E-Paper
Advertisement

Intinti Ramayanam Today Episode: మీనాక్షికి ఘోర అవమానం.. పల్లవికి దిమ్మతిరిగే షాక్..శ్రీయలో ఇంత మార్పేంటి..?

Intinti Ramayanam Today Episode: మీనాక్షికి ఘోర అవమానం.. పల్లవికి దిమ్మతిరిగే షాక్..శ్రీయలో ఇంత మార్పేంటి..?
Advertisement

Intinti Ramayanam Today Episode july 6th:అవినీ నువ్వు భోజనం చేయలేదు కదా అందుకోసమే నీకోసం భోజనం తీసుకుని వచ్చాను అని అక్షయ్ అంటాడు.. పల్లవి భోజనం చేయలేదని మీ అమ్మ కూడా భోజనం చేయలేదు . ఇక నువ్వు కూడా మీ అమ్మ తినలేదని భోజనం చేయలేదు కదా.. అందుకే నీకోసం భోజనం తీసుకుని వచ్చాను అని అనగానే.. అవని నాకోసం మీరు భోజనం తీసుకుని వచ్చారా? ఎందుకు నేను వచ్చేదాని కదా అని అంటుంది. నువ్వు అసలే సర్జరీ జరిగిన మనిషివి కచ్చితంగా టైం కి భోజనం తీసుకుని టాబ్లెట్స్ వేసుకోవలి అని అక్షయ్ అంటాడు. నన్ను మీరు తిడతారని అనుకున్నాను కానీ ఇలా సపోర్ట్ చేస్తారని అస్సలు ఊహించలేదండి అని అవని కన్నీళ్లు పెట్టుకుంటుంది..

అక్షయ్ గొప్ప మనసుకు ఫిదా..

నిజానికి నువ్వు ఎవరికి కష్టం వచ్చినా కూడా తట్టుకోలేవు. నిన్ను పెళ్లి చేసుకునే ముందు ఎలాంటి అమ్మాయి కావాలని అనుకున్నాను అలాగే ఉన్నావు. నా స్వార్థం అని చూసుకోకుండా నువ్వు అందరికీ ఎప్పుడు తోడుగా ఉంటావు. నా వాళ్ళని నీ ప్రపంచంగా బతుకుతున్నావు కాబట్టి. నువ్వు దేనికైనా సిద్ధమవుతున్నావు అని అక్షయ్ అవని పై ప్రశంసలు కురిపిస్తాడు.. నన్ను మీరు తిడతారు అనుకోని నేను చాలా భయపడ్డాను. నా పర్మిషన్ లేకుండా నువ్వు ఎలా సర్జరీ చేయించుకుంటావు అని అంటారని అనుకున్నాను. కానీ మీరు ఇలా అనడం నాకు చాలా సంతోషంగా ఉంది అని అవని ఎమోషనల్ అయిపోతుంది.. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది అని అవని అనుకుంటుంది.. మీకు చెప్పకుండా నేను సర్జరీ చేయించుకున్న అందుకు నన్ను క్షమించండి అని అవని అంటే దానికి అక్షయ్ ఇంకొకసారి నన్ను క్షమించండి అని మాత్రం ఎప్పుడూ అడగద్దు అని అంటాడు. మాట విన్న అవని కన్నీళ్లు పెట్టుకుంటుంది.

మీనాక్షిని అవమానించిన పల్లవి..

Advertisement

పల్లవి బయట పడుకుని దోమలు కొట్టుకుంటూ ఉండగా భానుమతి అక్కడికి వస్తుంది. ఏంటి ఇక్కడ పడుకున్నావ్ నా మనవడిని వలలో వేసుకొని పిల్లలు కనమని చెప్తే.. నువ్వు ఇక్కడ దోమలతో కాపురం చేస్తున్నావా అని భానుమతి తిడుతుంది. నేనేమీ కావాలని ఇక్కడ పడుకోలేదు నీ మనవడే నేను చూస్తుంటే నాకు చిరాగ్గా ఉంది అని బయటకు తోసేసి లోపల తలుపు పెట్టుకున్నాడు అని అంటుంది. ఆడది తలుచుకుంటే ఎలాంటి మగాడినైనా లొంగ తీసుకుంటుంది. నువ్వు మాత్రం నీ మొగుడితో కాపురం చేయలేకున్నావు అని భానుమతి తిట్టేసి వెళ్ళిపోతుంది.. అక్కడికి వచ్చిన మీనాక్షి పల్లవిని నా గదిలో పడుకో అమ్మ అని అంటుంది. నువ్విలా మంచిగా మాట్లాడితే నీ మీద నాకు కోపం తగ్గిపోతుంది అని అనుకుంటున్నావా..? నేను ఎంత చీకొట్టినా నువ్వు మాత్రం నా దగ్గరికి వస్తూనే ఉంటావా అని పల్లవి అడుగుతుంది. నువ్వు వెళ్లి నీ గదిలోనే పడుకో అని అనగానే మీనాక్షి బాధపడుతుంది. కన్నతల్లి కాబట్టి పల్లవి మాటని పట్టించుకోకుండా తనకోసం దోమలకి కాయలు పెట్టి వెళ్తుంది.

