E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today January 21st: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ముసుగులో ఉన్న మిస్సమ్మను చూసిన అమర్  

Nindu Noorella Saavasam Serial Today January 21st: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ముసుగులో ఉన్న మిస్సమ్మను చూసిన అమర్  
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode:  

  మిస్సమ్మ ముసుగు వేసుకుని కరుణను తీసుకుని అమర్ ఇంటికి వెళ్తుంది. స్కూటీ మీద వెళ్లిన ఇద్దరూ గేటు దగ్గరే నిలబడతారు. దీంతో కరుణ ఆశ్చర్యంగా ఇదేంటి పోరి ఇక్కడికి తీసుకొచ్చావు అని అడుగుతుంది. నన్ను ఈ ఇంటికి దూరం చేయడానికి మనోహరి కుట్ర చేసిందని నువ్వు అన్నావు కదా..? అది ఎంత వరకు నిజం అనేది తెలుసుకోవాలి అని చెప్తుంది మిస్సమ్మ. దీంతో కరుణ వారెవ్వా మస్త్‌ ధైర్యం చేసినవే.. ఇప్పుడు నువ్వు నాకు నచ్చినవ్‌ నువ్వు ఎప్పుడూ ఇట్లనే ఉషారుగా ఉండాలే అని చెప్తుంది కరుణ. నువ్వు వెంటనే ఇంట్లోకి వెళ్లి మనోహరితో మాటలు కలిపి తన కుట్ర గురించి కూపీ లాగు అని మిస్సమ్మ చెప్పగానే.. అదేంది నాతో నువ్వు కూడా లోపలికి రా ఆ మనోమరి దుమ్ము దులుపుదాం అని కరుణ చెప్పగానే.. నేను లోపలికి వస్తే ఆ మనోహరి నోరు విప్పదు. దాని మనసులో ఏముందో తెలుసుకోవాలంటే నేను బయట ఉండాలి కరుణ అని చెప్పగానే..

ఇది కూడా మంచిదే సరే నేను లోపలికి వెళ్లి వస్తాను నువ్వు గీన్నే భద్రంగా ఉండు అని చెప్పి కరుణ వెళ్తుంటే.. మిస్సమ్మ కరుణకు వీడియో కాల్ చేస్తుంది. అబ్బా ఈ టైంలో ఎవరు ఫోన్‌ చేస్తున్నారబ్బా అని ఇరిటేటింగ్‌గా బ్యాగ్‌లోంచి ఫోన్‌ తీసుకుంటుంటే మిస్సమ్మ వీడియో కాల్ చేశాను. నేను లోపల జరిగేదంతా లైవ్‌లో చూస్తాను అని చెప్తుంది. దీంతో కరుణ ఓ పిల్లా నీ మెదడు మస్త్‌ పని చేస్తుందిలే.. ఇదే ఊపు మీద ఉండు.. ఆ మనోహరిని బొందలగడ్డలో పాతిపెడదాం.. అని చెప్పగానే.. సరే నువ్వు జాగ్రత్తగా వెళ్లు.. మనోహరికి ఏమాత్రం డౌటు రాకుండా మానేజ్‌ చేయ్‌ తనతో కాస్త జాగ్రత్త తను ఆవలిస్తే పేగులు లెక్కపెడుతుంది అని మిస్సమ్మ  చెప్పగానే.. అది ఆవలిస్తే పేగులు లెక్కపెట్టుడు కాదు. నేనైతే ఆవలిస్తే పేగులు బయటకు తీస్తా.. నా గురించి నువ్వు ఫికర్‌ చేయకు పోయి వస్తా అంటూ కరుణ లోపలికి వెళ్తుంది. మరోవైపు అమర్‌, రాథోడ్‌ ఇంటికి వస్తుంటారు.

