E-Paper
Advertisement

Karthika Deepam 2 Serial Today Episode June 23rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: జ్యోత్స్నకు వార్నింగ్ ఇచ్చిన కార్తీక్ 

Karthika Deepam 2 Serial Today Episode June 23rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: జ్యోత్స్నకు వార్నింగ్ ఇచ్చిన కార్తీక్ 
Advertisement

Karthika Deepam 2 serial today Episode: విన్నర్స్‌కు శివనారాయణ చేత ప్రైజెస్‌ ఇప్పిస్తుంది దీప. ప్రైజెస్‌ తీసుకున్న వాళ్లందరూ జ్యోత్స్న రెస్టారెంట్‌ గురించి.. దీప గురించి చాలా గొప్పగా చెప్తారు. అంతా సోషల్ మీడియాలో లైవ్‌ ఇస్తుంటాడు సూరజ్‌.  తర్వాత అందరూ వెళ్లిపోయాక శివనారాయణ దీప, సూరజ్‌, కార్తీక్‌, జ్యోత్స్నను తీసుకెళ్లి తన అనుభవాలను చెప్తాడు. ఎవడో ముక్కుముఖం తెలియని వాడు వచ్చి ఫేక్‌ చెక్‌ ఇచ్చాడంటే అది మీ నిర్లక్ష్యమే కదా అందుకే అలా మాట్లాడాను.. కానీ మీరు గెలిచి నా నమ్మకాన్ని చంపేశారు. సంస్థకు మంచి పేరు తీసుకొచ్చారు అంటూ ముగ్గురిని మెచ్చుకుంటాడు.

అప్పుడే మేనేజర్‌ వచ్చి 20 పర్సెంట్‌  వచ్చిందని చెప్తాడు. దీంతో అందరూ హ్యాపీగా ఫీలవుతారు. శివనారాయణ మెచ్చుకుంటూ ఇలాగే ఈ సంస్థను ముందుకు తీసుకెళ్లండి అంటూ చెప్తాడు. దీంతో అక్కడే ఉన్న జ్యోత్స్న మెచ్చుకోవడమే కాదు.. వార్నింగ్‌ కూడా ఇవ్వాలి. ఈ గోల్డ్‌ కాయిన్‌ చిట్కాలు ఎప్పుడ వర్కవుట్‌ అవ్వవు మోసపోయిన తర్వాత రిస్క్‌ చేయడం కాదు.. మోసపోకుండా జాగ్రత్తగా ఉండాలి ఇదే ఫీక్‌ రెయిన్‌ సీజన్‌ అయితే రెస్టారెంట్‌కు ఎవరైనా వచ్చేవారా..? అంటూ ప్రశ్నిస్తుంది. దీంతో శివనారాయణ మరోసారి ఇలాంటివి జరగకుండా జాగ్రత్త పడండి అంటూ చెప్పి వెళ్లిపోతాడు.

Advertisement

జ్యోత్స్న తన చైర్‌లో కూర్చుని ఆలోచిస్తుంటే.. సూరజ్‌ కాఫీ తీసుకుని వచ్చి జ్యోత్స్నకు ఇచ్చి ఏయ్‌ పొగరుబోతుదానా కాఫీ తాగు లోపల జరిగిన దానికి నీ తల బద్దలయిపోతుంటుంది.. పాపం ఏం చేయాలో తెలియక నీ మతి పోతుంటుంది. ఈ వేడి వేడి కాఫీ తాగు రిఫ్రెష్‌ అవుతుంది అనగానే.. జ్యోత్స్న కోపంగా నా మాటలు నాకే చెప్తున్నావా… అంటూ తిడుతుంది. దీంతో సూరజ్‌ నువ్వు నాకేదో ఆఫర్‌ ఇస్తున్నావు కదా..? నేను నీకు ఈసారి ఆఫర్‌ ఇస్తున్నాను తీసుకుంటావా..? అని అడగ్గానే.. ఏంటది అంటాడు సూరజ్‌ దీంతో నాతో చేతులు కలుపు మంచిగా మారిపో అంటూ చెప్పగానే.. అదంతా ఈజీగా జరగదు.. అంటూ కోపంగా తిట్టి వెళ్లిపోతుంది.

