E-Paper
Advertisement

Jagadatri Raga Madhuri: నన్ను కొట్టడానికి ఇంటికే వచ్చారు.. ఆ తప్పే నాకు శాపంగా మారింది..

Jagadatri Raga Madhuri: నన్ను కొట్టడానికి ఇంటికే వచ్చారు.. ఆ తప్పే నాకు శాపంగా మారింది..
Advertisement

Jagadatri Raga Madhuri: సీరియల్స్లలో పాజిటివ్ క్యారెక్టర్లు చేయడం చాలా ఈజీ. అయితే ఏ హీరోయిన్లు మాత్రం ఎప్పుడూ పాజిటివ్ గానే ఉంటారు. వాళ్లని ఏడిపించే పాత్రల్లో విలన్లు ఉంటారు. సినిమాలో  మగవాళ్ళు విలన్లు అయితే, సీరియల్స్లలో మాత్రం ఆడవాళ్లు విలన్ గా ఉంటూ ఎత్తుకు పైఎత్తులేస్తూ హీరోయిన్ ని ఏడిపిస్తూ ఉంటారు. అది సీరియల్ లో వాళ్ళు నటిస్తున్న రోల్ మాత్రమే.. కానీ కొంతమంది సీరియల్ అభిమానులు నిజంగానే వాళ్ళని ఏడిపిస్తున్నారని అనుకుంటారు.. సీరియల్ ని నిజమే అనుకొని నమ్మిన కొందరు బయట ఎక్కడ విలన్ క్యారెక్టర్ లో నటిస్తున్న వాళ్ళు కనిపిస్తే తిడుతూనే ఉంటారు.. ఇక్కడ వరకు ఓకే కానీ కొట్టడానికి ఇంటికి వెళ్లడం అంటే మామూలు విషయం కాదు.. జగదాత్రి సీరియల్ లో నటించిన యాక్టర్ రాగమాధురికి ఆ చేదు అనుభవం ఎదురయింది. ఆ సీరియల్ లో హీరోయిన్ ని ఏడిపిస్తుందని కొందరు ఆమెను కొట్టడానికి వెళ్లినట్లు తాజాగా ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టింది. అసలు ఎందుకు ఆమెను కొట్టాలనుకున్నారు? ఆమె ఏమని సమాధానం చెప్పిందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం..

కొడతారని భయంతో ఇంట్లోనే ఉండిపోయాను.. 

బుల్లితెర నటి రాగ మాధురి గతంలో ఎన్నో సీరియల్స్లలో నటించి ప్రేక్షకుల మనసులో జరగని ముద్ర వేసుకుంది. అయితే అప్పుడు పాజిటివ్ క్యారెక్టర్ లో నటించిన ఈమె ఇప్పుడు తల్లి పాత్రలోనూ.. నెగిటివ్ క్యారెక్టర్లలో నటిస్తూ వస్తుంది. ప్రస్తుతం జీ తెలుగులో ప్రసారమవుతున్న టాప్ రేటింగ్ సీరియల్ జగదాత్రిలో విలన్ పాత్రలో నటిస్తుంది. ఈమె హీరోయిన్ ని అనేక రకాలుగా ఇబ్బంది పెట్టే పాత్రలో నటిస్తుంది.. అయితే సీరియల్ నిజం అనుకొని కొందరు జనాలు ఆమెపై కక్షను పెంచుకుంటున్నారని తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో బయటపెట్టింది.. ఆ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ జగదాత్రి సీరియల్ లో హీరోయిన్ ని ఇబ్బంది పెట్టినందుకు నన్ను కొందరు కొట్టడానికి అడ్రస్ వెతుక్కుని మరీ వచ్చారు అని చెప్పుకొచ్చింది.. ఆ ఇంటర్వ్యూ వీడియో వైరల్ అవ్వడంతో ప్రస్తుతం ఇది ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది..

Advertisement

Also Read :

విలన్ పాత్ర అంటే భయపడుతున్నా..

మొగలిరేకులు వంటి సూపర్ హిట్ సీరియల్ లో నటించిన రాగ మాధురి అందరికి సూపరచితమే.. ఇప్పుడు జీతెలుగులో ప్రసారం అవుతున్న జగదాత్రి సీరియల్ లో విలన్ పాత్రలో నటిస్తుంది. రీసెంట్ గా హీరోయిన్ ను ఏడ్పిస్తుందని ఇంటి మీదకు అభిమానులు వచ్చినట్లు ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టింది. అదే విధంగా సీరియల్స్ కోసం నటీనటులు కష్టాల గురించి బయటపెట్టింది. ఆ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. మాకు ఇచ్చే పేమెంట్లలోనే క్యాస్టూమ్స్ కూడా తీసుకోవాలని ఆమె పేర్కొన్నారు. ఫంక్షన్ సీన్స్ ఉన్న సమయంలో మాత్రమే ఖర్చు తగ్గుతుందని రాగ మాధురి పేర్కొన్నారు. మా దగ్గర ఉన్న చీరలు ఎవరికైనా ఇచ్చేయడమే అని రాగ మాధురి పేర్కొన్నారు. షాపింగ్ కు వెళ్లినప్పుడల్లా దాదాపు 50 వేల వరకు ఖర్చు అవుతుందని ఆమె అంటున్నారు.. అలాగే తెలుగు వాళ్లకు రెమ్యూనరేషన్ తక్కువే అన్నట్లు ఆమె అన్నారు. ప్రస్తుతం ఈ ఇంటర్వ్యూ వీడియో వైరల్ అవుతుంది..

Related News

సీరియల్స్‌లో మాత్రమే జరిగే వింతలు ఇవి .. నిజ జీవితంలో ఇలా జరిగితే?

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ వీరే.. దశావతారం వర్కౌట్ అవుతుందా?

కృష్ణాష్టమి స్పెషల్.. ‘రాధా’గా మారిన అనసూయ.. వీడియో వైరల్!

అవినాష్, అరియానా మధ్య గొడవలు నిజమేనా? బయటపెట్టిన శ్రీముఖి!

Nindu Noorella Saavasam Serial Today Episode September 4th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆత్మ కోసం ప్రచండ ప్రత్యేక పూజ  

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Big Stories

Advertisement
×