E-Paper
Advertisement

Intinti Ramayanam Today Episode : అక్షయ్, పార్వతిలను కలిపిన కమల్.. శ్రీకర్ కు ఘోర అవమానం..

Intinti Ramayanam Today Episode : అక్షయ్, పార్వతిలను కలిపిన కమల్.. శ్రీకర్ కు ఘోర అవమానం..
Advertisement

Intinti Ramayanam Today Episode January 19th : నిన్నటి ఎపిసోడ్ లో.. పల్లవి తన పంతాన్ని నెగ్గిచ్చుకుంది. అక్షయ్ పల్లవి తో పాటు చక్రధర్ కూడా సారీ చెప్పాడు.. అక్షయ్ సారీ చెప్పి లోపలికి రావడంతో అవని అక్షయ్ ని ఎందుకు సారీ చెప్పారని అడుగుతుంది. తల్లి ఫీల్ అవుతుందని సారీ చెప్పారు మరి భార్య అంటే మీకు లెక్క లేదా భార్యకి ఇచ్చే గౌరవం ఇదేనా అని అవని అడుగుతుంది. నేను కేవలం అమ్మ మీద ఉన్న ప్రేమతోనే మనసు చంపుకొని పల్లవికి వాళ్ళ నాన్నకి క్షమాపణలు చెప్పాను. నేను తల్లిగా గుర్తించట్లేదని బాధపడుతుంది మా అమ్మ బాధపడుతుంది. ఇప్పటికే నేను తన కొడుకును కాదని ఆమె ఫీల్ అవుతుంది ఇప్పుడు ఇలా చేయడంతో మళ్లీ ఇంకా బాధ పడుతుందని నేను మనసు చంపుకొని క్షమాపణలు చెప్పానని నువ్వు అర్థం చేసుకుంటే మన మధ్య గొడవలు రావని అక్షయ్ అంటాడు.. పల్లవిని కమల్ దారుణంగా అరుస్తాడు.. కానీ పార్వతికి అవని పై ఇంకాస్త కోపం వచ్చేలా చేస్తుంది. అవని వల్లే అక్షయ్ ఇలా మారారు అని నమ్మేస్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.

ఇక ప్రోమో విషయానికొస్తే.. పల్లవి అవనిపై పార్వతికి లేని పోనివి చెబుతుంది. ఇదంతా నా తప్పే నన్ను క్షమించండి అంటుంది.. నీ తప్పేమి లేదమ్మా నువ్వు అన్నది నిజమే కదా అని అంటుంది. పల్లవిని గుడ్డిగా నమ్మేస్తుంది. ఇక పల్లవి ప్లాన్ వర్కౌట్ అయ్యిందని సంబర పడిపోతుంది. అత్తయ్య నా ప్లాన్ లో ఇరుక్కుందని అనుకుంటుంది. అవని అత్తయ్య అలా మాట్లాడటం పై బాధను వ్యక్తం చేసింది. కోడలి కోసమే ఇదంతా జరుగుతుందని పార్వతి తెలుసుకోలేక పోతుంది. అవని మొత్తం చేసిందని మనసులో కోపాన్ని పెంచుకుంటుంది. ఇక కమల్ ఇంట్లో జరుగుతున్న వాటిని చూసి బాధపడతాడు. అందరు ఇలా చేస్తున్నారని ఆలోచిస్తూ ఉంటాడు. అన్నయ్యకు అమ్మ మీరు ఎంత ప్రేమ ఉందో చూసాం అమ్మకు అన్నయ్య మీద ఎంత ప్రేమ ఉందో అన్నయ్య బర్త్డే రోజే అందరికీ తెలిసిపోయింది. ఇప్పుడు వీరిద్దరూ ఎవరికి వారే అన్నట్టు ఉంటే అందరూ ఇద్దరిని చూసి బాధపడుతున్నారని కమల్ ఏదో ఒకటి చేయాలని ప్లాన్ చేస్తాడు..

Advertisement

పార్వతిని భోజనానికి రమ్మని కమల్ బలవంతంగా తీసుకొచ్చి డైనింగ్ హాల్ దగ్గర కూర్చో పెడతాడు. నాకు ఆకలిగా లేదురా నాకు తినాలనిపించట్లేదు అని అంటున్న కూడా డైనింగ్ టేబుల్ కుర్చీపై కూర్చో పెడతాడు. ఇక కమల్ అక్షయ్ ని భోజనానికి రమ్మని బలవంతంగా తీసుకుని వస్తాడు. ఇక అందరూ భోజనానికి వస్తారు. పార్వతి, అక్షయ్ లు ఒకరినొకరు చూసుకొని బాధపడతారు. ఇక మీరిద్దరూ ఒకరికొకరు తినిపించుకోవాలని కమలంటాడు.. తన తల్లి ప్రేమ కోసం వెంపర్లాడతాడు. పార్వతి మాత్రం అవనీని చూసి అక్షయకి ముద్ద పెట్టలేక పోతుంది.. మొత్తానికి అక్షయ్ పార్వతిలు కలిసిపోయినట్టు అనిపిస్తుంది.

