E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today April 28th : ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌:  ఒంటరిగా బయటకు వెళ్లిన మిస్సమ్మ – చంపడానికి రెడీ అయిన బాబ్జీ   

Nindu Noorella Saavasam Serial Today April 28th : ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌:  ఒంటరిగా బయటకు వెళ్లిన మిస్సమ్మ – చంపడానికి రెడీ అయిన బాబ్జీ   
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode : కళ్లకు గంతలు కట్టుకుని పిల్లలు ఆడుకుంటుంటే మేడ మీద నుంచి చూసిన మనోహరి ఎలాగైనా పిల్లలు లోయలో పడేటట్టు చేయాలని.. మిస్సమ్మను అమర్‌ తో తిట్టించాలని తర్వాత బాబ్జీ చేత మర్డర్‌ చేయించాలని అనుకుంటుంది. వెంటనే కిందకు వచ్చి పిల్లలతో నేను అడతాను అని అడుగుతుంది. పిల్లలు సరే అంటారు. అంజు కళ్లకు గంతలు కట్టుకుని పట్టుకోవడానికి వెళ్తుంటే.. మనోహరి తప్పించుకుంటూ.. లోయ వైపు వెళ్తుంది. అంజు మనోహరి పట్టుకోవడానికి వెళ్లి లోయలోకి పడబోతుంటే అనామిక వచ్చి అంజు చేయి పట్టుకుంటుంది. అంజు వెంటనే అనామిక చేయి పట్టుకుని ఔట్‌ ఔట్ అని అరుస్తూ.. గంతలు విప్పేసి చూసి అయ్యో అనామిక నువ్వా.. నేను ఇంకా మనోహరి ఆంటీ అనుకున్నాను అంటుంది.

మనోహరి ఆంటీని ఔట్‌ చేయాలి అంతే కదా నేను చేస్తాను. అంజు అటు వెళ్తే ప్రమాదం అని చెప్పి వెళ్లాను కదా..? టైంకు నేను వచ్చాను కాబట్టి సరిపోయింది. లేదంటే ఏమయ్యోదో తెలుసా..? అంటుంది. దీంతో అంజు కళ్లకు గంతలు కట్టుకున్నాను కదా ఎటు వెళ్తున్నానో ఎలా తెలుస్తుంది అంటుంది. ఇంతలో మనోహరి సరే సరే లేండి ఎవరికీ ఏమీ కాలేదు కదా వదిలేయండి పిల్లలు నేను వెళ్తాను మీరు ఆడుకోండి అంటూ వెళ్లిపోతుంటే.. ఒక్క నిమిషం మనోమరి గారు నేను ఇప్పుడే ఆటలోకి దిగాను. అప్పుడే నువ్వు వెళ్లిపోతాను అంటే ఎలా..? నాతో కూడా ఆడి వెళ్లండి అంటూ అనామిక కళ్లకు గంతలు కట్టుకుని ఆడుతుంది. మనోహరి మరోసారి అనామికను లోయలోకి తోసేయాలని చూస్తుంది. కానీ మనోహరి లోయలోకి పడబోతుంటే.. అనామిక పట్టుకుంటుంది.

