E-Paper
Advertisement

Intinti Ramayanam Today Episode: అవనికి అడ్డంగా దొరికిన పల్లవి.. మర్డర్ చేసినట్లు తేల్చేసిన పోలీసులు.. పల్లవి దొరుకుతుందా..?

Intinti Ramayanam Today Episode: అవనికి అడ్డంగా దొరికిన పల్లవి.. మర్డర్ చేసినట్లు తేల్చేసిన పోలీసులు.. పల్లవి దొరుకుతుందా..?
Advertisement

Intinti Ramayanam Today Episode February 4th: నిన్నటి ఎపిసోడ్ లో.. అవనిని అభి పోలీస్ స్టేషన్ కి తీసుకొని వస్తాడు. అభినవ్ చూసిన పల్లవి టెన్షన్ పడిపోతూ ఉంటుంది.. రాజేంద్రప్రసాద్ గారు పైనుంచి కింద పడ్డారని మీరు అనుకున్న కూడా ఆయన ఎలా పడ్డారు ఎందుకు పడ్డారు అన్నది నేను తెలుసుకుంటానని అభి అనడంతో పల్లవి షాక్ అవుతుంది.. అభి కి పల్లవి పై అనుమానం వస్తుంది. అని అడిగి తెలుసుకుంటాడు. ఆ తర్వాత అభి పల్లవి ఎంత చెప్తున్నారు సరే వినడు.. పదిమంది చెప్పినంత మాత్రాన అబద్ధం నిజం కాదు నిజం అబద్ధం కాదు అదేంటో నేను తెలుసుకుంటాను అని అభి అంటాడు. అభి అవనీని తీసుకొని మళ్లీ హాస్పిటల్ కి వస్తాడు..

అవనినే ఇదంతా చేసింది అని మీరు నమ్ముతున్నారా అయితే ఎవరు చెప్పారు మీరు చూశారా నేను ఎంక్వయిరీ చేస్తున్న కదా ఏం జరిగిందో అని అంటారు. నేను అనడం లేదు ఇంట్లో వాళ్ళు అదే అంటున్నారు. మావయ్య గారి ఫ్రెండ్స్ కూడా రాత్రంతా ఇక్కడే ఉన్నారు వాళ్లు కూడా ఇదే చెప్తున్నారు అని పల్లవి అంటుంది.. అసలేం జరిగిందో ఎవరిది తప్పుందో నేను తేల్చుకుంటాను అని అవి అంటాడు.. అవని తీసుకొని మనం స్పాట్ కి వెళ్దామని అంటాడు.. ఎవరో మర్డర్ చేసినట్లు అనిపిస్తుంది అని అభి అనుమాన పడతాడు.. అదే విషయాన్ని అభి ఇంట్లోని వాళ్ళతో చెప్తాడు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది..

Advertisement

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. ఇది సూసైడ్ కాదు ఎవరో మర్డర్ చేసినట్లు అనిపిస్తుంది అని అభి అంటాడు.. రిపోర్టులు వస్తేగానీ అసలు విషయం బయటపడదు. ఇప్పటికైతే మాకు మర్డర్ జరిగిందని అర్థమవుతుంది అని పోలీసులు అంటారు.. ఇక ఇక్కడ చాలామంది ఉండకూడదు కదా మీరందరూ ఇంటికి వెళ్ళండి నేను ఉంటాను అని అక్షయ్ అంటాడు.. పార్వతీ ప్రణతి మేం కూడా ఉంటాము అని అనగానే.. మిగిలిన వాళ్ళందరూ ఇంటికి వెళ్తారు.. అయితే ఇంటికి వెళ్ళిన తర్వాత ఇదంతా చేసింది అవనిని అని అందరూ దారుణంగా అవనిని అవమానిస్తారు.. పల్లవి మాత్రం రాజేంద్ర ప్రసాద్ ని ఎలాగైనా సరే చంపేయాలి అని అనుకుంటుంది..

పల్లవి తన ప్లాన్ ప్రకారం ఒక నర్స్ గెటప్ లో హాస్పిటల్ కి వస్తుంది. అక్కడ రాజేంద్రప్రసాద్ ను చంపేయాలని అనుకుంటుంది.. అయితే అందరూ నిద్రపోవడం చూసి ఇదే కరెక్ట్ టైం అని పల్లవి లోపలికి వెళ్లి రాజేంద్రప్రసాద్ కి ఆక్సిజన్ మాస్క్ తీసి ఇంజక్షన్ ఇవ్వబోతుంది.. అప్పుడే అక్కడికి వచ్చిన అవని ఎవరు నువ్వు అని అడుగుతుంది.. నేను డ్యూటీ నర్స్ అని పల్లవి చెప్తుంది.. అయితే అక్కడ పల్లవి అవనికి అడ్డంగా దొరికిపోతానని అనుకుంటుంది. ఏదో ఒకటి చెప్పి నర్స్ అని అవనిని నమ్మిస్తుంది. ఇంజక్షన్ చేసి ఆ తర్వాత మాస్క్ పెట్టడం మర్చిపోతోంది అవని మాస్కు ముందు పెట్టండి నేను పోలీసులకు ఈ విషయాన్ని చెప్పాలి అని అంటుంది..

