E-Paper
Advertisement

Podarillu Today Episode : కన్నాకు వాతలు పెట్టిన మహా.. మాస్ స్టెప్పులతో డ్యాన్స్ అదుర్స్.. కేశవను రెచ్చగొట్టిన రమణయ్య..

Podarillu Today Episode : కన్నాకు వాతలు పెట్టిన మహా.. మాస్ స్టెప్పులతో డ్యాన్స్ అదుర్స్.. కేశవను రెచ్చగొట్టిన రమణయ్య..
Advertisement

Podarillu Today Episode April 29th : గాయత్రి పెళ్లికూతురుగా బయటికి వెళ్లడం చూసిన మాధవ్ బాధపడిపోతూ ఉంటాడు.. అయితే మళ్లీ పెళ్లయి తన భర్త పక్కన వెళ్ళిపోయినా గాయత్రీ ని చూసిన మాధవ్ ఒక్కసారిగా కన్నీళ్లు పెట్టుకుంటాడు. గాయత్రి తన భర్త పక్కన కూర్చొని వెళ్ళిపోతుంది అని లోపలికి వచ్చి కన్నీళ్లు పెట్టుకుంటాడు. మాధవ్ ఒంటరిగా కూర్చుని కన్నీళ్లు పెట్టుకుంటూ ఉండగా చూసిన మహా తనని ఓదార్చాలని అనుకుంటుంది. మహాలక్ష్మి చేతులు పట్టుకొని మాధవ్ కన్నీళ్లు పెట్టుకోవడం చూసిన మహా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది.. గాయత్రి వెళ్లిపోయింది అని తన బాధని చెప్పుకుంటూ గుండెలు పగిలేలా ఏడుస్తాడు మాధవ్. గాయత్రి బాగుండాలని దేవుని ప్రార్థిస్తాడు అది చూసిన మహాలక్ష్మి ఎమోషనల్ అవుతుంది..

మాధవ్ కోసం మహా ప్లాన్..

మహా మాధవ్ చాలా బాధపడుతున్నాడు అని అనుకుంటుంది.. కాసేపు నేను పడుకుంటాను అని మాధవ్ లోపలికి వెళ్లి పడుకోగానే.. అతని కోసం నేను టీ పెట్టాలి అని మహాలక్ష్మి లోపలికి వెళ్తుంది. అయితే అక్కడ టీ పెట్టడానికి వెళ్లిన మహాలక్ష్మి చేయి జారీ ఒక డబ్బా కింద పడిపోవడంతో ఏదో జరిగింది అని మాధవ్ లేచి బయటకు వస్తాడు.. ఏంటమ్మా ఏమైంది అని అడిగితే మీకోసం టీ పెట్టాలనుకున్నాను పెద్ది అని మహాలక్ష్మి అంటుంది. నువ్వెందుకు అమ్మ కష్టపడ్డా నేను పెడతాను లే అనేసి మాధవ్ అక్కడ పడిన వాటిని తీసి పక్కన పెడతాడు.. పెద్ద ఈ పనిలో పడితే అన్ని మర్చిపోతాడేమో అని మహాలక్ష్మి అనుకుంటుంది..

కస్టమర్ దెబ్బకు చక్రీ షాక్..

Advertisement

కస్టమర్ ని తీసుకొని వస్తున్న చక్రికి ఆమె ఇచ్చే డైరెక్షన్స్ కాసేపు మెంటల్ ఎక్కిస్తాయి. అటు వెళ్ళాలి ఇటు వెళ్లాలి అంటూ లొడ లొడ వాగేస్తూ ఉంటుంది.. అది విన్న చక్రి కారు ఆపేస్తాడు. ఏవండీ డ్రైవింగ్ చేయాల్సింది మీరనేనా ఎందుకండీ మీరు ఇలా మాట్లాడుతూనే ఉంటారు. నేను డ్రైవింగ్ చేస్తాను మీరు ఏమి మాట్లాడకండి అని ఆవిడతో అంటాడు. మీరు దేనికైనా గుద్దేస్తారేమో అని డైరెక్షన్ చేస్తున్నానండి అని ఆవిడ అంటుంది. అప్పుడే మహాలక్ష్మి ఫోన్ చేయడంతో కారు బయటకు వచ్చి ఫోన్ మాట్లాడుతాడు.. పెద్ద చాలా బాధపడ్డాడు అని చెప్పగానే చక్రి కూడా కన్నీళ్లు పెట్టుకుంటాడు. మా అన్నయ్య ఇలా బాధపడడం ఎప్పుడూ చూడలేదు అని చక్రి అంటాడు ఇక మహాలక్ష్మి కూడా పెద్ది ఇంతగా బాధపడడం నేను కూడా చూడలేదు అని అంటుంది..

కేశవ, చక్రీ ఫైట్..

