E-Paper
Advertisement

Intinti Ramayanam Today Episode: అక్షయ్ నిర్ణయంతో ముక్కలైన కుటుంబం.. పార్వతిని రెచ్చగొట్టిన పల్లవి.. భానుమతి సూసైడ్..

Intinti Ramayanam Today Episode: అక్షయ్ నిర్ణయంతో ముక్కలైన కుటుంబం.. పార్వతిని రెచ్చగొట్టిన పల్లవి.. భానుమతి సూసైడ్..
Advertisement

Intinti Ramayanam Today Episode December 14th: నిన్నటి ఎపిసోడ్ లో.. రాజేశ్వరి ఎంత చెప్పినా సరే అక్షయ్ వినడు. దాంతో నేను నీకు తల్లిలాగా అడుగుతున్న సరే నువ్వు మాత్రం నీ మనసు మార్చుకోవడం లేదు అని రాజేశ్వరి బాధపడుతుంది. ఎంతగా రాజేశ్వరి నా భర్తను విడిపించండి అని వేడుకున్న సరే అక్షయ్ మాత్రం కరగడు.. అక్షయ్ బాటలోనే కమల్ కూడా నడుస్తాడు.. ఆ దుర్మార్గున్ని బయటకి తీసుకువచ్చే ఫసక్తే లేదు అని అంటాడు.. రాజేశ్వరి మీరందరూ నా ఉసురు పోసుకుంటారు.. ఆడబిడ్డ ఉసురు పోసుకునోళ్ళు ఏ ఒక్కరు బాగు పడినట్లు లేదు..

మీరందరూ నాశనం అయిపోతారు అని శాపాలు పెడుతుంది.. అవని చక్రధర్ని కలవడానికి పోలీస్ స్టేషన్ కి వెళుతుంది.. అక్కడ చక్రధర్ ఏంటి ఇలా వచ్చావు నాతో మాట్లాడాలని వచ్చావా నేను ఎలా ఉన్నానో చూడాలని వచ్చావా అని అడుగుతాడు. నువ్వు మారిపోయావని పిన్ని చెప్తుంటే నువ్వు మారవో లేదో తెలుసుకుందామని నేను వచ్చాను అని అవని అంటుంది. చక్రధర్ ని నేను కలిసాను అతను ఏమీ మారలేదు అని అక్షయ్ తో చెప్తుంది.. ఇంట్లోని వాళ్ళు ఎవరు కూడా భోజనం చేయడానికి రారు అక్షయ్ ఎంతగా బ్రతిమలాడినా సరే వాళ్ళు తినము అని చెప్తారు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది..

Advertisement

ఇక ఇవాళ ప్రోమో విషయానికి వస్తే.. అక్షయ్ పిలిచినా భోజనానికి ఎవరూ రాలేరని అవని బాధపడుతుంది. మీరు కూర్చోండి నేను వెళ్లి తీసుకొస్తాను అని అవని అంటుంది. మీరు పిలిచినా కూడా వాళ్లు రారు అని అక్షయ్ అంటాడు. చక్రధర్ మామయ్య చేసిన అన్యాయం గురించి చెప్తేనే వీళ్ళు ఇలా అంటున్నారు. ఆయన మనల్ని ఇబ్బంది పెట్టడు అని మనకు నమ్మకం. బయటికి వచ్చిన తర్వాత ఆ దుర్మార్గుడు మరింతగా రెచ్చిపోతాడు.. నేను ఎంత చెప్పినా వీళ్లకు అర్థం కావడం లేదు అని అక్షయ్ అంటాడు. పల్లవి రాజేంద్రప్రసాద్ భానుమతి పార్వతి ఎవరు కూడా భోజనం చేయరు. ఎన్ని రోజులు ఉంటారో ఉండనివ్వు ఆ దుర్మార్గున్ని బయటికి తీసుకొచ్చే పనేలేదు అని అక్షయ్ అంటాడు.

శ్రియా శ్రీకర్ మాత్రం ఎవరి గురించి పట్టించుకోకుండా భోజనం చేస్తారు. కమల్ పల్లవిని అడిగితే ఎన్ని సార్లు చెప్పాలి నాకు భోజనం వద్దు అని.. మా నాన్న జైల్లో ఉంటే నేను ఎలా తింటూ కూర్చుంటాను అని పల్లవి అంటుంది. మీ నాన్న ఏం అంత మంచివాడు కాదు నువ్వు అంతగా ఫీల్ అయిపోయి కడుపు మార్చుకోవడానికి.. నువ్వు రావు కదా మీది కూడా నేనే తినేస్తాను అని కమల్ అక్కడి నుంచి వస్తాడు. అమ్మ నాన్న రాలేదని తెలుసుకొని బాధపడతాడు. వాళ్ళు ఏం చెప్పినా ఇప్పుడు విన్నర్ కన్నయ్య నువ్వు అసలే ఆకలికి ఆకలేవు తినేసేయ్ అని అంటుంది.

