BigTV English
Advertisement

OTT Movie : IMDb లో 9.7 రేటింగ్… స్కూల్ పుస్తకాల్లో స్కామ్… ఈ తండ్రి గట్స్ కు దండం పెట్టాల్సిందే భయ్యా

OTT Movie : IMDb లో 9.7 రేటింగ్… స్కూల్ పుస్తకాల్లో స్కామ్… ఈ తండ్రి గట్స్ కు దండం పెట్టాల్సిందే భయ్యా

OTT Movie : నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెెక్కిన ఒక హిందీ సినిమా ప్రేక్షకులను ఆలోచింపజేస్తోంది. పాఠ్య పుస్తకాలలో చరిత్రను వక్రీకరించిన విధానంపై నీరజ్ అత్రి అనే ఉపాధ్యాయుడు చేసిన పోరాటంతో ఈ కథ తిరుగుతుంది. అతను ఒంటరిగా ఈ విషయంపై పోరాటం చేసి సఫలం కూడా అయ్యాడు. ఈ సినిమాకి ఐయండిబిలో తొమ్మిదికి పైగా రేటింగ్ ఉందంటే, కంటెంట్ ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఒక ఇన్‌స్పైరింగ్ స్టోరీతో వచ్చిన ఈ సినిమా ఫైటింగ్ స్పిరిట్ ని ఇస్తుంది. ఈ సినిమా పేరు ఏమిటి ? దీని కథ ఏమిటి ? ఓటీటీ ఏమిటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.


ఎందుల స్ట్రీమింగ్ అంటే

“His Story of Itihaas” 2025లో వచ్చిన హిందీ డ్రామా మూవీ. మన్‌ ప్రీత్ సింగ్ ధామి దర్శకత్వంలో ఇది తెరకెక్కింది. ఇందులో సుబోధ్ భవే, యోగేంద్ర తిక్కు, అంకుర్ వికల్, అకాంక్షా పాండే ప్రధాన పాత్రల్లో నటించారు. 144 నిమిషాల రన్‌ టైమ్ తో ఈ సినిమా ఐయండిబిలో 9.7/10 రేటింగ్ ని పొందింది. ఈ సినిమా థియేటర్స్‌లో 2025 మే 30న రిలీజ్ అయింది. జియో హాట్‌ స్టార్ దీని స్ట్రీమింగ్ హక్కులను దక్కించుకుంది. త్వరలోనే ఈ సినిమా హిందీతో పాటు తెలుగు, తమిళం, మలయాళం భాషల్లోనూ స్ట్రీమ్ కానుందని సమాచారం. స్ట్రీమింగ్ అయ్యే తేదీని అధికారికంగా అనౌన్స్ చేయాల్సి ఉంది.

స్టోరీ ఏమిటంటే

చండీగఢ్‌కు చెందిన నమిత్ భరద్వాజ్ అనే ఫిజిక్స్ టీచర్, ఒక రోజు తన కూతురు స్కూల్ హిస్టరీ బుక్ చదివి షాక్ అవుతాడు. అందులో వాస్కో డా గామా ఇండియాని డిస్కవర్ చేశాడు, టిప్పు సుల్తాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫైటర్, అశోకుడు యుద్ధాలకు రిగ్రెట్ ఫీల్ అయ్యాడు వంటి తప్పుడు ఫ్యాక్ట్స్ ఉంటాయి. అంతే కాకుండా మహారాణా ప్రతాప్, రాణి దుర్గావతి, సుభాష్ చంద్ర బోస్, శివాజీ వంటి హిందూ హీరోస్‌ని ఇగ్నోర్ చేసి ఉంటారు. మొఘల్స్‌ని కీర్తిస్తూ రచనలు చేసి ఉంటారు. చరిత్ర పాఠ్యపుస్తకాలలో వక్రీకరించబడిన, తప్పుగా చూపబడిన చారిత్రక వాస్తవాలను గుర్తించిన అతను కలత చెందుతాడు. నమిత్ దీన్ని క్వశ్చన్ చేసి, సమాచార హక్కు చట్టం RTI ని ఉపయోగిస్తాడు. ఎడ్యుకేషన్ బోర్డ్‌కి లెటర్స్ రాస్తాడు.


Read Also : కేరళ స్టేట్ అవార్డ్స్ లో దుమ్మురేపిన ‘ఫెమినిచి ఫాతిమా’… ఓటీటీలో రిలీజ్ ఎప్పుడో తెలుసా?

తరతరాలుగా భారతీయులకు పాఠశాలల్లో బోధించిన తప్పుడు చరిత్రను ప్రశ్నించడానికి, వ్యవస్థకు వ్యతిరేకంగా ఒంటరిగా నిలబడతాడు. కానీ అధికారులు, పాలిటిషియన్స్, అకడమిక్స్ అడ్డంకులు పెడతారు. అతడ్ని ట్రోల్ చేస్తారు. నమిత్ కోర్టు కేసులు, పబ్లిక్ డిబేట్స్, సోషల్ మీడియా ఫైట్‌తో సిస్టమ్‌ని ఛాలెంజ్ చేస్తాడు. నమిత్ రిసెర్చ్ చేసి బుక్ “Brainwashed Republic” రాస్తాడు. ఫైనల్‌లో అతడి ఫైట్ సక్సెస్ అవుతుంది. హిస్టరీ బుక్స్ మారాలని పబ్లిక్ కూడా గుర్తిస్తుంది. ఈ సినిమా సివిలైజేషనల్ ఐడెంటిటీ కోసం ఫైట్ చేయమని ఇన్‌స్పైర్ చేస్తుంది.

 

Related News

OTT Movie : ఒంటిపై నూలు పోగు లేకుండా భగభగ మండే మంటల్లోకి పరుగు… ఇదెక్కడి దిక్కుమాలిన పని సామీ

OTT Movie : మిస్టీరియస్ మనిషితో ముసలావిడ రొమాన్స్… ఇలాంటి సినిమాను ఎక్కడా చూసుండరు భయ్యా

OTT Movie : భర్తకు బాయ్ ఫ్రెండ్ తో అడ్డంగా దొరికిపోయే భార్య… ఐఎండీబీలో రేటింగ్ 8… క్రైమ్ మూవీ లవర్స్ కు పండగే

OTT Movie : బ్రోతల్ హౌస్ నుంచి తప్పించుకుని 17 ఏళ్ల అమ్మాయితో ఆ పాడు పనులు… ఈ మూవీ స్ట్రిక్ట్లీ సింగిల్స్ కు మాత్రమే

OTT Movie : స్కూల్ పాప డ్రెస్సుకు బటన్స్ పెట్టే మాస్టార్… డోర్ వేస్తానని చెప్పి ఆమె చేసే పనికి ఫ్యూజులు అవుట్

OTT Movie : అడవిలో వేలాడే తల లేని శవం… తవ్వుతున్న కొద్దీ బయటపడే నేరాల చిట్టా… కేక పెట్టించే క్రైమ్ థ్రిల్లర్

OTT Movie : 16 ఏళ్ల అబ్బాయికి అతీంద్రీయ శక్తులు… దయ్యాల ఆవాసంగా మారే అపార్ట్మెంట్… కల్లోనూ వెంటాడే హర్రర్ మూవీ

Big Stories

×