E-Paper
Advertisement

Brahmamudi Serial Today Episode June 23rd ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఇందు, రాజులను అనుమానించిన అపర్ణ  

Brahmamudi Serial Today Episode June 23rd ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఇందు, రాజులను అనుమానించిన అపర్ణ  
Advertisement

Brahmamudi serial today Episode: ఇందు, రాజు మధ్య గొడవ జరుగుతుంది. దీంతో రాజు ఒకరినొకరం కాపాడుకన్నామని రెస్పెక్ట్‌ ఇవ్వాలి కదా అనగానే.. ఎవరికి రెస్పెక్ట్‌ ఇవ్వాలిరా అంటూ తిడుతుంది. దీంతో రాజు కోపంగా ఒసేయ్‌ ఇందు రా అంటున్నావేంటే అంటూ ఇందును తిడుతుంటే.. ఇందు తిడుతుంది. ఇద్దరి మధ్య గొడవ పెద్దవుతుంటే.. అపర్ణ వచ్చి వింటుంది. అపర్ణను చూసిన రాజు, ఇందు షాకు అవుతారు. మొత్తం విందా అని కంగారుపడుతుంటారు.

అపర్ణ రూంలోకి వెళ్తూ.. మీరు ఇలాగే గొడవ పడితే నిజంగానే మీరు భార్యాభర్తలు కారని అనుకుంటారు అనగానే.. రాజు నవ్వుతూ.. అబ్బే అదేం లేదు అమ్మమ్మ మేమిద్దరం భార్యాభర్తలమే.. అంటూ ఇందును దగ్గరకు తీసుకుంటాడు. దీంతో అపర్ణ కొత్తగా పెళ్లైన వాళ్లకు ఏవో చిన్న అండస్టాండిగ్స్‌ ఉంటాయి. అవి నేను అర్థం చేసుకోగలను.. కానీ ఇలా తిట్టుకోవడం మాత్రం పరిష్కారం కాదు ఒకరినొకరు అర్థం చేసుకోవాలి అంటూ చెప్పగానే.. రాజు మీరు దేవత అమ్మమ్మ క్వశ్చన్‌ మీరే అడిగి ఆన్సర్‌ కూడా మీరే చెప్తుంటారు. మీలాంటి అమ్మమ్మలు ప్రతి ఇంట్లో ఉంటే నాలాంటి మనవళ్లకు ఏ ప్రాబ్లమ్‌ ఉండదు.. అని చెప్పగానే.. అపర్ణ అమ్మా ఇందు అబ్బాయి మన ఇంట్లో ఉంటున్నాడు.. నువ్వే కొంచెం సర్దుకోవాలి అని చెప్పి వెళ్లిపోతుంది అపర్ణ.

Advertisement

మరోవైపు చలపతి, లక్ష్మీ.. రాజు గురించి ఆలోచిస్తుంటారు. చలపతి అనుమానంగా రాజుకు గతం తెలిసి వెళ్లిపోయాడా..? అనగానే.. వాడు అలా వెళితే వాడి ప్రాణాలకే ప్రమాదం కదండి అనగానే.. ఒకవేళ వాడికి నిజం తెలుసో లేదో కానీ తర్వాత నిజం తెలిసినా వాడి ప్రాణాలకు ప్రమాదమే అంటాడు. దీంతో లక్ష్మీ అనుమానంగా వాడు ఆ ఇంటి చుట్టూ తిరుగుతున్నాడు కాబట్టి నిజం తెలిసే అవకాశం ఉంటుదండి అంటుంది. దీంతో చలపతి భయపడుతూ అదే జరిగితే వాడి అమ్మానాన్న చావుకు కారణం అయిన ఆ రేఖ వాళ్లను వాడు అసలు వదిలపెట్టడు.. అనగానే.. ఆ రేఖ మంచిది కాదంటున్నారు కానీ అది మన వాడిని ఏమైనా చేస్తుంది అంటూ భయపడుతుంది. దీంతో ఇద్దరూ కలిసి ఏదో రకంగా రాజు అటువైపు వెళ్లకుండా చేయాలని ఇద్దరు డిసైడ్‌ అవుతారు.

