Karthika Deepam Jyotsana : బుల్లి తెర ప్రేక్షకులను సీరియల్స్ ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.. ఆడవాళ్లే కాదు మగవాళ్ళ సైతం ఈ మధ్య సీరియల్స్ ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. కుటుంబ కథ చిత్రాల లాగా కుటుంబం మొత్తం చూసే సీరియల్స్ ఈమధ్య ఎక్కువగా రావడంతో అందరూ కూడా సీరియల్స్ ను చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.. స్టార్ మా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న సీరియల్ కార్తీకదీపం. ఈ సీరియల్లో ఎంతోమంది నటీనటులు నటించారు. గతంలో విలన్ క్యారెక్టర్లో మోనిత నటించింది.. సీజన్ 2 లో మాత్రం జ్యోత్స్న నటిస్తుంది. ఈమె రియల్ లైఫ్ గురించి చాలా మంది తెలుసుకునేందుకు గూగుల్లో తెగ వెతికేస్తున్నారు. ఇవాళ మనం ఈ జ్యోత్స్న రియల్ లైఫ్ గురించి తెలుసుకుందాం…
స్టార్ మా లో సక్సెస్ ఫుల్ టాక్ తో దూసుకుపోతున్న సీరియల్ కార్తీక దీపం.. గతంలో ఈ సీరియల్కు మంచి టీఆర్పి రేటింగ్ రావడంతో.. మళ్లీ సీజన్ టు నువ్వు మొదలుపెట్టారు. అయితే కార్తీకదీపం లో మెయిన్ క్యారెక్టర్లు డాక్టర్ బాబు, దీపతో పాటుగా మౌనిత హైలెట్ అయింది. ఈ మూడు క్యారెక్టర్లు మళ్లీ సీజన్లో కూడా ఉంటాయని జనాలు అనుకున్నారు. కానీ ఎవ్వరూ ఊహించని విధంగా మౌనిత పాత్రలో జ్యోత్స్న అలియాస్ గాయత్రి ఎంట్రీ ఇచ్చింది.. ఈమె గురించి అతి తక్కువ మందికి మాత్రమే తెలుసు.. ఈమె సీరియల్స్ కన్నా ముందు యాంకరింగ్ చేసింది. ఆమెను గాయిత్రి మున్ని సింహాద్రి అని కూడా పిలుస్తుంటారు.
జీ తెలుగులో సూపర్ హిట్ అయిన ‘త్రినయని’ సీరియల్‌లో కసి పాత్రలో విలనిజం పండించింది. ఈటీవీలో జోష్ వంటి ఎంటర్‌టైన్మెంట్ కార్యక్రమాలకు యాంకరింగ్ చేసింది. ఆ తర్వాత మోడలింగ్ లో అడుగుపెట్టింది.. అలా సీరియల్స్ లలో నటిస్తూ బిజీగా మారింది. ఈమెకు పెళ్లయింది.. భర్త కు బాగానే ఆస్తులు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. సీరియల్స్ తో బిజీగా ఉన్నా సరే సోషల్ మీడియాలో కూడా ఈమె యాక్టివ్ గా ఉంటుంది. లేటెస్ట్ ఫోటోలతో గుర్రాలను ఆకట్టుకుంటుంది. ఈమె రెమ్యూనరేషన్ కూడా ఎక్కువే.. ఒక ఎపిసోడ్ కి 25 వేల వరకు తీసుకుంటుందని తెలుస్తుంది.. నెల వరకు షూటింగ్ ఉంటుంది కాబట్టి ఏమైనా సంపాదన లక్షల్లో ఉంటుందని తెలుస్తుంది. ఈ సీరియల్ తర్వాత ఎటువంటి సీరియల్లో నటిస్తుందో చూడాలి..
బుల్లితెర ప్రముఖ తెలుగు ఛానల్ స్టార్ మా లో ప్రసారమవుతున్న సీరియల్స్లలో టాప్ రేటింగ్ లో కొనసాగుతుంది కార్తీకదీపం 2. ఈ సీరియల్ నానాటికీ రేటింగ్ ని పెంచుకుంటూ దూసుకుపోతుంది. మిగిలిన సీరియల్స్ కన్న వెనుక స్టార్ట్ అయిన కూడా ఇదే టాప్ లో కొనసాగడం విశేషం. సీజన్ వన్ కి ఉన్నంత ఆదరణ 2కి లేదని తెలుస్తుంది. అయినా కూడా ఈ సీరియల్ టాప్ లో కొనసాగడం విశేషం.