Illu Illalu Pillalu Today Episode April 28th: నిన్నటి ఎపిసోడ్ లో.. చందు, సాగర్ శోభనం జరుగుతుందని సంతోషంగా ఉంటారు. ఎప్పుడు శోభనం గదిలోకి వెళ్తామా అని వెయిట్ చేస్తుంటారు. అటు కామాక్షి ఇద్దరు మరదళ్లను శోభనానికి రెడీ చేస్తుంది. అయితే ఏదైనా అంటే అన్నాను అంటారు కానీ ఫైనాన్స్ కోడలు మరదలు కన్నా గవర్నమెంట్ మరదలే శోభనం చీరలో అందంగా ఉంది అని నర్మదను పొగిడేస్తుంది. నర్మద మాత్రం అక్క కూడా చాలా బాగుంది అని అంటుంది. ఏం బాగుంది నేను ఎంతోమందిని రెడీ చేశాను కానీ నిన్ను చూసినంతగా ఎవరిని చూడలేదు అని అంటుంది. నీకు తక్కువ నగలే వేశాను సింపుల్ గానే చీర కట్టాను నువ్వు చాలా అందంగా ఉన్నావు. అదే ఆవిడకి మరి చెట్టుకు చీర కట్టినట్టు ఉంది. నగలు అంటావా ఏదో దండం మీద వేసినట్లు ఉన్నాయి అని దారుణంగా అవమానిస్తుంది. ఆ మాట వినగానే శ్రీవల్లి ఏడ్చుకుంటూ బయటికి వెళ్లిపోతుంది. వాళ్ళ అమ్మకి ఫోన్ చేసి జరిగిన విషయాన్ని చెప్తుంది. నేను ఇక్కడ ఉన్నాను అమ్మ నేను వచ్చేస్తాను అని భాగ్యంతో అంటుంది శ్రీవల్లి. నువ్వు అందంగా లేవని ఎవరన్నారు నువ్వు చాలా అందంగా ఉన్నావ్ ఇప్పుడు నువ్వు ఆలోచించాల్సింది నీ అందం గురించి కాదు. ఆ నర్మదా సాగర్ లకు పిల్లలు పుడితే నిన్ను మీ అత్తమామలు పట్టించుకోరు ముందు నిన్ను నువ్వు కాపాడుకో వాళ్ళకి శోభనం జరగకుండా చెయ్యి అనేసి ప్లాన్ చెబుతుంది. తనకి శ్రీవల్లి నువ్వు ఎలాగ చెప్తే అలాగే అమ్మ అనేసి అంటుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. వేదవతి రామరాజు ఇద్దరూ కొడుకులకు శోభన జరుగుతున్న సందర్భంగా సంతోషంగా ఉంటారు. మనిద్దరి కొడుకులకి పిల్లలు పుడితే నేనొక్కదాన్నే కాదు చూసుకోవాల్సిన సుమీ మీరు కూడా చూసుకోవాలని వేదవతి సరదాగా అంటుంది. మీరు రైస్ మిల్లు పక్కన పెట్టేసి పిల్లల్ని మాత్రమే చూసుకోవాలి అని అంటుంది. నా మనమని తీసుకొని రైస్ మిల్కీ వెళ్ళిపోతాను అని సరదాగా రామరాజు కూడా మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే శ్రీవల్లి ఏడ్చుకుంటూ అక్కడికి వచ్చేస్తుంది. మావయ్య గారు అండి అత్తయ్య గారండి మీకు విషయం చెప్పాలి కానీ నా నోటితో ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు అని కాస్త ఆలోచిస్తుంది.
మా శోభనాన్ని ఆపేయండి మావయ్య గారు అత్తయ్య గారు అని అడుగుతుంది.. ఆ మాట వినగానే ఇంట్లో వాళ్ళందరూ షాక్ అవుతారు. వేదవతి ఏమైందమ్మా ఎందుకిలా అంటున్నావ్ ఎవరైనా ఏమైనా అన్నారా అని అడుగుతుంది. కి చూర్ కింద రెండు శోభనాలు జరిగితే అస్సలు బాగోదంట ఆ ఇంట్లో కీడు జరుగుతుంది అంట. ప్రాణమే పోయే ప్రమాదం ఉందని పంతులుగారు చెప్పారు అని అంటుంది. నేను పంతులు గారిని అన్ని కనుక్కొని మీ ఇద్దరికీ శాంతి ముహూర్తం ఏర్పాటు చేశాను. నీకు ఆ టెన్షన్ ఏం అవసరం లేదు అని వేదవతి అంటుంది. కానీ శ్రీవల్లి మాత్రం ఇప్పటివరకు ఇల్లు పచ్చగానే ఉంది నేను అడుగుపెట్టిన తర్వాత ఇలా మారితే అందరూ నాదే తప్పు అంటారు. మీరు ఆలోచించండి అత్తయ్య గారు అని అంటుంది. అప్పుడు అక్కడే ఉన్నా నర్మదా సాగర్లు ఫస్ట్ అన్నయ్యకి వదినకి శోభనం ఏర్పాట్లు చేద్దాం ఆ తర్వాత ముహూర్తం చూసుకొని మేము శోభనం చేసుకుంటామని అంటారు..
శ్రీవల్లి ఎంతో సంతోషంగా శోభనం గదిలోకి అడుగుపెడుతుంది. ఆ నర్మదా వల్ల శోభనాన్ని అమ్మ చెప్పినట్లు ఆపేసాను అని సంతోషపడుతుంది. లోపల చందు మాత్రం కోపంగా ఉండడం చూసి దగ్గరికి వెళ్తుంది. పాలు తీసుకోమని అడిగితే పాలొద్దని అక్కడ పెట్టమని అంటాడు. మీ తమ్ముడు మరదలు శోభనం జరగలేదని దానికి కారణం నేనే అని మీరు నా మీద కోపంగా ఉన్నారు కదా ఇంత చిన్న విషయానికే మీరు ఇంత కోపంగా ఉన్నారంటే రేపు జీవితంలో ఏ ఇంకా ఎంత కోపంగా ఉంటారో అనేసి శ్రీవల్లి బాధపడుతుంది. నేను మన శోభనం జరగాలని వాళ్ళ శోభనం ఆపలేదండి. వాళ్లకి కీడు జరగకుండా ఉండాలని నేను ఇల్లంతా చేశానని శ్రీవల్లి అంటుంది.
శ్రీవల్లి కన్నీళ్లు పెట్టుకోవడంతో చందు కరిగిపోతాడు. ఇక ధీరజ్ ప్రేమ బయట పక్క వేసుకుని పడుకో ఉంటారు.. ప్రేమ చదువుకుంటుంటే మధ్యలో గజ్జల సౌండ్ రావడంతో ధీరజ్ని లేపుతుంది. కానీ ధీరజ్ మాత్రం కోపంగా ఉంటాడు. నిజంగానే దయ్యాలుంటాయా నీ ప్రేమ అమాయకంగా అడుగుతుంది. ఈరోజు దెయ్యం స్టోరీ చెప్తాడు. దానికి ప్రేమ షాక్ అవుతుంది. ఇక సాగర్ నర్మదపై కోపంగా ఉంటాడు. నర్మద వివరణ ఇవ్వడంతో కూల్ అవుతాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో మూడు జంటల మధ్య కరెంటు మాయమైపోతుంది.. అందరూ సరదాగా తమ భార్యలతో కలిసి డ్యూయేట్ వేసుకుంటారు. ఆతర్వాత ఏం జరుగుతుందో చూడాలి..