E-Paper
Advertisement

టెహ్రాన్‌లో అలీ ఖమేనీ అంత్యక్రియలు.. ముగ్గురు కొడుకులు హాజరు, ఇరాన్ సుప్రీం మొజ్తబా ఎక్కడ?

టెహ్రాన్‌లో అలీ ఖమేనీ అంత్యక్రియలు..  ముగ్గురు కొడుకులు హాజరు, ఇరాన్ సుప్రీం మొజ్తబా ఎక్కడ?
Advertisement

Tehran: ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో అయితుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలు ఘనంగా జరిగాయి. ఆయన అంత్యక్రియల్లో లక్షలాది మంది ఇరానీయులు పాల్గొని కన్నీటి వీడ్కోలు పలికారు. ఖమేనీ ముగ్గురు కొడుకులు తొలిసారి బయట ప్రపంచానికి కనిపించారు. ఇరాన్ సుప్రీం మొజ్తబా ఖమేనీ హాజరుకాలేదు. ఇంతకీ అతడు బతికే ఉన్నారా? అనే అనుమానాలు మళ్లీ మొదలయ్యాయి.

టెహ్రాన్‌లో అలీ ఖమేనీ అంత్యక్రియలు: ఇరాన్ సుప్రీం అయతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలు టెహ్రాన్‌లో ఆదివారం జరిగాయి. లక్షలాది మంది ప్రజలు ఆయనకు కన్నీటి వీడ్కోలతో నివాళులర్పించారు. అయితే అలీ అంత్యక్రియల్లో ఖమేనీ ముగ్గురు కొడుకులు తొలిసారి ప్రపంచానికి దర్శనమిచ్చారు. అలీ వారసుడిగా బాధ్యతలు చేపట్టిన మొజ్తబా ఖమేనీ ఎక్కడా కనిపించకపోవడం ప్రపంచవ్యాప్తంగా చర్చ మొదలైంది.

Advertisement

గ్రాండ్ మోసల్లా ప్రాంగణంలో నిర్వహించిన అంత్యక్రియల సందర్భంగా లక్షలాది మంది ఇరానీయులు అలీ ఖమేనీకి కన్నీటి వీడ్కోలు పలికారు. అలీ ఖమేని అంత్యక్రియల్లో ఇరాన్ మీడియా ప్రసారం చేసిన విజువల్స్‌లో ఖమేని ముగ్గురు కొడుకులు ఉన్నారు. వారిలో మోస్తఫా ఖమేనీ, మేయ్‌సమ్ ఖమేనీ, మసూద్ ఖమేనీ తండ్రి శవపేటిక వద్ద ఉండి అంత్యక్రియలకు హాజరయ్యారు.

ఖమేని ముగ్గురు కొడుకులు హాజరు: ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్, పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాఘర్ ఘాలిబాఫ్, ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ చీఫ్ అహ్మద్ వహీదితోపాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఇరాన్ విప్లవం-పాలస్తీనా సంఘీభావానికి ప్రతీకగా భావించే కెఫియెహ్ స్కార్ఫ్‌తో కొడుకు కన్నీళ్లు తుడుచుకోవడం వీడియోల్లో స్పష్టంగా కనిపించింది.

Advertisement

ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో అయుతుల్లా అలీ ఖమేనీ మరణించారు. ఆయనతోపాటు కూతురు-అల్లుడు, కోడలు,మనవరాలు మృతిచెందారు. ఆనాటి నుంచి ఇప్పటివరకు సుప్రీం లీడర్‌ మొజ్తబా ఖమేనీ బయటకు రాలేదు. కేవలం యుద్దం సమయంలో ఆయన సందేశాలు మాత్రం ఇరాన్ టెలివిజన్‌ ప్రసారం చేసేది.

తండ్రి అంత్యక్రియల్లో కనిపించని ఇరాన్ సుప్రీం మొజ్తబా:  తండ్రి అంత్యక్రియల్లో మొజ్తబా ఖమేనీ కనిపించకపోవడంతో ఆయన ఆరోగ్య పరిస్థితి, భద్రతపై అనేక ఊహాగానాలు అప్పుడే మొదలయ్యాయి. తండ్రి అంత్యక్రియులకు ఇరాన్ సుప్రీం హాజరయ్యే విషయం తన అధికార పరిధిలో ఎలాంటి సమాచారం లేదని అంత్యక్రియల ప్రణాళికా కమిటీ అధిపతి అలీ అక్బర్ పౌర్‌జమ్‌షిడియన్ గత వారం వెల్లడించారు.

