BigTV English
Advertisement

Thati kallu: తాటికల్లు ఆరోగ్యానికి మంచిదేనా? దానికి ఎందుకంత డిమాండ్?

Thati kallu: తాటికల్లు ఆరోగ్యానికి మంచిదేనా? దానికి ఎందుకంత డిమాండ్?

ఎంతోమందికి తాటికల్లు అంటే ప్రాణం. గ్రామీణ ప్రాంతాల్లోనే తాటికల్లు అధికంగా దొరుకుతుంది. నగరాల్లో దొరకడం చాలా కష్టం. అందుకే తాటికల్లు కావాలనుకుంటే చుట్టుపక్కల గ్రామాలకు వెళ్లి మరీ తాగి వచ్చేవారు ఉన్నారు. తాటికల్లు ఆరోగ్యానికి మంచిదని దాన్ని ఆల్కహాల్ గా భావించకూడదని కూడా చెబుతారు. తెలంగాణలోని దావత్ లలో కచ్చితంగా కల్లు ఉండాల్సిందే. కోటీశ్వరులైనా, పేదవారైనా కల్లు తాగడం ఆనవాయితీగా ఉండేది.


పిల్లల నుంచి మహిళల వరకు కల్లును తాగే సంప్రదాయం కొన్ని జాతుల్లో ఉంది. హైదరాబాదులో కూడా కల్లు దుకాణాలు ఉన్నాయి. కల్లు ఎన్నో రకాలు ఉంటుంది. ఈతకల్లు, తాటికల్లు, కొబ్బరి కల్లు, ఖర్జూరం కల్లు… ఇలా ఎన్నో కల్లు రకాలు. అయితే ఎక్కువ మందికి తాటికల్లే ఇష్టం. ఇది ఆరోగ్యానికి మంచిదని కూడా నమ్ముతారు. తెల్లని పాలలాగా ఉండే ఈ తాటి కల్లు కోసం వందల కిలోమీటర్ల ప్రయాణించే వారు కూడా ఉన్నారు.

తాటికల్లును కూడా ఆల్కహాల్ అనుకుంటారు. ఎంతోమంది అయితే తాటికల్లు ఆరోగ్యానికి ఎంతో మంచిదని చెబుతారు. దీనిలో విటమిన్లు, ఖనిజాలు అధికంగా ఉంటాయి. కాబట్టి దీన్ని తాగడం వల్ల ఆరోగ్యానికి మేలు చేస్తుంది. పూర్వీకులు తాటి చెట్టునే కల్పవృక్షంగా అనేవారు. కల్లు ద్వారా ఎన్నో ఆరోగ్య సమస్యలు తగ్గుతాయని నమ్మేవారు. తాటికల్లులో విటమిన్ సి, ఐరన్, ప్రోటీన్లు, విటమిన్ బి వంటి పోషకాలు ఉంటాయని… వీటిని తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుందని చెప్పుకుంటారు. అంతేకాదు తాటికల్లు శరీర వేడిని కూడా తగ్గిస్తుందని అంటారు. అందుకే వేసవికాలంలో కచ్చితంగా తాటికల్లును తాగుతూ ఉంటారు. ఇది శరీరాన్ని తేమవంతం చేసే దాహాన్ని తీరుస్తుందని నమ్ముతారు.


తాటికల్లును ఔషధంగా తీసుకునే వారి సంఖ్య కూడా అధికంగానే ఉంది. దీన్ని హెల్త్ టానిక్ గా చెప్పుకుంటారు. ఎన్నో పరిశోధనలు కూడా తాటికల్లు ఆరోగ్యానికి మేలే చేస్తుందని తేలింది. అయితే అధికంగా తాగితే మాత్రం ఆరోగ్యానికి ఇబ్బందులు వస్తాయి. కొందరికి పడక వాంతులు కావచ్చు. తల తిరిగినట్టు అనిపించవచ్చు. కాబట్టి వీలైనంతవరకు ఎంత తక్కువగా తాగితే అంత మంచిది. అప్పుడే చెట్టు నుంచి తీసిన తాటికల్లు తాగడం ఆరోగ్యానికి మంచిది.

అందులో ఉన్న కొన్ని సూక్ష్మజీవులు క్యాన్సర్ కణాలను కూడా చంపుతాయని నమ్ముతారు. ఆయుర్వేదంలో కూడా తాటికల్లు గురించి ప్రస్తావన ఉంది. డయేరియా, టైఫాయిడ్ వంటి వైరస్‌లను అడ్డుకునే శక్తి తాటికల్లుకు ఉందని అంటారు. తాటికల్లు మంచి యాంటీ బయోటిక్ గా పనిచేస్తుందని చెబుతూ ఉంటారు. మసాలా ఆహారాలు, జంక్ ఫుడ్స్ వంటి వాటికి బదులు తాటి కల్లే మంచిది. పొట్ట సమస్యలతో ఇబ్బంది పడేవారు అప్పుడప్పుడు తాటికల్లు తాగడం ద్వారా పొట్టను క్లీన్ చేసుకోవచ్చని వివరిస్తారు.

కళ్ళలో ఆల్కహాల్ కంటెంట్ ఉంటుంది. అందుకే కల్లు తాగడం వల్ల కాస్త మత్తు ఎక్కినట్టు అవుతుంది. అధికంగా తాగితే తూగి పడిపోతారు. పొట్ట భరించలేక వాంతులు కూడా చేసుకుంటారు. కాబట్టి తాటికల్లును ఎంత తక్కువగా తాగితే అంత ఆరోగ్యకరం.

Also Read: చికెన్ కర్రీ, వేపుళ్లలో నిమ్మకాయ పిండుకుని మరీ తింటున్నారా? జరిగేది ఇదే!

Related News

White Bread: బ్రెడ్ తింటున్నారా ? తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలివే !

Diabetic Patients: షుగర్ పేషెంట్లు.. క్యారెట్ తింటే జరిగేది ఇదే !

Idli Chaat: ఇడ్లీ మిగిలిపోయిందా? ఇలా ఇడ్లీ చాట్ చేసేయండి, క్రంచీగా అదిరిపోతుంది

Katte Pongali: నోటిలో పెడితే కరిగిపోయేలా కట్టె పొంగలి ఇలా చేసేయండి, ఇష్టంగా తింటారు

Kind India: కొత్త ఆన్లైన్ ప్లాట్‌ఫారమ్ తో కైండ్ ఇండియా.. ముఖ్య ఉద్దేశం ఏమిటంటే?

Darkness Around The Lips: పెదాల చుట్టూ నలుపు తగ్గాలంటే.. ఈ టిప్స్ ఫాలో అవ్వండి చాలు !

Moringa Powder: బరువు తగ్గడానికి.. మునగాకు పొడిని ఎలా వాడాలో తెలుసా ?

Arthritis Pain: కీళ్ల నొప్పులా ? వీటితో క్షణాల్లోనే.. పెయిన్ రిలీఫ్

Big Stories

×