Advertisement

కరుణ వీడియో కాల్‌లో మిస్సమ్మ అంతా చూస్తూ.. ఎమోషనల్‌ అవుతుంది. పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటుంది. ఇంట్లోకి వెళ్లిన కరుణ వీడియో కాల్‌లో ఇల్లంతా చూపిస్తుంటే అప్పుడే చంభా వచ్చి కరుణను చూసి ఏయ్‌ ఎవరు నువ్వు సరాసరి ఇంట్లోకి వచ్చావు అని అడుగుతుంది. దీంతో కరుణ నేను యాదమ్మ నన్ను గుర్తు పట్టలేదా..? అని అడుగుతుంది. దీంతో చంబా కోపంగా నువ్వు అంటే ఎవరు..? ఎందుకు వచ్చావు..? అంటూ కోప్పడుతుంది. వీడియో కాల్‌ లో చంబా మాటలు వింటున్న మిస్సమ్మ మాత్రం ఎప్పుడూ సాప్ట్‌గా మాట్లాడే యాదమ్మ ఇంత రాష్‌గా మాట్లాడుతుందేంటి..? అనుకుంటుంది. లోపల కరుణ నేను కరుణను భాగీ కోసం వచ్చిన అని చెప్పగానే.. ఆవిడ గారు ఈ ఇంట్లోంచి వెళ్లిపోయి ఐదు సంవత్సరాలు అయింది. ఆవిడకే ఈ ఇంట్లో దిక్కు లేదు మళ్లీ తన కోసం నువ్వు వచ్చావా..? అనగానే.. మిస్సమ్మ బాధగా యాదమ్మ నా మీద కొంచెం కూడా రెస్పెక్ట్‌ లేకుండా మాట్లాడుతుంది ఏమైంది తనకు అనుకుంటుంది. లోపల చంభా ఇంతకీ నువ్వు ఎవరో చెప్పు ఈ ఇల్లేదే నీ సొంత ఇల్లు అయినట్టు వచ్చేశావు.. అంటూ తిడుతుంటే..

అప్పుడే మనోహరి వస్తుంది. యాదమ్మ తన పేరు కరుణ భాగీ బెస్ట్‌ ఫ్రెండ్‌ హాయ్‌ కరుణ.. నేను అరుంధతికి ఎంతో భాగీకి కరుణ అంత.. అరుందతి వల్ల నాకు ఈ ఇంట్లో ఎలాంటి రైట్స్‌ ఉన్నాయో.. భాగీ వల్ల ఈ కరుణకు అవే రైట్స్‌ ఉన్నాయి. అంటూ మనోహరి చెప్తుంటే.. కరుణ  నేను మీ అంత గొప్పదాన్ని కాదులేండి.. మీరు ఇప్పుడు ఈ ఇంటికి ఓనరు అయ్యుండ్రు అనగానే.. మనోహరి ఇంకా నేను ఓనరు కాలేదు కరుణ మీ ఫ్రెండ్‌ వెల్లినప్పటి నుంచి  అమరేంద్రను పిల్లలను ఈ ఇంటిని ఒక కేర్‌ టేకర్‌ లాగా చూసుకుంటుంన్నాను అని చెప్పానే.. కరుణ మాత్రం బయట అందరూ ఈ ఇంట్లో హావా మొత్తం నీదే అంటున్నారు అంటుంది. ఇంతలో చంభా ఇంతకీ నువ్వు ఎందుకు వచ్చావో చెప్పు అని అడుగుతుంది. ఇంకెందుకు వస్తుంది. బాగీ కోసం వచ్చి ఉంటుంది. భాగీ ఎక్కడుంది..? ఎలా ఉంది..? ఎప్పుడు తిరిగి వస్తుందని అడగడానికి వచ్చి ఉంటుంది. అంతే కదా కరుణ అని మనోహరి చెప్పగానే.. ఆవిడ గారు ఈ ఇంట్లోంచి ఎందుకు వెళ్లిపోయిందో తెలియదు.. ఎక్కడుందో… ఎప్పుడొస్తుందో..? మాకెలా తెలుస్తుంది అనగానే.. కరుణ నేను ఆ విషయం అడగడానికి రాలేదు నేను భాగీని చూసినా అని చెప్తుంది. కరుణ మాటలకు మనోహరి, చంభా షాక్‌ అవుతారు.

Advertisement

మరోవైపు బయట అమర్‌ ఇంటికి వస్తుంటాడు.. కారులో వస్తున్న అమర్‌ను చూసి మిస్సమ్మ ముసుగు వేసుకుంటుంది. లోపలికి వెళ్లి కారు దిగిన అమర్‌ బయటకు వచ్చి మిస్సమ్మను పలకరిస్తాడు. ఇంతలో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

సీరియల్స్‌లో మాత్రమే జరిగే వింతలు ఇవి .. నిజ జీవితంలో ఇలా జరిగితే?

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ వీరే.. దశావతారం వర్కౌట్ అవుతుందా?

కృష్ణాష్టమి స్పెషల్.. ‘రాధా’గా మారిన అనసూయ.. వీడియో వైరల్!

అవినాష్, అరియానా మధ్య గొడవలు నిజమేనా? బయటపెట్టిన శ్రీముఖి!

Nindu Noorella Saavasam Serial Today Episode September 4th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆత్మ కోసం ప్రచండ ప్రత్యేక పూజ  

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Big Stories

Advertisement
×