E-Paper
Advertisement

Tirumala News: తిరుమల వైకుంఠ ద్వార దర్శనం, ఈ-డిప్ ద్వారా టోకెన్లు, భక్తుల ఫోన్లకు మెసేజ్‌లు

Tirumala News: తిరుమల వైకుంఠ ద్వార దర్శనం, ఈ-డిప్ ద్వారా టోకెన్లు, భక్తుల ఫోన్లకు మెసేజ్‌లు
Advertisement

Tirumala News: భక్తులకు పుణ్యక్షేత్రం తిరుమల. నార్మల్‌గా స్వామి దర్శనాలకు భక్తులు ఎగబడతారు. అలాంటిది వైకుంఠ ద్వార దర్శనం అంటే చెప్పనక్కర్లేదు. ఆ రోజు స్వామిని దర్శించుకుంటే చేసిన పాపాలు కొంతైనా తొలగతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అందుకే  వైకుంఠ ఏకాదశి రోజు స్వామిని దర్శించుకునేందుకు భక్తుల ఎగబడతారు.

తిరుమల వైకుంఠ ద్వార దర్శనానికి వేగంగా ఏర్పాట్లు

Advertisement

తాజాగా తిరుమల వైకుంఠ ద్వార దర్శనాలకు భక్తులకు ఈ-డిప్‌ ద్వారా టోకెన్లు కేటాయించింది తిరుమల తిరుపతి దేవస్థానం. వైకుంఠ ఏకాదశి మొదటి మూడు రోజులకు ఈ-డిప్‌ ద్వారా 1.76 లక్షల టోకెన్లను జారీ చేసింది. ఈ విషయాన్ని టీటీడీ స్వయంగా వెల్లడించింది.

తిరుమలలో స్వామి వైకుంఠ ద్వారా దర్శనానికి తొలి మూడు రోజులు టోకెన్ల కోసం 24,05,237 మంది భక్తులు రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు. ఈ-డిప్ ద్వారా కేవలం 1.76 లక్షల టోకెన్లు జారీ చేసింది టీటీడీ. డిసెంబర్ 30న అంటే వైకుంఠ ఏకాదశి రోజు 8,71,340 భక్తులు రిజిస్ట్రేషన్ రాగా.. ఈ-డిప్ ద్వారా 57 వేల మంది భక్తులకు టోకెన్లు కేటాయించింది.

Advertisement

ఈ-డిప్ ద్వారా టోకెన్లు జారీ, భక్తుల ఫోన్లకు మెసేజ్‌లు

డిసెంబర్ 31న అంటే ద్వాదశి రోజు 8,52,404 భక్తులు రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు. వారికి ఈ-డిప్ ద్వారా 64 వేల మంది భక్తులకు టోకెన్లు జారీ చేసింది. ఇక జనవరి 1న 8,48,367 మంది భక్తులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వారిలో కేవలం 55 వేల మందికి టోకెన్లు కేటాయించింది.

వైకుంఠ ద్వార దర్శనాల్లో తొలి మూడు రోజులు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం, శ్రీవాణి దర్శనాలు రద్దు చేసింది టీటీడీ. ఈ రోజుల్లో ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా అన్నిరకాల సిఫార్సు దర్శనాలు రద్దు చేసింది. వైకుంఠ ఏకాదశి రోజు కేవలం 70 వేల మందికి దర్శనాల కోసం ఏర్పాట్లు చేసింది. ఆ లెక్కన గంటకు 4300 మందికి దర్శనం చేసేలా ఏర్పాట్లు చేస్తోంది.

ALSO READ:  సీఎం చంద్రబాబుకు షాక్.. ఆ ఎమ్మెల్యే గుడ్ బై

డిసెంబర్ 30న వైకుంఠ ఏకాదశి రోజు 20 గంటల దర్శన సమయంలో 4.45 గంటలు వీఐపీలకు, 15.15 గంటలు సామాన్య భక్తులకు సమయం కేటాయించింది. డిసెంబర్ 31 రోజు 19 గంటల దర్శన సమయంలో 2.15 గంటలు వీఐపీలకు, 16.45 గంటలు సామాన్య భక్తులకు కేటాయించింది.

జనవరి 1 న 68 వేల మందికి దర్శన ఏర్పాట్లు చేసింది టీటీడీ. అందులో 17.30 గంటల సమయంలో కేవలం 2.15 గంటలు వీఐపీలకు, 15.15 గంటలు సామాన్య భక్తులు దర్శనం చేసుకోనున్నారు. టికెట్ల కేటాయింపుతో పాటు దర్శనానికి వెళ్ళే మార్గం కూడా గూగుల్ మ్యాప్‌ను భక్తులకు పంపనుంది టీటీడీ.

Related News

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

Big Stories

Advertisement
×