Bigg Boss Buzzz Promo : బుల్లితెర టాప్ రియాలిటీ షో బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇవ్వడం అంత ఈజీ కాదు.. ఒకవేళ హౌస్ లోకి వెళ్తే ఆ తర్వాత విమర్శలు అందుకోకుండా బయటికి రారు. గత ఎనిమిది సీజన్ నుంచి ఇది చూస్తూనే ఉన్నారు.. ఏదో అనుకొని హౌస్ లోకి వెళ్ళాక అక్కడ ఏదో జరగడంతో మిగిలిన కంటెస్టెంట్లతో పోటీలో నిలవలేక చాలామంది మధ్యలోనే డ్రాప్ అవ్వడమో.. లేదా ఎలిమినేట్ అయ్యి బయటకు రావడం జరుగుతుంది. బిగ్బాస్ నుంచి బయటకు వచ్చిన ప్రతి కంటెస్టెంట్ కూడా బిగ్ బాస్ నిర్వహిస్తున్న బిగ్ బాస్ బజ్ షోలో ఇంటర్వ్యూకు వస్తుంటారు. ఈ షోకు సినీ నటుడు శివాజీ హోస్ట్ గా వ్యవహారిస్తున్నారు.. ఇప్పటివరకు హౌస్ నుంచి బయటికి వచ్చిన ప్రతి కంటెస్టెంట్ శివాజీ దగ్గరికి వెళ్లాల్సిందే… తాజాగా శనివారం ఎపిసోడ్లో ఎలిమినేట్ అయిన సుమన్ శెట్టి బిగ్ బాస్ బజ్ కి వెళ్ళాడు.. ఆ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ ప్రోమోలో ఎవరిని ఎవరు ఆడుకున్నారో ఒక్కసారి చూసేద్దాం..
శనివారం ఎపిసోడ్ లో ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసిన సుమన్ శెట్టి బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. అందరి లాగే సుమన్ శెట్టితో కూడా శివాజీ సెటైర్ల వర్షం కురిపించారు. కమిడియన్ కాబట్టి ఇంకాస్త ఎక్కువగా శివాజీ ఆడుకున్నాడని చెప్పాలి.. తాజాగా బిగ్ బాస్ ఈ షో కి సంబంధించిన ప్రోమో ని రిలీజ్ చేశారు. ఆ ప్రోమోను చూస్తే.. సుమన్ అన్నాయ్ అంటూ వెటకారంగా పిలుస్తాడు శివాజీ.. ఆ తర్వాత ఈ షో లో అబద్ధాలు చెప్పను అన్ని నిజాలే చెప్తాను అని శివాజీ ప్రమాణం చేస్తాడు.. ఆ తర్వాతమనలో మన మాటా.. అసలు నువ్వు ఈ హౌస్‌లో ఇన్ని రోజులు ఉంటావని అనుకున్నావా? అని అడిగారు శివాజీ. లేదన్నా.. అంటూ నిఖార్సైన సమాధానం ఇచ్చాడు సుమన్ శెట్టి. నువ్వే కాదు.. మేం కూడా అనుకోలేదు అని పంచ్ వేశారు శివాజీ.. మేము నీ నుంచి కామెడీ ఎక్స్పెక్ట్ చేసాం కానీ నువ్వు అక్కడికి పోయిన తర్వాత ఏదో చేశావు. కానీ ఇన్ని రోజులు ఉండడం నిజంగానే గ్రేట్ అంటూ సుమన్ శెట్టిపై శివాజీ సెటైర్లు వేశాడు.
Also Read : మహా పెళ్లి ఫిక్స్.. పెళ్లి పనులు మొదలెట్టిన ప్రతాప్.. చక్రీతో గొడవ..?
అది కాదన్నాయి నేను ఒకటి అడుగుతాను చెప్తావా అని శివాజీ అంటాడు.. నువ్వు ఎందుకు నీ జుట్టు తీసుకెళ్లి బర్నీర్ చేతిలో పెట్టావు అని అడుగుతాడు. నువ్వు చాలా పెద్ద తప్పు చేశావ్ సుమన్ నువ్వూ.. ఎవరూ చేయకూడని తప్పు చేశావ్.. ఎందుకు చేశావ్ అలా..? ఆలోచించవా? ఏమీ? ఇంటి దగ్గర కూడా అలాగే చేస్తావా? కొంచెం కూడా నీకు ఏమి అనిపించలేదా అని సుమన్ శెట్టిని శివాజీ గెలకడం మొదలుపెడతాడు. నేను అంత పెద్ద తప్పు ఏం చేస్తున్నావ్ ముందు చెప్పండి అని సుమన్ శెట్టి సీరియస్ అవుతాడు. శివాజీ అంత గుచ్చి గుచ్చి అడుగున్నాడంటే.. అది ఖచ్చితంగా సుమన్ శెట్టి ఫన్ కోసం చేసింది అయ్యి ఉంటుంది.. కానీ ఏ మాటక ఆ మాట చెప్పుకోవాలి అన్న నువ్వు ఒక మాట అన్నావ్ సంజన పేరు వినగానే నీ మొహం లో కోపం మొదలవుతుంది. ఆమె వస్తుంటే రంగులు మార్చే ఊసరవెల్లి వస్తుంది అని అన్నావు అది ఎంత పెద్ద మాటో తెలుసా అని శివాజీ అంటాడు. చూస్తుంటే వీళ్ళిద్దరి మధ్య కాసేపు ఫన్, మరి కాసేపు ఫ్రస్టేషన్ మొదలు ఎలా కనిపిస్తుంది. ప్రోమో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఎపిసోడ్లో శివాజీ సుమన్ శెట్టిని ఎలాంటి ప్రశ్నలు అడుగుతాడో చూడాలి.