Advertisement

ఇంతలో అనామిక పిల్లలు మీరు లోపలికి వెళ్లి ఫ్రెష్‌ అవ్వండి డ్రైవర్‌ మిమ్మల్ని మీ ప్రెండ్‌ వాళ్ల ఇంటికి తీసుకెళ్తాడు. అని అనామిక చెప్పగానే పిల్లలు లోపలికి వెళ్లిపోతారు. జాగ్రత్త మనోహరి గారు మీరు తీసుకున్న గోతిలో మీరే పడతారు. అదే కొంచెం ఏమారినా గోతిలో పడిపోతారు. మూతి పళ్లు రాళిపోతాయి అంటున్నాను అని చెప్పగానే.. మనోహరి నువ్వు అప్పుడప్పుడు అచ్చం మా ఆరులా మాట్లాడతావు తెలుసా..? ఒకసారి అరుంధతియే నీలో ఉందేమో అనిపిస్తుంది అనగానే.. ఆవిడే ఉంటే అవిడ చావుకు కారణమైన వాళ్లను సార్‌ ముందు నిలబెట్టే వాళ్లు కదా  మనోహరి  గారు. అనగానే అవును కదా.. అయితే నువ్వు తను కాదన్నమాట అంటుంది మనోహరి. కాదు అని చెప్పి అనామిక లోపలికి వెళ్లిపోతుంది. నువ్వే అరుంధతి అని తెలిసినా నేను ఎందుకు ఊరికే ఉంటున్నానో తెలుసా..? నీ చెల్లి చావును నీకు చూపించడానికి.  దాని సంగతి చెప్పాక నీ సంగతి చెప్తాను. అని కోపంగా అనుకుంటుంది.  అమర్‌ ఒక్కడే నిలబడి ఆరుకు జరిగిన యాక్సిడెంట్‌ గుర్తు చేసుకుంటూ బాధపడుతుంటాడు.

ఇంతలో రాథోడ్‌ వచ్చి సార్‌ ఇక్కడే ఉండి జరిగినవన్నీ తలుచుకుని ఎందుకు సార్‌ బాధపడుతున్నారు. వెళ్దాం పదండి సార్‌ అని పిలస్తాడు. అమర్‌ ఎమోషనల్‌ గా ఇలాంటి ఒక ఉదయాన్నే ఇక్కడ నా ఆరును కోల్పోయాను. ఆరోజు నాకు తెలియలేదు రాథోడ్‌. నా భార్యని చావు వెంటాడుతుందని నా భార్య ప్రాణాన్ని ఇంకొకరు కోరుకుంటున్నారని.. బాధపడుతుంటే.. రాథోడ్‌ సార్‌ జరిగిన దాన్ని తలుచుకుని బాధపడటం కన్నా భాగీకి మంచి లైఫ్‌ ఇవ్వండి సార్‌ అని చెప్తాడు. దీంతో అమర్ ఆలోచించి వెంటనే మిస్సమ్మకు ఫోన్ చేసి నిన్ను బయటకు తీసుకెళ్లడానికి  ఫోన్‌ చేశాను అని చెప్తాడు.  మిస్సమ్మ హ్యాపీగా  ఫీలవుతూ.. నన్ను బయటకు తీసుకెళ్తారా అని అడుగుతుంది. దీంతో అమర్‌ అవును నీకు క్యాబ్‌ పంపిస్తాను. అందులో వచ్చేసెయ్‌ అని చెప్తాడు.

Advertisement

మిస్సమ్మ సరే అంటూ ఎగిరి గంతేస్తుంది. అంతా మేడ మీద నుంచి విన్న మనోహరి వెంటనే బాబ్జీకి ఫోన్‌ చేసి విషయం చెప్తుంది. మిస్సమ్మ ఒక్కతే ఇంట్లోంచి బయటకు వస్తుంది. నువ్వు మధ్యలో వెళ్లి దాన్ని లేపేయ్‌ అని చెప్తుంది. బాబ్జీ సరే మేడం అని చెప్తాడు. ఇంతలో మిస్సమ్మ క్యాబ్‌లో వెళ్తుంది. మరోవైపు బాబ్జీ లారీ స్టార్ట్‌ చేస్తాడు. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

 

ALSO READ: ఫస్ట్‌ టైం అరుణాచలం వెళ్తున్నారా..? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే..?

 

Related News

సీరియల్స్‌లో మాత్రమే జరిగే వింతలు ఇవి .. నిజ జీవితంలో ఇలా జరిగితే?

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ వీరే.. దశావతారం వర్కౌట్ అవుతుందా?

కృష్ణాష్టమి స్పెషల్.. ‘రాధా’గా మారిన అనసూయ.. వీడియో వైరల్!

అవినాష్, అరియానా మధ్య గొడవలు నిజమేనా? బయటపెట్టిన శ్రీముఖి!

Nindu Noorella Saavasam Serial Today Episode September 4th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆత్మ కోసం ప్రచండ ప్రత్యేక పూజ  

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Big Stories

Advertisement
×