పల్లవికి ఘోర అవమానం..

ఉదయం లేవగానే అవని బాబును తీసుకొని బయట ఎండలో కూర్చుంటుంది.. బాబుకి ఇలా ఎండలో కూర్చోబెడితే చాలా మంచిది అని శ్రేయ కి చెప్తుంది.. అవని అక్క చాలా మంచిది నీ రుణం ఎలా తీర్చుకోవాలి అని అంటుంది.. ఇక బాబుతో మీ పెద్దమ్మ లాగే నువ్వు కూడా ఉండాలి అని అంటుంది. పార్వతి వాళ్ళిద్దరికీ టీ తీసుకొని వచ్చి ఇస్తుంది. అన్ని పనులు అవనినే చేస్తున్నప్పుడు నేను కొన్ని నా చేయాలి కదా అని పార్వతి అవని పై పొగడ్తలు వర్షం కురిపిస్తుంది. ఇక వీళ్ళందరిని చూసి కుళ్లుకున్న పల్లవి అక్కడికి వస్తుంది. ఫోన్ చార్జర్ కనిపించలేదు ఎవరు తీసుకున్నారు అని అడుగుతుంది. మాకు తెలీదు అని పార్వతి అంటున్న సరే అందరిని పిలుస్తుంది పల్లవి. కానీ పల్లవి మాటని ఏ ఒక్కరు కూడా పట్టించుకోరు. పల్లవి నా గురించి ఎవరు పట్టించుకోవడం లేదు అని కోపంగా లోపలికి వెళ్తుంది. ఇక లోపల మళ్లీ భానుమతి క్లాస్ పీకుతుంది..

ఆస్తులు వచ్చేశాయి..

Advertisement

అందరూ బయటకు వెళ్లాలని అనుకుంటారు అప్పుడే లాయర్ లోపలికి రావడంతో లాయర్ గారు మీకోసమే మేము వస్తున్నాము అని అక్షయ్ అంటాడు.. లాయర్ వచ్చి మీకు పిల్లలు పుట్టారు కదా ఇవాల్టితో మీ ఆస్తి మీకు వచ్చేసింది అని చెప్పగానే అందరూ చాలా సంతోషంగా ఉంటారు. మీరు ఇక మీ ఇంటికి వెళ్లొచ్చు మీ ఆస్తులని మీరు అనుభవించవచ్చు అని చెప్పగానే అందరూ నవ్వుకుంటారు. అయితే పల్లవికి మాత్రం పిల్లలు పుట్టలేదు కాబట్టి ఫీలవుతూ ఉంటుంది. ఇక ఆస్తులు వచ్చాయని అక్షయ్ వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. పల్లవి కూడా మారిపోతే బాగుంటుంది అని అవని అంటుంది. మొత్తానికి ఆస్తులు మళ్లీ తిరిగి వచ్చాయని కుటుంబం మొత్తం సంతోషంగా ఉంటారు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. నీతూ అవుట్..

Related News

Karthika Deepam 2 Serial Today Episode July 6th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌:  అందరి ముందు ఇంట్లోనే సూరజ్ ను కొట్టిన శివనారాయణ   

Illu Illalu Pillalu Today Episodes: నర్మద చూపులకు ప్రేమ షాక్.. వల్లి కడుపు అబద్దం.. ఇదే కదా ట్విస్ట్..

Brahmamudi Serial Today Episode July 6th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రాజుకు ఫోన్ చేసి ఇంటికి వచ్చేయమన్న అపర్ణ  

Gundeninda Gudigantalu Neethu : సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. నీతూ అవుట్..

Monday Movies in Tv : సోమవారం టీవీల్లోకి రాబోతున్న సినిమాలు.. ఆ నాలుగు మస్ట్ వాచ్..

Telugu TV Serials: ఈ వారం సీరియల్స్ టీఆర్పీ రేటింగ్..’ఇల్లు ఇల్లాలు పిల్లలు’ సీరియల్ కు శుభం కార్డు..?

ఓ ఇంటి వాడైన ఎక్స్ప్రెస్ హరి.. ఇటుకలతో కట్టిన ఇల్లు కాదంటూ!

Big Stories

Advertisement
×