E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today January 3rd: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌:  మనోహరికి బ్యాడ్ టైం మొదలైందన్న చంభా

Nindu Noorella Saavasam Serial Today January 3rd: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌:  మనోహరికి బ్యాడ్ టైం మొదలైందన్న చంభా
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode:  

బస్సులో ఎక్కిన మిలటరీ ఆఫీసరు విక్రమ్‌, అమర్‌తో ఫోన్‌ మాట్లాడుతూ.. బ్యాగ్‌ పైన పెట్టబోతుంటే ఫోన్‌ జారి కింద పడబోతుంది. అది గమనించిన బుజ్జమ్మ ఫోన్‌ పట్టుకుంటుంది. ఫోన్ అమర్‌ హలో విక్రమ్‌ అని పిలుస్తుంటాడు. బుజ్జమ్మ మాత్రం ఫోన్‌ పట్టుకుని అంకుల్‌ మీరు బ్యాగ్‌ పైన పెట్టండి. నేను ఫోన్‌ పట్టుకుంటాను అని చెప్తుంద. విక్రమ్‌ సరే అమ్మా అంటూ బ్యాగ్‌ పైన పెడుతుంటాడు. ఫోన్‌ లో అమర్‌ హలో విక్రమ్‌ ఏమైంది అని అడగ్గానే.. బుజ్జమ్మ హలో అంటుంది. ఆ పిలుపునకు అమర్‌ షాక్‌ అవుతాడు. మిస్సమ్మ కడుపులో ఉన్నప్పుడు బుజ్జమ్మ నాన్న అని పిలిచిన పిలుపు గుర్తు చేసుకుంటాడరు. బుజ్జమ్మ మాత్రం హలో అంకుల్‌ కాసేపు లైన్‌ లో ఉండండి. అంకుల్‌ బ్యాగ్‌ పైన పెడుతున్నాడు. కొంచెం వెయిట్‌ చేయండి.. వెయిట్‌ చేస్తున్నారా..? హలో మాట్లాడండి.. అంటుంది.

అమర్‌ మాత్రం అలాగే మౌనంగా ఉండిపోతాడు. ఇంతలో విక్రమ్‌ బ్యాగ్‌ పైన పెట్టి పాప ఇటివ్వమ్మా థాంక్యూ పాప అని చెప్పగానే.. ఫోన్‌ ఇచ్చిన బుజ్జమ్మ ఇట్స్‌ ఓకే అంకుల్‌ అంటుంది. ఫోన్‌ తీసుకుని హలో అనగానే.. అమర్‌ ఆత్రుతగా విక్రమ్‌ ఇందాక ఫోన్‌లో నాతో మాట్లాడింది ఎవరు..? అని అడుగుతాడు. విక్రమ్‌ ఎవరో చిన్న పాప నేను బ్యాగ్‌ పెడుతుంటే.. ఫోన్‌ పడిపోయింది. తను పట్టుకుంది. ఇంకేంటి విశేషాలు చెప్పు.. రేపు నన్ను ఫికప్‌ చేసుకోవడానికి రాథోడ్‌ను పంపించు.. అని విక్రమ్‌ చెప్పగానే.. లేదు రాథోడ్‌ తో పాటు నేను వస్తాను అని అమర్‌ చెప్పగానే.. విక్రమ్‌ నువ్వెందుకు అని అడుగుతాడు.  పర్వాలేదు విక్రమ్‌ మనం కలిసి చాలా రోజులు అయింది కదా జాగ్రత్తగా రా.. హ్యాపీ జర్నీ.. అని చెప్పగానే.. ఓకే బ్రో రేపు కలుద్దాం.. అంటూ కాల్‌ కట్‌ చేస్తాడు విక్రమ్‌. తర్వాత అమర్‌ బుజ్జమ్మ మాటలే గుర్తు చేసుకుంటూ నిలబడిపోతాడు. దీంతో రాథోడ్‌ ఏమైంది సార్‌ అలా ఉన్నారు అని అడుగుతాడు.