లక్కీ దగ్గరకు వెళ్లిన రాజు కోపంగా తనకు నమ్మకద్రోహం చేస్తావా..? ఐశ్వర్యకు ఎంతకు అమ్ముడు పోయావు.. అంటూ నిలదీస్తాడు.. దీంతో లక్కీ జరిగింది చెప్పగానే.. రాజు తిడుతూ.. అది నిన్ను బకరాను చేసిందిరా.. అనగానే.. లక్కీ ఐషు అలాంటిది కాదురా నన్ను హగ్‌ చేసుకుందని మెలికలు తిరిగిపోతుంటాడు. దీంతో రాజు కోపంగా అది మొత్తం వీడియో తీసిందిరా అంటూ రాజు తిట్టి ఇక  మీదట నీకు ఏ విషయం చెప్పనురా..? నాకు హెల్ప్‌ చేయకపోయినా పర్వాలేదు.. చెడు మాత్రం చేయకురా అంటూ వెళ్లిపోతాడు. రాజు వెళ్లిపోయాక నాకే నమ్మకద్రోహం చేస్తావా..? చెప్తా నీ కథ అంటూ లక్కీ కోపంగా ఐశ్వర్యను తిట్టుకుంటాడు.

Advertisement

ఇందు ఆఫీసుకు వెళ్తూ.. అపర్ణ, సుభాష్‌ దగ్గరకు వెళ్లి వాళ్ల ఆశీర్వాదం తీసుకుని తాను సీఈవో అయిన తర్వాత మొదటి కాంట్రాక్ట్‌ తీసుకుంటున్నానని చెప్తుంది. దీంతో అపర్ణ, సుభాష్‌ సంతోషంగా ఇందును దీవించి కంగ్రాట్స్ చెప్తారు. సుభాష్‌ మాత్రం ఆఫీసులో ఎలా ఉండాలో క్లయింట్స్‌తో ఎలా డీల్ చేయాలో సలహాలు, సూచనలు ఇస్తాడు. ఇందు సరే అంటూ ఆఫీసుకు వెళ్లిపోతుంది. ఐశ్వర్య, లక్కీ దగ్గరకు వెళ్లి తనను ఇంటికి రమ్మని.. రాజు చెప్పిన నిజం అందరికీ చెప్పాలని రిక్వెస్ట్‌ చేస్తుంది. దీంతో లక్కీ కోపంగా ఐశ్వర్యను తిడతాడు. తనకు ఏదీ గుర్తు లేదని లక్కీ చెప్తాడు. ఎందుకు గుర్తు లేదని ఐశ్వర్య అడిగితే కొన్ని గుర్తుంటాయి.. కొన్ని గుర్తుండవు. తాగి ఉన్నాను కదా మొత్తం మర్చిపోయాను.. అని చెప్పగానే.. నువ్వు మర్చిపోయినా సరే నాకు అంతా గుర్తుంది.. నేను చెప్పేది చెప్పినట్టు ఇంట్లో చెప్పాలి అనగానే.. లక్కీ తాను చెప్పనని కోపంగా తిట్టగానే.. ఐశ్వర్య కొంచెం రొమాంటిక్‌గా మాట్లాడుతుంది. ఐశ్వర్య మాటలకు లక్కీ భయంగా అమ్మ మహాతల్లి నన్ను వదిలేసెయ్‌ అంటూ వెళ్లిపోతాడు.

రేఖ ఆఫీసుకు రెడీ అవుతుంది. భ్రమరాంబ, శేషు, భూషణ్‌ ఉంటారు. ఆస్థి తమ వశం అవుతుంది అనుకుంటే.. ఆ ఇందు అడ్డుపడింది. ఇంకెప్పుడు ఆస్తులు మనకు లభిస్తాయి అంటూ చర్చించుకుంటారు. శేషు చెప్పే మాటలకు రేఖకు కోపం వస్తుంది. రాజు తమ ప్లాన్స్‌ అన్నింటికీ అడ్డువస్తున్నాడని ఆలోచిస్తారు. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

ఝాన్సీని ఇరకాటంలో పెట్టేసిన బిగ్ బాస్.. బలయ్యేది ఎవరు?

శ్రీముఖికి కౌంటర్ ఇచ్చిన బిగ్ బాస్ బోలే.. దెబ్బకు రియాక్షన్?

Nirupam Paritala : మంచుకొండల్లో డాక్టర్ బాబు… ఏమున్నాడ్రా బాబు..

బిగ్ బాస్ ఫేమ్ వర్షిణి అరెస్ట్?

Gundeninda GudiGantalu Today episode: ప్రభాకు వంట కష్టాలు.. కామాక్షి మాటతో అనుమానం.. రోహిణికి కన్నీళ్లు..

Podarillu Today Episode : మహా దెబ్బకు షాక్.. గోపిక మాటతో మహా ఫైర్.. శైలు, కేశవ ఫైట్..

Karthika Deepam 2 Serial Today Episode September 24th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: కాంచన ఇంటికి వెళ్లిన మాలిని           

Illu Illalu Pillalu Today Episodes: వేధవతికి భద్ర వార్నింగ్.. శ్రీవల్లికి షాక్.. అయ్యో ఇలా జరిగిందేంటి..?

Big Stories

Advertisement
×