E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episodes: నర్మద చూపులకు ప్రేమ షాక్.. వల్లి కడుపు అబద్దం.. ఇదే కదా ట్విస్ట్..

Illu Illalu Pillalu Today Episodes: నర్మద చూపులకు ప్రేమ షాక్.. వల్లి కడుపు అబద్దం.. ఇదే కదా ట్విస్ట్..
Advertisement

Illu Illalu Pillalu Today Episode july 6th: నా మేనకోడలు చాలా అదృష్టవంతురాలు. ఒక చీర కొంటేనే కారు వచ్చేసింది అని వేదవతి పొగడ్తల వర్షం కురిపిస్తుంది. అయినా మీ మామయ్య అస్తవాసి చాలా మంచిది. ఆయన చేతులతో డబ్బులు ఇస్తే ఖచ్చితంగా ఏదైనా మంచి జరుగుతుంది అని వేదవతి రామరాజుని పొగిడిస్తూ ఉంటుంది. ఒకసారి నాకు చీర కొనుక్కోమని 50,000 ఇస్తే దానికి ఫ్రీ గా మీ మామయ్య గారికి చొక్కా కూడా వచ్చింది నిజంగా ఆరోజు నేను చాలా సంతోషపడ్డాను అని వేదవతి అంటుంది. 50వేల చేరుకుంటే 500 షర్ట్ వచ్చిందని తిరుపతి అనగానే వేదవతి కాస్త కోపంగా మారుతుంది. నువ్వు నా మేనకోడలు వే నువ్వేం చేసినా నీ భర్తకి కలిసి వచ్చేలా చేస్తావు. కొందరు ఉన్నారు భర్తని అప్పులపాలు చేశారు అని నర్మదనే తిడుతూ అంటుంది వేదవతి. తన మాటలు విన్నా నర్మదా బాధపడుతుంది..

ప్రేమ పై నర్మద సీరియస్..

ప్రేమ అలా చేసింది అని నర్మదా పక్కకు తీసుకొని వెళ్లి చాలా కోపంగా చూస్తూ ఉంటుంది. ఏంటక్కా ఆలోచిస్తున్నావు నామీద కోపం ఉంటే కొట్టు లేదా నన్ను ఏదైనా తిట్టు అంతేగాని నువ్వు అలా చూస్తూ ఉంటే నాకు చాలా భయంగా ఉంది అక్క అని ప్రేమ భయపడుతుంది. ఆల్రెడీ నా మొగుడు నన్ను తిట్టాడు కొట్టాడు. ఇప్పుడు నువ్వు మళ్ళీ నన్ను కొట్టాలని అనుకోవద్దు అక్క. నేను అసలు అలసిపోయాను. నాకు కాలికి కూడా డాన్స్ వేసి గాయమైంది అని ప్రేమ రిక్వెస్ట్ చేస్తుంది.. ప్రేమ భయపడుతూ ఉండగా ఒక్కసారిగా నర్మదా నవ్వుతుంది.. నువ్వు చేసింది మంచి పనే ధీరజ్ కోసం నువ్వు పెద్ద రిస్కే చేశావు.. కానీ ఇంకొకసారి ఎవరికీ చెప్పకుండా ఇలాంటి రిస్కులు చెయ్యొద్దు అని నర్మద వార్నింగ్ ఇస్తుంది.. కానీ నువ్వు ఆ వల్లి విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి అని ప్రేమతో నర్మదా అంటుంది..

వల్లి కడుపు అబద్దం..

Advertisement

అవునక్కా ఆ వల్లి కడుపు గురించి ఏదో కనుక్కుంటాను అని అన్నావు కదా… మరి వల్లి యొక్క కడుపు గురించి నువ్వు తెలుసుకున్నావా లేదా అని ప్రేమ అడుగుతుంది. ఆ వల్లి కడుపు నిజంగానే అబద్ధం. ఆ డాక్టరు నిజం చెప్పడానికి మన ఇంటికి రమ్మంటే భయపడుతుంది తన హాస్పిటల్ పేరు తన పేరు ఎక్కడ బయట పడుతుందని కంగారుపడుతుంది.. ఇప్పుడు మనం కలుపుకోవాల్సింది ఆ ఫేక్ డాక్టర్ అయినా మెరుపుతీగ గురించి అని నర్మదా అంటుంది. మరి ఆ డాక్టర్ ని పట్టుకోవడం ఎలా కానీ ముగ్గురు ఆలోచించి అదిరిపోయే ప్లాన్ చేస్తారు. శ్రీవల్లికి ఇదే చివరి రోజు అయిపోతుందని అర్థమవుతుంది..

సుకన్యకు వాంతులు..

