయ్ అరెస్టు అయ్యారు కదా ఇంట్లో ఎలా ఉంది అనగానే మన విషయం బయటపడకుండా చూసుకోవాలి అంటుంది. నువ్వేం భయపడకు మన విషయం బయటకు రాదు అనేసి అంటాడు. తర్వాత రోజు ఉదయం రాజేంద్రప్రసాద్ అవనీలు ఆఫీస్ కి వెళ్తారు. అక్కడ ఇక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ను చెక్ చేస్తారు. మొన్నటి రికార్డు కనిపించదు. దాంతో అవని రాజేంద్రప్రసాద్ లు అనుమానిస్తారు. ఎవరో కావాలనే ఇలా చేశారు సీసీటీవీ ని ఆఫ్ చేసి ప్లాన్ చేశారు అనేసి అవని అంటుంది. ఎదురుగా ఉన్న ఏటీఎం సెంటర్లో సీసీటీవీ కెమెరాలు పనిచేస్తాయి కదా మామయ్య దాని గురించి మనం తెలుసుకుంటే అసలు దొంగ ఎవరో తెలుసుకోవచ్చు అని అంటుంది అవని.. ఇక కమల్ అవనికి ఫోన్ చేసి ఏమైంది వదిన ఏమైనా తెలిసిందా అనేసి అడుగుతాడు. దానికి అవని అసలు దొంగ ఎవరో తెలిసిపోయింది కన్నయ్య అనగానే అందరు సంతోషంగా ఫీల్ అవుతారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది..
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. పోలీస్ స్టేషన్కు ఆఫీస్ పైన తీసుకుని వెళ్లడం చూసి కమల్ షాక్ అవుతాడు. వీడు మా ఆఫీస్ బాయ్ అండి వీడిని ఎందుకు తీసుకొచ్చారని పోలీసులు అడుగుతాడు.. ఆఫీస్ బాయ్ అయితే క్రైమ్ చేయకూడదు అని రూల్ ఉందా అనేసి ఎస్ఐ కమల్ ని అడుగుతాడు. పోలీసులు కొట్టి నిజం చెప్పించమని అవని చెప్తుంది. పోలీసులు అన్ని చితగ్గొడితే వాడు డబ్బులు కోసం ఆశపడ్డానని చెప్తాడు. 50 లక్షలు డిమాండ్ చేసి లొంగి పోదామని అనుకున్నానని బాయ్ చెప్తాడు. ఇక అక్షయ్ తీసుకొని అందరూ ఇంటికి వెళ్తారు. అక్షయ్ ఇంటికి రావడం చూసి పార్వతి భానుమతి సంతోష్ పడతారు. ఆరాధ్య అక్షయ్ పైకెక్కి నువ్వు బిజినెస్ పని మీద బయటకు వెళ్ళావని చెప్పారు డాడీ మమ్మీ నువ్వు ఇంకెప్పుడూ చెప్పకుండా వెళ్లొద్దు అనేసి అంటుంది. ఇక అవని నీ దిష్టి తీయమని చెప్తారు. అవని అక్షయకి దిష్టి తీస్తుంది..
ఇక రాజేంద్రప్రసాద్ నాకు పెద్ద పెద్ద లాయర్లు తెలుసు వాళ్లతో మాట్లాడాను వాళ్లు కూడా చేతులెత్తేశారు. పోలీసులు కూడా తెలుసు పోలీసులతో కూడా నేను మాట్లాడాను కానీ ఎవరు ఏమీ చేయలేమని చెప్పడంతో నేను మౌనంగా ఉండిపోయాను. నిన్ను బయటకు తీసుకొచ్చేంత వరకు నిద్రపోలేదు అనేసి రాజేంద్రప్రసాద్ అంటాడు. ఇక పార్వతీ కూడా అవని నాకు ఇచ్చిన మాట ప్రకారం ఏ తీసుకొచ్చింది అంటుంది. ఇక కమల్ అప్పుడు మర్డర్ కేసులో నుంచి నేను బయట పడేసింది వదినే ఇప్పుడు ఈ కేసు నుంచి బయట పడేసింది వదినే నువ్వు వదినకి ముందు థాంక్స్ చెప్పాలి పోలీస్ స్టేషన్ లోనే చెప్తావని అనుకున్నాను కానీ చెప్పలేదు ఇప్పుడు నా అర్జెంటుగా వెళ్లి థాంక్స్ చెప్పు అనేసి అంటాడు. అవున్రా అవన్నీ చేసింది చాలా మంచి పని చాలా తెలివిగా చేస్తుందని రాజేంద్రప్రసాద్ అవని గ్రేట్ అని పొగుడుతాడు.
అవని దగ్గరికి వెళ్లిన అక్షయ్ అవినీకి ముందు సారీ చెప్పాలని సారీ చెప్తాడు. నిన్ను ఇంట్లో వాళ్ళందరూ ఏమంటున్నారో తెలుసా? నువ్వు చాలా గొప్ప పని చేసావ్ అని అంటున్నారు థాంక్స్ అనేసి చెప్తాడు. మిమ్మల్ని కాపాడుకోవడం నా బాధ్యత దానికి థాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదు కదండీ అనేసి అంటుంది. అవని చేసిన పనికి అక్షయ్ మనసులో ఉన్న కోపం పోయింది అవని మీద ప్రేమ మొదలవుతుంది.. ఇక పల్లవి నేను ఎన్ని ప్లాన్లు వేసిన వృధా అయిపోతున్నాయి అవనీని గెలవలేకున్నాను అనేసి టెన్షన్ పడుతూ ఉంటుంది. భానుమతి వచ్చి ఎందుకే అంత టెన్షన్ పడుతూ తిరుగుతున్నావు అనేసి అడుగుతుంది. ఇంత కష్టపడి నేను అక్షయ్ ని ఇరికిస్తే ఆ క్రెడిట్ అవని కొట్టేసింది అనేసి అంటుంది. అక్షయ్ ని నువ్వు ఇరికించావా ఏం మాట్లాడుతున్నావ్ అనగానే పల్లవి తేరుకొని అక్షయ్ బావని ఎలా బయటికి తీసుకురావాలా అనేసి ఆలోచించాను. అంతలోపే అవని వెళ్లి తీసుకొని వచ్చింది అందుకే అవన్నీ నీ నెత్తిన పెట్టుకొని చూసుకుంటున్నారు అనేసి కవర్ చేస్తుంది. ఇక కమల్ వచ్చేసి నా భార్య కడుపుతో ఉంది కదా ఈ భగవద్గీతను చదివి నా భార్యకు వినిపించు అనేసి బుక్ ఇచ్చి వెళ్ళిపోతాడు. తర్వాత రోజు ఉదయం అనాధాశ్రమం నుంచి వార్డెన్ వస్తుంది. ఒక బాబుకి గుండె సమస్య వచ్చిందని లక్షలు కావాలని అడుగుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో వీళ్ళిద్దరి మాట్లాడుకోవడం పల్లవి వింటుంది.. మరి రేపు ఏం జరుగుతుందో చూడాలి..