E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode April 29th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అమర్ కు నిజం చెప్తానన్న రణవీర్    

Nindu Noorella Saavasam Serial Today Episode April 29th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అమర్ కు నిజం చెప్తానన్న రణవీర్    
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode: మిస్సమ్మ, రాథోడ్‌ ఇద్దరు వెళ్లి యాదమ్మను మళ్లీ ఇంటికి తీసుకొస్తారు. ఆ విషయం తెలిసి మనోహరి షాక్‌ అవుతుంది. కారణం లేకుండా భాగీ ఏ పని చేయదు. నిన్న చంభాను కావాలనే తనే పంపించేసి.. ఇవాళ తనే కావాలని ఇంటికి తీసుకొచ్చింది అంటే భాగీ ఏదో చేయబోతుంది. అని అనుమానపడుతుంది. మరోవైపు చంభా తన చేతికి కట్టిన తాయెత్తు చూసుకుంటూ మిస్సమ్మ, రాథోడ్‌ తన దగ్గరకు వచ్చింది గుర్తు చేసుకుంటుంది. తాను రోడ్డు మీద ఉండగా మిస్సమ్మ, రాథోడ్‌ దగ్గరకు వెళ్లి ఇంటికి రమ్మని పిలుస్తారు. దీంతో చంభా ఎమోషనల్ అవుతూ.. నన్ను వెతుక్కుంటూ వచ్చి మళ్లీ నన్ను ఇంటికి రమ్మని పిలుస్తున్నారు. మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను మీరు నిండు వెయ్యేళ్లు బతకాలి అంటుంది చంభా.

దీంతో మిస్సమ్మ.. ఎంతైనా అయిదేళ్లు ఎంతో నమ్మకంగా మా ఇంట్లో పని చేసి పిల్లలను చూసుకున్నావు.. నిన్ను వదులుకోవడం నాకు బాధగానే ఉంది యాదమ్మ అంటూ మిస్సమ్మ చెప్పగానే.. రాథోడ్‌ కూడా నీలాంటి నమ్మిన బంటును.. విశ్వాసం గల వ్యక్తిని నేను ఎక్కడా చూడలేదు యాదమ్మ అనగానే.. మిస్సమ్మ కూడా జరిగింది మనసులో పెట్టుకోకుండా నువ్వు మళ్లీ మా ఇంటికి వస్తున్నందుకు చాలా థాంక్స్‌ యాదమ్మ రాథోడ్‌ ఇలా ఇవ్వు.. అంటూ తాయెత్తు తీసుకుని యాదమ్మ ఈ తాయెత్తు నీ చేతికి కడతాను.. అని చెప్పగానే.. చంభా ఎందుకు మేడం అని అడుగుతుంది. దీంతో మిస్సమ్మ నీ దగ్గరకు ఏ దెయ్యం భూతం రాదు అంటూ తాయెత్తు కట్టి ఇక నీ దగ్గరకు ఏమొచ్చినా మాకు తెలుస్తుంది అనగానే.. ఏంటి మేడం అంటున్నారు అనగానే.. నీ దగ్గరకు ఏ దుష్టశక్తి వచ్చినా మాకు తెలుస్తుంది అంటున్నాను అని మిస్సమ్మ చెబుతూ చంభాను కారులో ఇంటికి తీసుకురావడం గుర్తు చేసుకుంటుంది చంభా.