Advertisement

దీంతో అమర్‌ ఆరు గుర్తుకు వస్తుంది రాథోడ్‌ అని చెప్పగానే.. మేడం గారు ఎప్పుడూ మీతోనే ఉంటారు సార్‌ అంటాడు రాథోడ్‌. దీంతో అమర్‌ గుర్తుకు వస్తుంది తను కాదు.. నాకోసం మళ్లీ పుట్టిన అరుంధతి. ఆరును తీసుకుని భాగీ ఎందుకు వెళ్లిపోయింది రాథోడ్‌.. వాళ్లు ఎక్కడున్నారు..? అసలు ఎలా ఉన్నారు..? అంటాడు.. దీంతో రాథోడ్‌ వాళ్లు ఎక్కడున్నా మీకోసం తప్పకుండా తిరిగి వస్తారు సార్‌ అంటూ రాథోడ్‌ చెప్పగానే.. ఐదేళ్లుగా ఎదురుచూస్తున్నాను రాథోడ్‌ ఇంకెప్పుడు వస్తారు..? అంటాడు అమర్‌. వస్తారు సార్‌ తప్పకుండా వస్తారు.. ఈ రోజు కృష్ణ జయంతి.. సార్‌ సరిగ్గా ఇలాంటి రోజునే ఆరు మేడం మళ్లీ పుట్టారు.. ఈ కృష్ణ జయంతి మీకు మంచి చేస్తుందని నాకెందుకో నమ్మకం వస్తుంది సఆర్‌. మీకోసం మిస్సమ్మ, బుజ్జమ్మ వస్తున్నారనిపిస్తుంది అని రాథోడ్‌ చెప్పగానే.. అమర్‌ ఆలోచిస్తూ.. వాళ్లు నిజంగా తిరిగి వస్తారా..? నా ఆశ నిరాశే అవుతుందా..? ఇలా ఎన్ని రోజులు ఎదురుచూడాలి అని మనసులో అనుకుంటూ బాధడుతుంటాడు.

తర్వాత  ఇంట్లో పిల్లలు కూడా మిస్సమ్మ, బుజ్జమ్మలను గుర్తు చేసుకుని బాధపడుతుంటారు. మరోవైపు ఇంట్లో అమర్ ను పిలుస్తూ… వెళ్లిన మనోహరి కుర్చి తగిలి ఆరు ఫోటో దగ్గరకు వెళ్లి కిందపడిపోతుంది. కాళికి దెబ్బ తగిలి బ్లడ్‌ వస్తుంది. ఆ బ్లడ్‌ చూసిన చంభా షాక్‌ అవుతుంది. అయ్యో మనోహరి ఎందుకిలా పడిపోయావు.. అయినా అరుంధతి ఫోటో ముందు పడిపోయావేంటి..? అరుంధతి ఫోటో ముందు నీ రక్తం చిందింది అంటే నీకు కష్టాలు మొదలు కాబోతున్నాయి మనోహరి అని చంభా చెప్పగానే.. మనోహరి భయపడుతుంది. ఏం మాట్లాడుతున్నావు చంభా ఐదేళ్ల నుంచి హ్యాపీగా ఉన్నాను.. ఆ భాగీ రావడానికి ఇంకా రెండేళ్ల టైం ఉంది. ఇప్పుడు నాకు కష్టాలు రావడం ఏంది..? అంటూ అడగ్గానే… చంభా గవ్వలు వేసి చూస్తుంది. నీ జీవితంలోకి నిన్ను అంతం చేయబోయే వాళ్లు రాబోతున్నారు మనోహరి అని చంభా చెప్పగానే.. మనోమరి భయపడుతుంది. ఇంతలో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

Advertisement

 

Related News

మాధురి రాథోడ్ తల్లిపై ఈశ్వర్ సాయి భార్య ఊహించని కామెంట్స్!

Nindu Noorella Saavasam Serial Today Episode September 5th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండను తిట్టిన మనోహరి  

Gundeninda Gudigantalu : సీరియల్ లవర్స్ కు షాక్.. రోహిణి ఇక కనిపించదా..?

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి దిమ్మతిరిగే షాక్.. శృతి దెబ్బ అదుర్స్.. రోహిణి మాస్టర్ ప్లాన్ ..?

Illu Illalu Pillalu Today Episodes: విశ్వం ప్లాన్ సక్సెస్.. ధీరజ్ కోసం ప్రేమ కన్నీళ్లు.. అడ్డంగా బుక్కయిన ధీరజ్..

Ninnu kori Serial Today Episode September 5th ‘నిన్ను కోరి’ సీరియల్‌: డాక్టర్ ను బెదిరించి నిజం తెలుసుకున్న విరాట్  

Intinti Ramayanam Today Episode: గుండెలు పగిలేలా ఏడ్చిన అక్షయ్.. అయ్యో కన్నీళ్లు తెప్పించే సీన్.. పల్లవి ఫుల్ హ్యాపీ..

Saturday Movies in Tv : శనివారం టీవీల్లోకి హిట్ సినిమాలు.. డోంట్ మిస్..

Big Stories

Advertisement
×