ఇంటికి వెళ్లిన దీపకు కాంచన దిష్టి తీస్తుంది. ఈరోజు నువ్వు చేసిన పనికి మా నాన్న పొగిడిన పొగడ్తలకు ఎంత మంది దిష్టి పెట్టారో అంత దిష్టి పోవాలి అంటూ దిష్టి తీస్తుంది. దిష్టి తీసిన తర్వాత బయట పడేస్తానని కార్తీక్‌ వెళ్తాడు. అప్పుడే సుమిత్ర ఫోన్‌ చేస్తుంది. దీపకు కంగ్రాట్స్‌ చెప్పాలంటుంది. దీంతో ఒకరి తర్వాత ఒకరు ఫోన్‌ తీసుకుని మాట్లాడుతుంటారు. సుమిత్ర ఫోన్‌ తీసుకుని దీప చేసిన పనికి మామయ్య, దశరథ చాలా సంతోషంగా ఉన్నారని దీపకు అప్పగించిన బ్రాంచెస్‌ వంటలక్క వంటలతో ఫేమస్‌ అయిపోయాయి అంటూ చెప్తుంటే.. కాంచన మాత్రం అయితే ఈ పోటీలో దీప గెలుస్తుంది అంటావా వదిన అని అడగ్గానే.. సుమిత్ర ఆలోచనలో పడిపోతుంది. ఎవరు గెలుస్తారో ఇప్పుడే చెప్పలేం కదా.. అయినా ఎవరు గెలిచినా సంతోషమే అంటూ కాల్‌ కట్‌ చేస్తుంది.

Advertisement

తర్వాత ఎవరు గెలుస్తారని అత్తను ఎందుకు అమ్మ అడిగేది అంటూ కార్తీక్‌ అడగ్గానే.. ఏదో అడిగానులేరా..? అయినా నీకెందుకు అంటూ కాంచన అడగ్గానే.. నువ్వు అలా అడిగినప్పుడు జ్యోత్స్న పక్కనే ఉంటుంది కదా..? మళ్లీ తను ఏదో చేయాలని చూస్తుంది అనగానే.. నువ్వు ఏదేదో ఊహించుకోకు అనగానే.. కార్తీక్‌ మనసులో జ్యోత్స్న ఈ ఒక్క రాత్రి గడవనీ.. నీ కథ చెప్తాను అని మనసులో అనుకుంటాడు. మరోవైపు సూరజ్‌ బయట తిరుగుతుంటే.. జ్యోత్స్న వచ్చి బయట ఎందుకు తిరుగుతున్నావు అంటూ తిడుతుంది. మా తాతను ఆదర్శంగా తీసుకుంటే నీ పని నువ్వు చేసుకోవచ్చు కదా అనగానే.. సూరజ్‌ కింద నుంచి పైకి చూసి నైట్‌ టైం నువ్వు ఇంత అందంగా ఉంటావని అనుకోలేదు అంటూ చెప్తుంటే.. నేనేం చెప్తున్నాను.. నువ్వేం మాట్లాడుతున్నావు అంటూ కోపంగా అడగ్గానే.. నువ్వు అడిగింది నేను చెప్పాలా..? అంటూ సూరజ్‌ చెప్తుంటే.. జ్యోత్స్న తిట్టుకుంటూ వెళ్లిపోతుంది.

మోసం చేసిన వాడి గురించి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి కంప్లైంట్‌ ఇవ్వకుండా ఇంటికి ఎందుకు వచ్చారు అంటూ తిడుతుంది. ఈ పని కూడా ఆ జ్యోత్స్ననే చేసి ఉంటుంది. మా  నాన్నకు ఫోన్‌ చేయరా నేను అడుగుతాను అంటూ కోప్పడుతుంది కాంచన. ఇంతలో ఇవాళ్టీ కార్తీకదీపం2 ఏపిసోడ్‌ అయిపోతుంది.

 ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

బిగ్ బాస్ 10 అగ్ని పరీక్ష షురూ.. ఈసారి దబిడి దిబిడే..

Nindu Noorella Saavasam Serial Today Episode August 8th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి, పార్థు పెళ్లికి అంతా సిద్దం   

Saturday Movies in Tv : శనివారం టీవీల్లోకి హిట్ సినిమాలు.. సినీ ప్రియులకు ఫుల్ మీల్స్..

బండి ఆపితే రామ్ చరణ్ ఫోటో చూపిస్తా – రోజా

బిగ్ బాస్ 10లోకి ప్రముఖ గేయ రచయిత్రి?

పవన్ తో పెళ్లిపై రీతూ చౌదరి క్లారిటీ!

Gundeninda GudiGantalu Today episode: రోహిణి మాటతో విద్య షాక్.. షీలాను దింపుతున్న బాలు.. పోలీసులకు దొరికిపోయిన మనోజ్..

Podarillu Today Episode : మాధవ్ కోసం కన్నీళ్లు పెట్టుకున్న కన్నా.. హమ్మయ్య దొరికేశాడు మాధవ్.. కన్నీళ్లు తెప్పించే సీన్..

Big Stories

Advertisement
×