ALSO READ: అయితుల్లా ఖమేనీ భౌతికకాయం.. 125 రోజులు ఎలా ఉంచింది, కెమికల్స్‌పై నిషేధం, ఏయే పద్దతులు వినియోగించింది?

మొజ్తబా హాజరుకు సంబంధించిన ఏ సమాచారమైనా ఆయన కార్యాలయం నుంచి వస్తుందన్నారు. అలీ ఖమేనీని హతమార్చిన వైమానిక దాడిలో మరణించిన భార్య జహ్రా హదాద్-అడెల్ కోసం గతవారం సంస్మరణ సభ జరిగింది. దానికి మొజ్తాబా హాజరు కాలేదు. మొజ్తాబా ఖమేనీ సన్నిహిత వర్గాలు న్యూస్ ఏజెన్సీ రాయిటర్స్‌తో కొన్ని విషయాలు చెప్పాయి.

ఇజ్రాయెల్ నిఘా వర్గాలకు చిక్కకుండా జాగ్రత్తలు: మొజ్తాబా ఖమేనీ కాళ్లు డ్యామేజ్ కావడం, ముఖం వికృతంగా మారినట్టు చెప్పుకొచ్చారు. అలీ ఖమేనీ కొడుకు మోస్తఫాను వివాహం చేసుకున్న సోదరి.. జూన్‌లో ఇరాన్ వార్తా సంస్థ అన్సాఫ్ తో మాట్లాడారు. కొత్త సుప్రీం తన గొంతును వినిపించేంత వరకు ఏ విధంగానూ తనను తాను బయటపెట్టుకోవద్దని భద్రతా నిపుణులు సలహా ఇచ్చారని తెలిపారు.

అలీ ఖమేని అంత్యక్రియల ప్రణాళిక గురించి తెలిసిన ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్‌కు చెందిన ఇద్దరు సభ్యుల వెర్షన్ మరోలా ఉంది. మొజ్తాబాను హత్య చేయడానికి, ఆచూకీని గుర్తించడానికి ఇజ్రాయెల్ నిఘా వర్గాలు ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో బహిరంగ కార్యక్రమాలకు హాజరుకావద్దని ఆయనకు భద్రతా బృందం సలహా ఇచ్చిందని ది న్యూయార్క్ టైమ్స్ నివేదిక పేర్కొంది.

Related News

భారీ రాళ్లను అంత ఎత్తుకు ఎలా తీసుకెళ్లారో తెలిస్తే దిమ్మతిరుగుద్ది.. పిరమిడ్ల నిర్మాణ సీక్రెట్ ఇదే!

కుప్పకూలిన బంగారు గని, 100 మందికి పైగా మృతి! ఇంతకీ ఎక్కడో తెలుసా?

ఆపరేషన్ బార్బరోస్సా.. హిట్లర్ చేసిన ఆ ఒక్క పొరపాటే రెండో ప్రపంచ యుద్ధ ఫలితాన్ని మార్చేసిందా?

హర్మూజ్‌లో ఇరాన్‌కు మైండ్ బ్లాంక్ సీన్.. 80% నౌకలు అటే.. అసలు ఒమన్ ప్లాన్ ఏంటి?

ఉత్తర కెన్యాలో కూలిన హెలికాప్టర్.. ఏడుగురు మృతి!

మత్స్యకారుడిపై ఆక్టోపస్ దాడి.. ముఖాన్ని చుట్టేసి చిత్రవధ.. వీడియో వైరల్!

ఇమ్రాన్ ఖాన్‌కు బిగ్ రిలీఫ్.. జైలు నుంచి ఆస్పత్రికి.. పాక్ సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు!

భారత ఎన్నికల వ్యవస్థ అమోఘం.. అమెరికా చూసి నేర్చుకోవాలి.. ట్రంప్ ప్రశంసల వర్షం!

Big Stories

Advertisement
×