E-Paper
Advertisement

Small Screen: 25 ఏళ్ల బంధానికి స్వస్తి.. డివోర్స్ కి కారణాలు చెప్పిన బుల్లితెర జంట!

Small Screen: 25 ఏళ్ల బంధానికి స్వస్తి.. డివోర్స్ కి కారణాలు చెప్పిన బుల్లితెర జంట!
Advertisement

Small Screen:ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారో ..ఎప్పుడు విడిపోతారో చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. కొంతమంది పెళ్లయిన ఏడాదిలోపే విడాకులు తీసుకుంటే.. మరి కొంతమంది పెళ్లయి సంవత్సరాల తరబడి వైవాహిక జీవితంలో సంతోషంగా కొనసాగి…తమ పిల్లలు పెళ్లీడుకొచ్చిన తర్వాత విడిపోయి అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నారు. అయితే విడిపోయిన తర్వాత తమ గోప్యతకి భంగం కలిగించవద్దు అంటూ సోషల్ మీడియా ద్వారా పోస్టులు కూడా పెడుతున్నారు. అయితే ఎందుకు విడిపోతున్నారు అనే విషయాలను మాత్రం అభిమానులతో పంచుకోవడం లేదు. కానీ ఇక్కడ ఒక బుల్లితెర జంట మాత్రం ఏకంగా 25 ఏళ్ల తర్వాత తమ వైవాహిక బంధానికి స్వస్తి పలకడమే కాకుండా తాము.. విడాకులు తీసుకోవడానికి గల కారణాలు చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు.

25 ఏళ్ల తర్వాత విడిపోయిన బుల్లితెర జంట..

ఆ జంట ఎవరో కాదు.. మలయాళ బుల్లితెర జంట మను వర్మ – సింధు వర్మ. మలయాళం బుల్లితెర జంట అయిన వీరు దాదాపు 25 ఏళ్ల తర్వాత విడాకులకు దరఖాస్తు చేసుకోవడం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే ఈ విషయంపై మను వర్మ మాట్లాడుతూ.. “నా భార్య, నేను గత కొంతకాలంగా విడిగా జీవిస్తున్నాము. మా బంధాన్ని బ్రేక్ చేయడానికి చట్టపరంగా విడాకులు మంజూరు కాకపోయినా మేము మళ్ళీ కలిసే అవకాశాలు అయితే చాలా తక్కువ. మళ్ళీ జంటగా జీవితాన్ని కొనసాగించే అవకాశం కానీ ఆలోచన కానీ మాకు ఏమాత్రం లేదు. మాకంటే ఎక్కువ ప్రేమించుకున్న వాళ్ళు.. జంటగా కలిసిన వాళ్ళు కూడా విడిపోయిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. నిజానికి మూడేళ్ల క్రితం మేమిద్దరం ప్రేమగానే కొనసాగాము. కానీ కొంతకాలానికి అంతా రివర్స్ అయ్యింది. అందుకే సఖ్యత లేనప్పుడు కష్టంగా కలిసి ఉండడం కంటే ఇష్టంగా విడిపోవడం మేలు అని విడిపోతున్నాము.. మేము విడిపోయినా మా స్నేహం అలాగే కొనసాగుతుంది అంటూ తెలిపారు.

అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న కూతురు..

Advertisement

సాధారణంగా ఎవరైనా విడిపోయిన జంట మళ్లీ ఒకరికొకరు కనిపించారంటే ఒకరిపై మరొకరు ఎద్దేవా చేసుకుంటూ అవతలి వారి పరువు తీసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. మేము అలా చేయకూడదని నిర్ణయించుకున్నాము అంటూ తెలిపారు. అలాగే తమ పిల్లల గురించి మాట్లాడుతూ.. మాకు ముగ్గురు పిల్లలు సంతానం. పెద్దబ్బాయి అమెరికాలో ఐటీ ఇంజనీర్ కాగా రెండో కొడుకు బెంగళూరులో ఉంటున్నారు మాకు ఒక అమ్మాయి కూడా ఉంది..ఆమె అనారోగ్య సమస్యలతో బాధపడుతోంది. అంటూ తెలిపారు.

ALSO READ:Naa Anveshana: అన్వేష్ రహస్యాలు బయట పెడతానంటున్న ఉక్రెయిన్ మహిళ !

మను వర్మ నటించిన సీరియల్స్, సినిమాలు

Advertisement

మనో వర్మ ఎవరో కాదు దివంగత బాలీవుడ్ నటుడు జగన్నాథ వర్మ కుమారుడే. ఈయన పోక్కాలం వరవై, కుంకుమచెప్పు, కాదమట్టతు కథనార్ వంటి సీరియల్స్ లో నటించారు. అలాగే మమ్ముట్టి నీలగిరి, జయరాం నరనాతు తంపురాన్ వంటి సినిమాలలో నటించారు.

సింధు వర్మ నటించిన సీరియల్స్, సినిమాలు..

సింధు వర్మ విషయానికి వస్తే.. ఈమె కూడా నటిగా తన కెరీర్ ను ఆరంభించింది. ఎటో జన్మ కల్పనయిల్, పంచాంగీ వంటి సీరియల్స్ లో నటించిన ఈమె మమ్ముట్టి నటించిన సిబిఐ 5 ద బ్రెయిన్ , అర్థం వంటి చిత్రాలలో నటించింది.

Related News

క్యాస్టింగ్ కౌచ్‌పై ఝాన్సీ ఏమన్నారంటే.. ఇండస్ట్రీలో మహిళల పరిస్థితి ఇదేనా?

సలార్‌లో ఛాన్స్ కోసం ఝాన్సీ ఏం చేశారో తెలుసా?

ఆ రోజు షూటింగ్‌లో ఏం జరిగిందంటే.. ఝాన్సీ కన్నీటి కథ!

సుధీర్ కామెడీకి ఫిదా అవ్వాల్సిందే.. ఇస్మార్ట్ బతుకమ్మలో ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్!

జాను లిరి ఒక్క పాటకు ఎంత తీసుకుంటుందో తెలుసా?

యూట్యూబర్ నందనకి కోర్టులో భారీ ఊరట.. సంచలన పోస్ట్ వైరల్!

Telugu Tv Serials : బిగ్ బాస్ ఎఫెక్ట్.. ఆ సీరియల్స్ కు శుభం కార్డు పడినట్లే..?

ఒక్కరోజులో మారిపోయిన లెక్కలు..ఆరో వారం ఊహించని ఎలిమినేషన్ ట్విస్ట్..!

Big Stories

Advertisement
×