మాధవ్ ఒంటరిగా కూర్చుని బాధపడుతున్నాడని చక్రి కూడా బాధపడుతూ ఉంటాడు. ఇక కేశవ చాలా బాధపడిపోతూ మౌనంగా ఉంటాడు. తనని ఎలాగైనా సరే బాధలోంచి బయటికి తీసుకురావాలని చక్రి పాటలు పెడతాడు. ఆ పాటలు విన్నా కేశవ కోపంతో రగిలిపోతాడు. ఏంట్రా నువ్వు? ఏం చేస్తున్నావ్ రా నీ అడిగితే నువ్వు బాధపడుతున్నావ్ కదరా అందుకే పాటలు పెట్టాను అని అంటాడు. ఏ సమయంలో ఏ పాటలు పెట్టాలో కూడా నీకు తెలియదా అని కేశవ అడుగుతాడు. ఇక పాటలు విషయంలో వీళ్లిద్దరూ కాసేపు కారులోనే గొడవ పడతారు కొట్టుకుంటారు.. చివరికి చక్రి మహాలక్ష్మి నాకు ఫోన్ చేసి అన్నయ్య బాధపడుతున్నాడు అని చెప్పింది నాకు చాలా సంతోషంగా అనిపించింది అని అంటాడు..

మాస్ డ్యాన్స్..

Advertisement

కన్నా మహాలక్ష్మి వీళ్లిద్దరు ఇంకా రాలేదేంటి అని ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడే చక్రి, కేశవ అక్కడికి వచ్చి బిర్యానీ తీసుకొని వచ్చాను అని అనగానే.. ఏంటి నువ్వు బిర్యాని తెచ్చావా అని కన్నా కూడా షాక్ అవుతాడు. ఇక అందరూ కలిసి కూర్చుని బిర్యానీ తినేందుకు రెడీ అవుతారు. అందరికీ ప్లేట్లల్లో వడ్డించడం మాధవ్ చాలా మౌనంగా బాధపడిపోతూ ఉంటాడు. మధ్యలో వచ్చిన నారాయణ మీరందరు నన్ను చీట్ చేశారు. నాకు బిర్యానీ లేదా అని ప్లేట్ తెచ్చుకొని అందులో పెట్టమని చెప్తాడు. మొత్తానికి అందరూ కడుపునిండా భోజనం చేస్తారు.. ఇక తర్వాత మాధవ్ ని కాస్త నవ్వించాలి అని చక్రి ప్లాన్ చేసి కన్నా ఎక్కువ చీర కట్టుకొని రమ్మని చెప్తాడు.. వీళ్ళిద్దరూ కలిసి చేసిన ప్లాను సక్సెస్ అవుతుంది. అందరూ కలిసి మాస్ స్టెప్పులతో అదరగొట్టేస్తారు. ఇదే ఎపిసోడ్ కి హైలైట్ గా నిలుస్తుంది..

రమణయ్య కు కేశవ వార్నింగ్..

కేశవ కస్టమర్ బండి పాడైపోయింది అని చెప్పగానే అతనికి రిపేర్ చేయించడానికి ఒక టీ షాప్ దగ్గరికి వెళ్తాడు. అక్కడ టీ తాగడానికి వెళ్లిన రమణయ్యకు పెళ్లి బాగా జరిపించారు కదా అని అతను అనడంతో అవును ఆకాశమంత పన్నీరుతో చాలా బాగా జరిగింది అని గొప్పలు చెప్పుకుంటాడు. అంతేకాదు మాధవ్ని తప్పు పట్టేలా కేశవ నీ రెచ్చగొడుతూ రమణయ్య మాట్లాడుతాడు.. ఇక పక్కకు తీసుకొని వెళ్ళిన కేశవ రమణయ్యకు వార్నింగ్ ఇస్తాడు.. ఒక్క ఫోను నేను చేశాను అంటే ఆ వినోద్ గాడు వీసా కూడా రాకముందే మీ అమ్మాయిని ఇంటికి పంపిస్తాడు చేయమంటావా నోరు మూసుకొని ఉంటే బాగుంటుంది లేదంటే మాత్రం నేను చేయాల్సింది చేస్తాను అని అంటాడు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…

Also Read :Illu Illalu Pillalu Today Episodes: బంగారం కోసం కామాక్షి కన్నీళ్లు.. వల్లి బండారం బయటపడుతుందా..? ధీరజ్ కోరిక తీరిందా..?

Related News

చీరకట్టులో శివజ్యోతి..ఆ భారీ హారం చూస్తే మతిపోవాల్సిందే!

ఈశ్వర్ సాయి కేసులో కొత్త ప్రశ్న.. ‘పెళ్లైనోడిని ఎలా నమ్మావ్ మాధురి?’

స్టార్ హీరోల సినిమాల కంటే సీరియల్స్‌కే ఎక్కువ క్రేజ్.. అసలు సీక్రెట్ ఏంటి?

పిచ్చి కుక్కల్లా మొరగండి… ట్రోలర్స్ కు కౌంటర్ ఇచ్చిన శిరీష!

నాని ఫోక్ సాంగ్ తో అదరగొట్టేసిన శ్రీముఖి.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode September 2nd  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: పార్థును చంపేందుకు రెడీగా ఉన్న రౌడీలు

Godavari Janu : హాట్ లుక్ లో రెచ్చగొడుతున్న నిత్య.. కుర్రాళ్ళు తట్టుకోలేరమ్మ..!

Gundeninda GudiGantalu Today episode: బాలుకు షాకిచ్చిన నీలకంఠం.. కన్నీళ్లు పెట్టుకున్న మౌనిక.. పాపం బాలు..

Big Stories

Advertisement
×