Advertisement

అయితే ఈ తాయెత్తు గురించి మనోహరికి చెప్పాలా వద్దా అనుకుంటూ.. ఆ ఉట్టి తాయెత్తే కదా అనుకుంటుంది. అంతా ఫోన్‌లో వింటున్న రాథోడ్‌ అది ఉత్తి తాయెత్తు కాదే వెర్రి యాదమ్మ.. నువ్వు మనోహరితో మాట్లాడే ప్రతి మాట మేము వినడానికి మిస్సమ్మ తాయెత్తులో ఒక మైక్రోఫోన్‌ సెట్‌ చేసింది అనుకుంటూ నవ్వుకుంటాడు రాథోడ్‌. మిస్సమ్మ, రాథోడ్‌ ఇయర్‌ బర్డ్ పెట్టుకుని అంతా వింటుంటారు. మిస్సమ్మ కోపంగా మనోహరిని ఇంటి నుంచి పంపిచేయాలి అంటే ఒక సాక్ష్యం కావాలి కదా రాథోడ్‌ అంటుంది. అందుకే కదా మిస్సమ్మ, మనోహరి స్నేహితురాలు అయిన యాదమ్మను వెతికి మరీ తీసుకొచ్చాం అంటాడు. ఈ క్షణం నుంచి వాళ్లిద్దరూ ఏం మాట్లాడుకున్నా మనం ఈ రిసీవర్‌ నుంచి వినొచ్చు.. అనగానే.. మనం వినొచ్చు.. మన సారుకు కూడా వినిపించొచ్చు అంటాడు రాథోడ్‌.. నేను ఉట్టి వలనే వేసాను రాథోడ్‌ చేపలు ఎప్పుడు పడతాయో ఏంటో.. అంటుంది మిస్సమ్మ. మీరు వల వేశారు. మా సారు అక్కడ రణవీర్‌ అనే తిమింగిలాన్ని పట్టాడు. వాడు ఎప్పుడు నోరు తెరుస్తాడో ఏంటో..? అంటాడు రాథోడ్‌.

మరోవైపు అమర్‌ పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి ఏంటి సడెన్‌ గా రమ్మన్నారు అని పోలీస్‌ను అడగ్గానే.. రణవీర్‌ మీతో మాట్లాడతానన్నాడు సార్‌.. అందుకే రమ్మన్నాను.. అని చెప్పగానే.. సడెన్‌గా ఈ మార్పు ఏంటి..? అని అమర్‌ అడగ్గానే.. ఏమో సార్‌ ఇందాక తన లాయరు వచ్చాడు ఆయన ఎవరితోనో ఫోన్‌ మాట్లాడారు. బెయిల్‌ గురించి అడిగారు.. అక్కడి నుంచి సరైన రెస్పాన్స్‌ రానట్టుంది. అందుకే మీకు నిజం చెప్పడానికి డిసైట్‌ అయినట్టు ఉన్నాడు అని పోలీస్ చెప్పగానే.. అమర్‌ లోపలికి రణవీర్‌ దగ్గరకు వెళ్తాడు. అమర్‌ను చూసిన రణవీర్‌ తన వైఫ్‌ గురించి నిజం చెప్తానని అయితే తన కూతురును అప్పగించమని అడుగుతాడు. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

Advertisement

 

Related News

Gundeninda Gudigantalu : సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. మీనా చెల్లి అవుట్..

Illu Illalu Pillalu Today Episodes: వల్లిని ఇంట్లోంచి గేంటేసిన వేదవతి.. భాగ్యంకు నర్మదా స్ట్రాంగ్ వార్నింగ్.. పాపం శ్రీవల్లి..

Intinti Ramayanam Today Episode: అవని పై భానుమతి సీరియస్.. అవనికి సీరియస్.. ప్రణతి కాపురంలో చిచ్చు..

Karthika Deepam 2 Serial Today Episode October 10th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: కార్తీక్ దెబ్బకు టిపిన్ బండి ఎత్తేసిన మాలిని           

Podarillu Today Episode : నారాయణ దెబ్బకు మైండ్ బ్లాక్.. మహా పై సీరియస్.. కన్నా కన్నీళ్లు..

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ మాటతో ప్రభా షాక్.. కన్నీళ్లు పెట్టుకున్న ప్రభా.. బాలు రచ్చ రచ్చ..

Ninnu kori Serial Today Episode October 10th ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎండింగ్ ఏపిసోడ్ ఇలా ముగుస్తుందనుకోలేదు

Saturday Tv Movies : శనివారం టీవీ సినిమా.. మూవీ లవర్స్ కు పండగే..

Big Stories

Advertisement
×