BigTV English
Advertisement

Today Horoscope in Telugu: నేటి రాశిఫలాలు (08/11/2025) ఆ రాశి వారికి కుటుంబ సభ్యులతో గొడవలు – వారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్త

Today Horoscope in Telugu: నేటి రాశిఫలాలు (08/11/2025) ఆ రాశి వారికి కుటుంబ సభ్యులతో గొడవలు – వారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్త

Today Horoscope:

ప్రముఖ జ్యోతిర్వాస్తు, వేద పండితులు, దేవీ ఉపాసకులు  ‘బ్రహ్మశ్రీ  రామడుగు శ్రీకాంత్‌ ఆచార్య’ గారిచే గ్రహాల సంచారం ప్రకారం అంచనా వేసిన నవంబర్‌ 08వ తేదీ రాశి ఫలితాలను ఇప్పుడు తెలుసుకుందాం. 


మేష రాశి:  

దూర ప్రాంతాల బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సోదరులతో ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. సన్నిహితులతో సఖ్యత కలుగుతుంది. వృత్తి, వ్యాపారాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు.

వృషభ రాశి:

ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. వ్యాపార, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు తప్పవు. చేపట్టిన పనులు ముందుకు సాగవు. దూర ప్రయాణాలు వలన శ్రమాధిక్యత పెరుగుతుంది. బంధువులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. ఆర్థిక విషయాలు నిరుత్సాహ పరుస్తాయి.


మిథున రాశి:  

చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. మొండి బాకీలు వసూలవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి.

కర్కాటక రాశి:

విద్యార్థులకు నిరుత్సాహం తప్పదు. మిత్రులతో అకారణ  వివాదాలు  కలుగుతాయి. చేపట్టిన పనులలో శ్రమ పెరుగుతుంది. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో  అదనపు బాధ్యతలు వలన మానసిక ప్రశాంతత ఉండదు. ఆరోగ్యం మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి.

సింహరాశి:

కుటుంబ వ్యవహారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చూడతారు. బంధువులతో వివాదాల పరిష్కార దిశగా సాగుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో ప్రోత్సాహకర  వాతావరణం ఉంటుంది. సన్నిహితుల నుండి శుభవార్తలు అవుతాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా సాగుతాయి.

కన్యారాశి :

గృహమున చిత్రమైన సంఘటనలు చోటుచేసుకుంటాయి. సమాజంలో ప్రముఖులతో  పరిచయాలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. విలువైన వస్తువులు బహుమతులుగా పొందుతారు.

ALSO READ: ఈ రాశుల్లో జన్మించిన వారు ఎప్పటికైనా కోట్లు సంపాదిస్తారట

 

తులారాశి:

విద్యార్థుల ప్రయత్నాలు  కొంత నిరాశ ఇస్తాయి. చేపట్టిన వ్యవహారాలలో స్వల్ప ఆటంకాలు ఉంటాయి. వృత్తి, వ్యాపారాలలో గందరగోళ  పరిస్థితులు ఉంటాయి. నిరుద్యోగులకు ఒక వార్త ఊరటనిస్తుంది. ఆర్థిక లావాదేవీలు మందగిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో  శ్రమ పెరుగుతుంది.

వృశ్చికరాశి:

ఇంటా బయట  బాధ్యతలు మరింత పెరుగుతాయి. చేపట్టిన పనులలో వ్యయప్రయాసలు అధికమవుతాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో వివాదాలు మానసిక సమస్యలు కలిగిస్తాయి. కుటుంబ వ్యవహారాలలో స్వంత  ఆలోచనలు కలసిరావు.

ధనస్సు రాశి:

వ్యాపార, ఉద్యోగాలలో ఆశించిన పురోగతి కనిపిస్తుంది.  నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. చేపట్టిన  వ్యవహారాలలో విజయం సాధిస్తారు. స్థిరాస్తి క్రయ విక్రయాలలో లాభాలు అందుకుంటారు. కుటుంబ సభ్యులతో శుభకార్యాల్లో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.

మకరరాశి:

సన్నిహితులతో విందువినోద కార్యకమాలలో పాల్గొంటారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగయోగం ఉన్నది. వృత్తి, వ్యాపారాలలో ఆశించిన విధంగా ముందుకు సాగుతాయి. సన్నిహితులతో వివాదాలు తీరతాయి. నూతన భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు.

కుంభరాశి:

కుటుంబ సభ్యులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాలలో చికాకులు పెరుగుతాయి. ఆర్థిక లావాదేవీలు మందకొడిగా సాగుతాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ఉద్యోగ వాతావరణం సమస్యత్మకంగా ఉంటుంది.

మీనరాశి:

ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. చేపట్టిన  పనుల్లో స్వల్ప ఆటంకాలు తప్పవు. ఆర్థిక ఇబ్బందులుంటాయి. వృత్తి, వ్యాపారాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు చికాకు పరుస్తాయి. నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు.

ALSO READ: ఆ రాశి అమ్మాయిలతో జాగ్రత్త – లేదంటే ఇక అంతే

 

Related News

Today Horoscope in Telugu: నేటి రాశిఫలాలు (07/11/2025) ఆ రాశి వారికి  నూతన వాహన యోగం – ఆ రాశి నిరుద్యోగులకు శుభవార్తలు

Today Horoscope in Telugu: నేటి రాశిఫలాలు (06/11/2025) ఆ రాశి ఉద్యోగులకు ప్రమోషన్లు – వారికి ఆకస్మిక ప్రయాణాలు

Today Horoscope in Telugu: నేటి రాశిఫలాలు (05/11/2025) ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారికి వృత్తి వ్యాపారాలలో నష్టాలు 

Today Horoscope in Telugu: నేటి రాశిఫలాలు (04/11/2025) ఆ రాశి ఉద్యోగుల సమస్యలు తీరుతాయి – వారికి ఆర్థికపరమైన నష్టాలు   

Today Horoscope in Telugu: నేటి రాశిఫలాలు (03/11/2025) ఆ రాశి వారికి  ఆకస్మిక ధనలాభం – వారికి నూతన వాహన యోగం

Weekly Horoscope: ఈ వారం రాశి ఫలాలు (నవంబర్‌ 2 – నవంబర్‌ 8)  ఆ రాశి వారికి అదనపు ఆదాయం – వారికి ధనపరమైన ఇబ్బందులు

Today Horoscope in Telugu: నేటి రాశిఫలాలు (02/11/2025) ఆ రాశి ఉద్యోగులకు శుభవార్తలు – వారికి స్తిరాస్థి వివాదాలు పరిష్కారం

Big Stories

×