ప్రేమ వేదవతి వల్లికి జ్యూస్ ఇస్తుండగా అక్కడికి వచ్చి నాకు కూడా జ్యూస్ ఇస్తావా అత్తా అని అడుగుతుంది.. అది మాటే నీకెందుకు జ్యూస్ ఇవ్వనేని వేదవతి జ్యూస్ క్లాస్ ఇస్తుంది.. ఆ జ్యూస్ లో నర్మదా వాంటింగ్స్ అయ్యేందుకు ఏదో మందు కలుపుతుంది.. సుకన్య దగ్గరికి వెళ్లి చాలా ప్రేమగా నువ్వు వల్లి అక్క కోసం చాలా చేశావు నీకోసం నేను ఈ మాత్రం కూడా చేయలేనా అని నమ్మించి జ్యూస్ తాగేలా చేస్తుంది. ఆ జ్యూస్ తాగిన వెంటనే సుకన్యకు ఒకటే వాంతులు అవుతాయి.. సుకన్యక వాంతులు అవుతున్నాయి అని నర్మదా అందరిని పిలుస్తుంది. అయితే సుకన్య ఎందుకు వాంతులు చేసుకుంటుంది అని వాళ్ళు ఆలోచిస్తుండగానే ధీరజ్ డాక్టర్ కి ఫోన్ చేసి రమ్మని పిలుస్తాడు. వాళ్లు ఫోన్ చేసిన పిలిచిన డాక్టర్ మరెవరో కాదు వల్లికి అబార్షన్ చేసిన మెరుపుతీగ.. ఆ డాక్టర్ని చూస్తానే సుకన్య ఒక్కసారిగా షాక్ అవుతుంది..

వల్లి తల్లికాలేదు.. నిజం కక్కేసిన సుక్కు..

Advertisement

మెరుపుతీగ డాక్టర్ ని చూసి శ్రీవల్లి అలాగే సుకన్య ఒక్కసారిగా షాక్ అవుతారు. ఏంటి నిన్ను ఎవరు పిలిచారు. అసలు నువ్వు ఇక్కడ వీళ్ళకి ఎలా తగిలావు అని సుకన్య అడుగుతుంది.. ఒకసారి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్లి మెరుపుతీగ ఎలా జరిగారో మొత్తం చెప్తుంది.. అయితే సుకన్య ప్రెగ్నెంట్ అని చెప్పగానే ఒక్కసారిగా షాక్ అవుతుంది.. అసలు ఇది డాక్టరే కాదు నేను ప్రెగ్నెంట్ ఏంటి అని నిజం మొత్తాన్ని కక్కేస్తుంది.. వల్లి కడుపుతో లేదన్న విషయాన్ని సుకన్య అందరికీ కళ్ళకు కట్టినట్లు చెబుతుంది. ఆ మాట వినగానే వల్లితో పాటుగా మిగిలిన వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు.

వేదవతి వల్లికి వార్నింగ్..

ఏంటి మళ్లీ కడుపుతో లేదా..? అసలు ఏమైంది నిజంగానే వల్లి కడుపుతో లేదా ఏంటి ఇదంతా అని వేదవతి అడుగుతుంది.. వల్లి నీ ఇంట్లోకి తీసుకొచ్చేందుకు వాళ్ళ అమ్మ వాళ్ళు ఆడిన నాటకం అని చెప్పగానే అందరూ ఒక్కసారి ఇలా షాక్ అవుతారు.. వల్లి ఇది ఏదైనా వాగుతుంది అదేం పట్టించుకోకండి అని ఎంత చెప్తున్నా సరే వేదవతి మాత్రం చంప పగలగొడుతుంది.. నువ్వు ఎలాంటి దానివో తెలిసి కూడా నేను ఇంట్లోకి రానిచ్చాను. నా కూతురిని ఆ ఇంటికి బలవంతంగా పంపించిన కూడా ఒక ఆడపిల్ల జీవితం పాడవ్వకూడదు అని నేను ఇంట్లోకి రాణిస్తే ఇప్పుడు ఇంత మోసం చేస్తావా నువ్వు అసలు మనిషివేనా అని వేదవతి తిడుతుంది. అయితే నీ వల్ల ఆయన చాలా సంతోషంగా ఉన్నారు ఇప్పుడు ఇది నిజం తెలిస్తే ఆయన గుండె బద్దలై పోతుంది అని వేదవతి సీరియస్ గా వార్నింగ్ ఇస్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :Intinti Ramayanam Today Episode: మీనాక్షికి ఘోర అవమానం.. పల్లవికి దిమ్మతిరిగే షాక్..శ్రీయలో ఇంత మార్పేంటి..?

 

Related News

బిగ్ బాస్ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించిన సీజన్ 10!

స్టేజ్ పై అషూ రెడ్డితో గొడవ పెట్టుకున్న మరో బిగ్ బాస్ కంటెస్టెంట్?

పరారీలో ప్రముఖ యూట్యూబర్.. నగదుతో పాటు బంగారం చోరీ!

Gundeninda GudiGantalu Today episode: బాలుకు అనుమానం.. పిల్లాడిలా మారిన మనోజ్.. బాలు రచ్చ రచ్చ..

Podarillu Today Episode : కేశవ కోరిక తీరుతుందా? మహా, విక్కీ మధ్య దివ్య..మహాకు గుడ్ న్యూస్..

Nindu Noorella Saavasam Serial Today Episode October 8th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి, పార్థును చంపేసిన నిజం సీతారాం అందరికీ చెప్తాడా..?  

Illu Illalu Pillalu Today Episodes: రామరాజుకు మైండ్ బ్లాక్.. వేదవతి మాటతో షాక్..శ్రీవల్లి అవుట్..

Intinti Ramayanam Today Episode: అయ్యో పార్వతి.. కమల్ పై రివేంజ్.. పల్లవికి వాతలు..

Big Stories

Advertisement
×