Serial Actress: సినిమాల్లోనూ సీరియల్స్లలోనూ నటిస్తున్న వారి జీవితం ఎవరిది తెరిచిన పుస్తకం కాదు.. గతంలో ఎన్నో కష్టాలను అనుభవించి ఇప్పుడు మంచి పొజిషన్లో ఉంటూ నలుగురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి కష్టపడి పైకి వచ్చిన నటీనటులు ఎందరో ఉన్నారు. అలాంటి వారిలో సీరియల్ నటుడు అనిల్ కూడా ఒకరు. ఈయన గురించి ఎంత చెప్పినా తక్కువే. సీరియల్ యాక్టర్ గా తన జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగిపోతుంది. అయితే ఈయన సీరియల్ లో యాక్టర్ గా నటించక ముందు కెమెరా బాయ్ గా పని చేసినట్లు తెలుస్తుంది. ఆ తర్వాత సీరియల్ లోకి ఎంట్రీ ఇచ్చి అతి తక్కువ కాలంలోనే మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు.. అయితే కెమెరా బాయ్ నుంచి సీరియల్ యాక్టర్ గా ఎలా మారారు..? ఆయన రెమ్యూనరేషన్ ఎంత అన్నది ఇప్పుడు మనం తెలుసుకుందాం..
అసిస్టెంట్లుగా పనిచేసే ఆ తర్వాత నట్లుగా మారిన ఎంతోమంది ఇప్పుడు సక్సెస్ఫుల్ యాక్టర్స్ గా ప్రేక్షకుల మనసు దోచుకున్నారు.. అలాంటి వారిలో సీరియల్ యాక్టర్ అనిల్ ఒకరు. ఈయన మొదట ఆర్థిక పరిస్థితి బాగో లేకపోవడంతో ఏదో ఒక పని చేసే కుటుంబ పోషణకు సహాయంగా ఉండాలని అనుకున్నారట.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈయన తన జీవితం గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.. అందులో మీ కెమెరా బాయ్ గురించి ఎన్నో విషయాలను షేర్ చేసారు. కెమెరా బాయ్ అంటే ఒక కెమెరా మాన్ నుంచి మరో కెమెరా మాన్ కి లెన్స్ లను పంపించడం. అయినా ఇంటర్మీడియట్ అయిన తర్వాత ఇలా పని చేసే వారట. అప్పుడు ఆయనకిచ్చిన రెమ్యూనరేషన్ రోజుకి 40 రూపాయలు.. అంతేకాదు రోజంతా పనిచేసినందుకు భోజనం కూడా పెట్టేవారట. అలా కొన్ని గడిచిన తర్వాత.. తులసి దళం సీరియల్ తో యాక్టర్ గా మారారు.
Also Read : ‘కార్తీక దీపం ‘ జ్యోత్స్న కు పెళ్లి అయ్యిందా..? బ్యాగ్రౌండ్ ఇదే..
యాక్టర్ అనిల్ చేసిన మొదటి సీరియల్ తులసీదళం.. అప్పట్లో ఈ సీరియల్ మంచి టాక్ని సొంతం చేసుకుంది.. ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న ఈ సీరియల్ అనిల్ కి యాక్టర్ గా మంచి పేరును తీసుకొచ్చింది.. మొదట సీరియల్ కైనా తీసుకున్నారు ఒకరోజుకి 5000 వరకు ఉంటుందని చెప్పారు. అలా ఒక్కో సీరియల్లో తన నటన ప్రతిభతో తెలుగు ప్రేక్షకులను మెప్పిస్తూ ప్రస్తుతం స్టార్ యాక్టర్ గా వరుసగా సీరియస్ చేస్తూ బిజీగా ఉన్నారు. ఇది ఆయన చూడడానికి యంగ్ గా ఉన్న సరే ప్రస్తుతం తండ్రి పాత్రలో నటిస్తూ వస్తున్నారు. మీరు వయస్సు గా ఉన్న ఇలాంటి పాత్రలు ఎందుకేంచుకున్నారని యాంకర్ అడిగారు.. వయసు సంబంధం లేదండి పాత్ర ఏదైన నటన బాగుండాలి.. అప్పుడే ప్రేక్షకులు మనల్ని ఆదరిస్తారు అని ఆయన చక్కగా చెప్పారు.. ఈ ఇంటర్వ్యూ ఎప్పుడో జరిగింది కానీ ఆయన గురించి ఇప్పుడు మరోసారి వార్తలు వినిపించడంతో ఈ ఇంటర్వ్యూ వీడియో మళ్లీ వైరల్ అవుతుంది.