ఇక తర్వాత రోజు ఉదయం శ్రీకర్ ఇంట్లో బాధపడుతూ ఉంటాడు. ఇంట్లో పరిస్థితులు ఏం బాగాలేవు శ్రియ. ఆస్తి గురించి అడగడం అందరినీ షాక్ కి గురిచేస్తుంది. మళ్లీ పల్లవి వాళ్ళ నాన్నకు ఆమెకు సారీ చెప్పించుకోవడమే పెద్ద విచిత్రంగా ఉంది అని శ్రీకర్ అనుకుంటాడు. అది విన్న శ్రియ పల్లవికి ఏమైంది అసలు కొంచెం కూడా మనిషిలాగ ఆలోచించట్లేదు కదా అని అంటాడు.. బావగారు చేత సారీ చెప్పించుకోవడమేంటి అని శ్రియ బాధపడుతుంది. ఇదంతా పల్లవి కావాలని చేసిందని నాకు అనిపిస్తుంది శ్రీకర్ ఇక్కడే ఉండి మామయ్యకి ఏమవుతుందో అని బాధపడని కంటే ఒకసారి మనం ఆ ఇంటికి వెళ్లి అడిగి పరామర్శించడం మేలు మనము అక్కడే ఉండడానికి వెళ్లలేదు కదా మళ్లీ తిరిగి వద్దాం వాళ్లు రమ్మన్నప్పుడే మనం వద్దామని శ్రీ అంటుంది. శ్రీయ, శ్రీకర్ లు ఉదయం రాజేంద్రప్రసాద్ ఇంటికి వెళ్తారు. అక్కడ శ్రీకర్ ను చూసి ఇంట్లో వాళ్ళందరూ షాక్ అవుతారు. ఇక రాజేంద్రప్రసాద్ మీరు ఎందుకు వచ్చారు అని అడుగుతారు. అసలు నువ్వు ఇంట్లోకి ఎందుకు వచ్చావురా అని రాజేంద్రప్రసాద్ అడుగుతాడు నువ్వు ముందు ఇంట్లోంచి బయటికి వెళ్ళరా మా బాగోగులు మేము చూసుకుంటాంలే అని నెట్టేస్తాడు. కింద పడిపోతాడు

Advertisement

పార్వతి రాజేంద్రప్రసాదుల మధ్య గొడవ పెరుగుతుంది. శ్రీకర్ ఈ ఇంట్లోనే ఉంటాడు ఈ ఇంట్లోనే తిందువుతాడు ఇంట్లోనే తనకు అన్ని హక్కులు ఉన్నాయని పార్వతి అంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. సోమవారం ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి.

Related News

బిగ్ బాస్ 10కి ఎంపికైన తొలి కామనర్.. కన్నీళ్లు పెట్టుకున్న నవదీప్.. వీడియో వైరల్!

గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ జంట.. మరో బిడ్డకు ఆహ్వానం!

మాధురి రాథోడ్ తల్లిపై ఈశ్వర్ సాయి భార్య ఊహించని కామెంట్స్!

Nindu Noorella Saavasam Serial Today Episode September 5th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండను తిట్టిన మనోహరి  

Gundeninda Gudigantalu : సీరియల్ లవర్స్ కు షాక్.. రోహిణి ఇక కనిపించదా..?

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి దిమ్మతిరిగే షాక్.. శృతి దెబ్బ అదుర్స్.. రోహిణి మాస్టర్ ప్లాన్ ..?

Illu Illalu Pillalu Today Episodes: విశ్వం ప్లాన్ సక్సెస్.. ధీరజ్ కోసం ప్రేమ కన్నీళ్లు.. అడ్డంగా బుక్కయిన ధీరజ్..

Ninnu kori Serial Today Episode September 5th ‘నిన్ను కోరి’ సీరియల్‌: డాక్టర్ ను బెదిరించి నిజం తెలుసుకున్న విరాట్  

Big Stories

Advertisement
×