E-Paper
Advertisement

Supernatural horror thriller OTT : వెయ్యేళ్ళ చరిత్ర ఉన్న ఊర్లో వరుస హత్యలు… ‘శంబాల’ స్ట్రీమింగ్ షురూ

Supernatural horror thriller OTT : వెయ్యేళ్ళ చరిత్ర ఉన్న ఊర్లో వరుస హత్యలు… ‘శంబాల’ స్ట్రీమింగ్ షురూ
Advertisement

Supernatural horror thriller OTT : ఎట్టకేలకు ఆది సాయికుమార్ నటించిన థ్రిల్లర్‌ మూవీ ‘శంభాల’ ఓటీటీలో ఆడగు పెట్టేసింది. వరుస పరాజయాలను చవిచూసిన ఆది ఇప్పుడు ఈ మిస్టిక్ థ్రిల్లర్ హిట్ తో ఊపరి పీల్చుకున్నట్లయింది. క్రిస్మస్ కానుకగా రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. అంతేకాదు అతని కెరీర్ లోనే రికార్డ్ కలెక్షన్స్ సాధించింది. ఇక ట్రైలర్ విడుదలైనప్పటి నుండి శంభాల చిత్రం భారీ హైప్‌తో విడుదలైంది. ఈ చిత్రం అంచనాలను అందుకుని హిట్‌ టాక్ సొంతం చేసుకుంది. ధండోరా, ఛాంపియన్ వంటి చిత్రాలతో పాటు విడుదలైనప్పటికీ, శంభాల తన స్థానాన్ని నిలబెట్టుకుని క్రిస్మస్ విజేతగా నిలిచింది.

ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ , కలెక్షన్లు ఎంత ?

‘శంభాల’ (Shambala) సినిమా 2025 డిసెంబర్ 25న విడుదలై బాక్సాఫీస్ వద్ద రూ. 25 కోట్లు వసూలు చేసింది. షైనింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై రాజశేఖర్ అన్నమోజు, మహీధర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు యుగంధర్ ముని దర్శకత్వం వహించాడు. ఆది సాయికుమార్, అర్చన అయ్యర్, రవివర్మ, స్వాసిక ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఇప్పుడు జనవరి 22 నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఆ సంస్థ 10 కోట్ల రూపాయలకు ఓటీటీ హక్కులను సొంతం చేసుకోవడంతో నిర్మాతలు లాభాల బాటలోకి వెళ్లారు. ఇక ఓటీటీలో ఈ సినిమా ఎన్ని సంచలనాలు క్రియేట్ చేస్తుందో చూడాలి.

కథాంశం ఏమిటి?

Advertisement

ఈ చిత్రం ఆకాశం నుండి వచ్చే ఒక ఉల్కాపాతంతో మొదలవుతుంది. అందులో ఉండే ఒక దుష్ట ఆత్మ వల్ల ఒక చిన్న గ్రామంలో ఊహించని సంఘటనలు మొదలవుతాయి. వెయ్యేళ్ళ చరిత్ర ఉన్న ఊర్లో వరుస మరణాలు సంభవిస్తుండటంతో, ఆది సాయికుమార్ ఈ రహస్యాన్ని పరిశోధించడానికి గ్రామానికి వస్తాడు. ఇక ఆ దుష్ట ఆత్మ చేతిలో ఒకరి తర్వాత ఒకరు బలవుతుంటారు. అసలు సైన్స్ ని మాత్రమే నమ్మే ఆది ఆ గ్రామాన్ని ఎలా కాపాడుతాడు ? ఆ గ్రామంలో ఆవహించిన దుష్ట శక్తి మర్మం ఏమిటి ? అనే అంశాల చుట్టూ కథ తిరుగుతుంది. ఇక థియేటర్లలో దీన్ని మిస్ అయిన వారు ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమ్ చేయవచ్చు. ఈ సినిమా ఆడియన్స్ కి కావలసినంత థ్రిల్ ను ఇస్తుంది.

Read Also : 22 అవార్డులను గెలుచుకున్న 2 గంటల 20 నిమిషాల యాక్షన్ డ్రామా… ఐఎండీబీలో అదిరిపోయే రేటింగ్

Tags

Related News

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

ఫ్రెండ్ లైఫ్ లోకి అమ్మాయి వచ్చిందనే ద్వేషంతో ఇదేం పని ? నిబ్బా నిబ్బీలు డోంట్ మిస్

Big Stories

Advertisement
×