Advertisement

పల్లవి మాస్క్ పెట్టి అక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోతుంది. ఇక తర్వాత చక్రధర్ కు ఈ విషయం చెప్పాలని పల్లవి ఫోన్ చేస్తుంది.. నువ్వు ఆ రాజేంద్ర ని చంపేసి అక్కడ నుంచి నీ చేతులకు మట్టి అంటుకోకుండా సైడ్ అయిపోవాలి అని సలహా ఇస్తాడు. ఇక అభి అక్షయ్ అవని పిలుస్తారు. ఏంట్రా ఇంత సడన్ గా రమ్మని పిలిచారు అని అడుగుతారు.. మీ నాన్నగారిది సూసైడ్ కాదు మర్డర్ అటెంప్ట్ అని చెప్పగానే అక్షయ్ అవనీ ఇద్దరు ఒక్కసారిగా షాక్ అయిపోతారు.. అప్పుడు అభి ఏం జరిగింది అన్నది వివరిస్తాడు. నాన్నగారిని చంపాలని అనుకునే వాళ్ళు ఎవరూ లేరు కానీ ఇప్పుడు ఇలా జరగడంతో ఎవరు చేశారని మాకు కంగారుగా ఉంది అని అక్షయ్ అంటాడు.

ఇక తర్వాత అవని కూడా మామయ్య గారిని చంపేంత ఎవరికి ఉంటుంది అని అనుకుంటుంది. ఈ విషయాన్ని ఎలాగైనా సరే ఇంట్లో వాళ్లకి చెప్పాలని అనుకుంటారు. అసలేం జరిగింది అన్న విషయాన్ని నేను మరోసారి మీ ఫామ్ హౌస్ కి వెళ్లి తెలుసుకుంటాను అని అభి అంటాడు.. పార్వతి ఇంటికి రావడం చూసి ఇంట్లోనే వాళ్ళందరూ ఏమైందని అడుగుతారు. ఏం కాలేదు అత్తయ్య అక్షయ్ ప్రణతి ఉన్నారు కదా వాళ్ళు సరిగ్గా భోజనం చేయడం లేదు. బయట ఫుడ్డు వాళ్ళకి పడలేదు అందుకే ఏదో ఒకటి చేసుకొని తీసుకుని వెళ్దామని అనుకున్నాను అని పార్వతి అంటుంది. అది సరేగాని రాజేంద్ర పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది అని భానుమతి అడుగుతుంది. ఇప్పుడు అలానే ఉంది అత్తయ్య ఏం అర్థం కావడం లేదు ఏం జరుగుతుందో అని పార్వతి కన్నీళ్లు పెట్టుకుంటుంది.

Also Read :సుగుణమ్మను కలిసిన బాలు.. రోహిణికి షాక్.. మీనా కాపురంలో రోహిణి చిచ్చు..

ఇక అప్పుడే అక్షయ అవని ఇంటికి రావడంతో ఏంట్రా నువ్వు హాస్పిటల్ లో ఉండకుండా ఇంటికి వచ్చావు అని అడుగుతుంది. పోలీసులు రమ్మని పిలిచారు అందుకే నేను పోలీస్ స్టేషన్ కి వెళ్లాల్సి వచ్చింది అని అక్షయ్ అంటాడు. ఆ తర్వాత పోలీసులు ఎందుకు రమ్మన్నారు అని పార్వతి అడుగుతుంది.. నాన్నది సూసైడ్ కాదంటమ్మా ఎవరో చంపాలని ప్లాన్ చేశారంట అని చెప్పగానే పల్లవి షాక్ అవుతుంది.. ఏంటి మావయ్య గాని ఎవరో చంపాలి అనుకున్నారా అని పల్లవి సీన్లు ఎంట్రీ అక్కడితో ఎపిసోడ్ అయిపోతుంది. రేపటి ఎపిసోడ్లో అవనికి పల్లవి పై అనుమానం వచ్చినట్లు తెలుస్తుంది ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి…

Related News

Podarillu Mahalakshmi : ‘పొదరిల్లు’ సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. మహా అవుట్…

Gundeninda GudiGantalu Today episode: అయ్యో పాపం మీనా.. ప్రభావతి ఫుల్ హ్యాపీ.. బాలుకు అనుమానం..

Nindu Noorella Saavasam Serial Today Episode July 20th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: హోమం చూసి భయపడిన ప్రచండ – కోపంతో రగిలిపోయిన మనోహరి  

Podarillu Today Episode : చక్రికీ మైండ్ బ్లాక్.. భయంకరమైన నిజాన్ని తెలుసుకున్న మహా.. శైలు ఎంట్రీ..

Karthika Deepam 2 Serial Today Episode July 20th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పోటీలో గెలిపించిన దీప – ఎమోషనల్ అయిన శివనారాయణ   

Illu Illalu Pillalu Today Episodes: దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చిన భద్ర.. ధీరజ్ కు అనుమానం.. వల్లి ప్లాన్ ఇదా..?

Intinti Ramayanam Today Episode: అవనికి అక్షయ్ షాక్.. పల్లవికి అక్షయ్ వార్నింగ్… పల్లవి రచ్చ రచ్చ..

Brahmamudi Serial Today Episode July 20th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఇందు ధర్నా సక్సెస్‌ – అత్తారింటికి బయలుదేరిన రాజు  

Big Stories

Advertisement
×