Advertisement

కానీ అక్షయ్ కూడా భోజనం చేయడు. ఇంట్లో చక్రధర్ కారణంగా ఎవరికి వారే అన్నట్లు ఉంటారు. అటు రాజేశ్వరి తన పుట్టింటి వాళ్లే తనకి సాయం చేయలేదు అని బాధపడుతూ ఉంటుంది. అవని అచ్చులు ఇంట్లో వాళ్ళ పరిస్థితిని చూసి రాజేశ్వరి దగ్గరికి వెళ్తారు.. రాజేశ్వరి తన భర్తని తీసుకురావాల్సిందేనని చెప్తుంది. అతను మారాడని నువ్వు అనుకుంటున్నావు కానీ అతను ఏమీ మారలేదు అని అవని ఎంత చెప్తున్నా సరే రాజేశ్వరి వినదు. నా భర్తను తీసుకొస్తేనే నాతో మాట్లాడండి లేదంటే ఈ అత్త లేదు అని అనుకోండి అని అంటుంది. అయితే నువ్వు కూడా ఆలోచించ అత్తయ్య ఆ దుర్మార్గం నీ బయటికి తీసుకొచ్చి మళ్ళీ మేము ఇబ్బందుల్లో పడాలని అనుకోవట్లేదు అని అవని అక్షయ్ చెప్పేసి వస్తారు..

Also Read : హమ్మయ్య శ్రీవల్లి ప్లాన్ సక్సెస్.. ప్రేమ అనుమానమే నిజమా..? అమూల్య పరిస్థితి ఏంటి…?

పార్వతి బట్టలు ఆరేయడానికి వెళ్తే ఇటువంటి అత్తయ్య నేను ఆరేస్తాను అని అవని అంటుంది. కానీ పార్వతి మాత్రం ఏమి మాట్లాడకుండా వెళ్ళిపోతుంది. అప్పుడే ఇంట్లోంచి వచ్చిన ఆరాధ్య. బామ్మ చచ్చిపోవాలని ఏదో చేసుకుంటుంది లోపలికి రండి అని అంటుంది.. భానుమతి తనపై పెట్రోల్ పోసుకొని చచ్చిపోవాలని అనుకుంటుంది. ఇంట్లో ఇవాళ అందరూ కూడా నీకు ఏమైనా పిచ్చి పట్టిందా ఎందుకు చచ్చిపోవాలని అనుకుంటున్నావు అని అడ్డుపడతారు. ఈ వయసులో నా కూతురు పరిస్థితిని చూసి నేను తట్టుకోలేకపోతున్నాను. నేను చచ్చిపోతాను అని అంటుంది. అక్కడితో ప్రోమో ఎండ్ అవుతుంది. సోమవారం ఎపిసోడ్లో భానుమతి వల్ల చక్రధర్ ని బయటకు తీసుకొస్తారా లేదా అన్నది చూడాలి..

Related News

వామ్మో.. యూట్యూబ్ ద్వారా ఏడాదికి రూ.2,300 కోట్లా.. ఎవరా యూట్యూబర్?

కౌశల్ ను తొక్కేశారా? ఇన్నాళ్లకు నోరు విప్పిన బిగ్ బాస్ విన్నర్!

బిగ్ బాస్ 10కి ఎంపికైన తొలి కామనర్.. కన్నీళ్లు పెట్టుకున్న నవదీప్.. వీడియో వైరల్!

గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ జంట.. మరో బిడ్డకు ఆహ్వానం!

మాధురి రాథోడ్ తల్లిపై ఈశ్వర్ సాయి భార్య ఊహించని కామెంట్స్!

Nindu Noorella Saavasam Serial Today Episode September 5th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండను తిట్టిన మనోహరి  

Gundeninda Gudigantalu : సీరియల్ లవర్స్ కు షాక్.. రోహిణి ఇక కనిపించదా..?

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి దిమ్మతిరిగే షాక్.. శృతి దెబ్బ అదుర్స్.. రోహిణి మాస్టర్ ప్లాన్ ..?

Big Stories

Advertisement
×