BigTV English

Happy Birthday Venkatesh: అలా ఉండటం కేవలం వెంకటేష్ కు మాత్రమే సొంతం

Happy Birthday Venkatesh: అలా ఉండటం కేవలం వెంకటేష్ కు మాత్రమే సొంతం

Happy Birthday Venkatesh: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న సీనియర్ హీరోస్ లో విక్టరీ వెంకటేష్ ఒకరు. పేరులో విక్టరీ ఉన్నట్లే తన లైఫ్ లో కూడా ఎంతో విక్టరీ సాధించాడు వెంకటేష్. వెంకటేష్ కు ఉన్న ఫ్యామిలీ ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విక్టరీ వెంకటేష్ నుంచి ఒక సినిమా రిలీజ్ అవుతుందంటే చాలు ఫ్యామిలీ ఆడియోస్ అంతా కూడా థియేటర్ కి పరుగులు పెడతారు. ప్రముఖ నిర్మాత రామానాయుడు కుమారుడుగా 1986లో కలియుగ పాండవులు సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చారు వెంకటేష్. ఆ తర్వాత శ్రీనివాస కళ్యాణం,బ్రహ్మపుత్రుడు,ప్రేమ, ధ్రువ నక్షత్రం వంటి వరుస సూపర్ హిట్ సినిమాలతో మంచి స్టార్ డం సాధించుకున్నాడు.


ఇకపోతే విక్టరీ వెంకటేష్ ఫ్యామిలీ హీరోగా మంచి గుర్తింపు సాధించుకోవడానికి స్వర్ణకమలం, పవిత్ర బంధం, ప్రేమించుకుందాం రా, కలిసుందాం రా, నువ్వు నాకు నచ్చావ్ వంటి సినిమాలు బాగా మంచి ప్లస్ అయ్యాయి. త్రివిక్రమ్ శ్రీనివాస్ రచయితగా చేసిన నువ్వు నాకు నచ్చావ్ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఈ సినిమా ఎన్నిసార్లు చూసినా కూడా అసలు బోర్ కొట్టదు అంత అద్భుతంగా ఈ సినిమాను డిజైన్ చేశాడు త్రివిక్రమ్. ఈ సినిమాకి దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాకపోయినా కూడా ఈ సినిమా పేరు చెప్పగానే త్రివిక్రమ్ గుర్తుకు వస్తాడు అది త్రివిక్రమ్ రైటింగ్ కి ఉన్న పవర్ అని చెప్పాలి. వెంకటేష్ లోని ఇంత మంచి కామెడీ యాంగిల్ ఉంది అని ఆ సినిమాతోనే ప్రూవ్ అయింది. ఇప్పటికీ దాన్ని కొట్టే సినిమా రాలేదు అంటే అతిశయోక్తి కాదు.

వరుసగా హీరోగా సక్సెస్ అవుతూ డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలు ఎంచుకుంటూ కెరియర్ లో ముందుకు వెళ్లారు విక్టరీ వెంకటేష్. ఇక రీసెంట్ టైమ్స్ లో మల్టీస్టారర్ సినిమాలో కూడా తెర తీసి తన పంథాను మార్చుకున్నాడు. ఇదివరకే సూపర్ స్టార్ మహేష్ బాబు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రామ్ పోతినేని, నాగచైతన్య వంటి హీరోలతో కూడా కలిసి సినిమాలు చేసి ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేశారు. ఇక వెంకటేష్ కెరియర్ లో ఎన్నో రీమేక్ సినిమాలు ఉన్నాయి. రీమేక్ సినిమా చేసినా కూడా ప్రేక్షకులు కళ్ళల్లో నీళ్లు తిరిగేలా నటించడం వెంకటేష్ కు మాత్రమే సాధ్యమని చెప్పాలి.


ఇకపోతే తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో చాలా ఫ్యాన్ వార్స్ జరుగుతూ ఉంటాయి. ఒక హీరోకు సంబంధించిన ఫాన్స్ మరో హీరోని ట్రోల్ చేస్తున్నట్లు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కూడా అవుతాయి. ఇకపోతే అంతమంది హీరోలు ఫ్యాన్స్ ఇష్టపడే ఏకైక హీరో విక్టరీ వెంకటేష్ అని చెప్పొచ్చు. వెంకటేష్ కి అసలు నెగిటివ్ ఫ్యాన్స్ ఉండరు. అలా ఉండడం కేవలం వెంకటేష్ కు మాత్రమే సాధ్యమైంది. అందరూ వెంకటేష్ ను వెంకీ మామ అని పిలుచుకుంటారు. దీన్నే పరిగణలోకి తీసుకొని బాబీ సినిమా టైటిల్ కూడా పెట్టాడు. ప్రస్తుతం సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాలో నటిస్తున్నాడు వెంకటేష్. ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ కానుంది. ఇలానే ఎప్పటికీ ఫ్యామిలీ ఆడియన్స్ ని ప్రేక్షకులను అలరించాలని కోరుకుంటూ బిగ్ టివి తరుపున పుట్టినరోజు శుభాకాంక్షలు.

Also Read : Venkatesh Assets: వెంకీ మామ తెలివైనోడు గురూ.. ఎన్ని వేల కోట్లకు అధిపతి అంటే..?

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×