BigTV English
Advertisement

Nindu Noorella Saavasam Serial Today December 21st: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌:  అమర్ ను కిస్‌ చేసిన మిస్సమ్మ – మనోహరికి వార్నింగ్‌ ఇచ్చిన ఆరు

Nindu Noorella Saavasam Serial Today December 21st: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌:  అమర్ ను కిస్‌ చేసిన మిస్సమ్మ – మనోహరికి వార్నింగ్‌ ఇచ్చిన ఆరు

Nindu Noorella Saavasam Serial Today Episode :   మిస్సమ్మ  నువ్వు ఇటొచ్చావు.. నేను అటు వెళ్లాను. తర్వాత నువ్వు అటు వచ్చావు. అంటూ ఆరు ఏదేదో చెప్తుంటే.. కన్పీజ్‌గా ఉన్నా.. అర్థం అయినట్టు అనిపిస్తుంది అని మిస్సమ్మ చెప్పగానే గుప్త గారు బాగా కవర్‌ చేశానా..? అని అడుగుతుంది. కవర్‌ చేశావు కానీ నీకు మరో ప్రమాదం వచ్చుచున్నది అంటూ రాథోడ్‌ కారులో రావడం చూపిస్తాడు గుప్త. అయ్యో ఇప్పుడు ఎలా గుప్త గారు అంటూ ఆరు కంగారు పడుతుంటే ఏదో ఒకటి చెప్పి ఇక్కడి నుంచి వెళ్లిపోవడమే అంటాడు గుప్త వెంటనే ఆరు, మిస్సమ్మ నాకు చాలా పనుంది వెళ్తున్నాను అంటూ మిస్సమ్మ వద్దని చెప్పినా వినకుండా వెళ్లిపోతుంది.


ఇంతలో రాథోడ్‌ రాగానే మిస్సమ్మ తనకు పెద్ద యాక్సిడెంట్‌ మిస్‌ అయిందని అని చెప్తుంది. అక్కే కాపాడింది అంటూ చెప్పి మిస్సమ్మను అక్కా అని పిలుస్తుంది. మిస్సమ్మ పిలిచిన సైడు చూసిన రాథోడ్‌ అక్కడ ఎవరూ ఉండరు నాకు ఎవరు కనిపించరు అని మనసులో అనుకుంటాడు. మిస్సమ్మ నువ్వు మీ అక్క బాగానే ఉన్నారు. ఆమె కనిపించదు. నీకు వినిపించడం లేదు.  వచ్చి కారు ఎక్కు వెళ్దాము అంటాడు. అదిగో అక్కడ కనిపిస్తుంది కదా..? అంటుంది మిస్సమ్మ. రాథోడ్‌ కారు ఎక్కించుకుని వెళ్లిపోతాడు.

మనోహరి హాస్పిటల్‌కు వెళ్లి బాబ్జీని తిడుతుంది. అసలు మనమేం అనుకున్నాం నువ్వేం చేశావు అంటుంది. బాబ్జీ ఏడుస్తూ ఏంటి మేడం అదేదో చావడం నాకు సరదా అన్నట్టు చెప్తున్నారు. యాక్సిడెంట్‌ చేద్దామనుకుంటే నాకు యాక్సిడెంట్‌ అయింది మేడం అంటాడు బాబ్జీ. చూడు ముందు అసలు ఏం జరిగిందో చెప్పు అని అడుగుతుంది మనోహరి. నేను ఆవిడను చంపడానికి కరెక్టుగా మిస్సమ్మ వైపే వెళ్తున్నాను మేడం అంటూ అసలేం జరిగిందో తెలుసుకునే లోపు లారీ చెట్టును గుద్దేసింది మేడం అంటాడు. బంగారం లాంటి అవకాశాన్ని మిస్‌ చేశావు కదరా..? అంటూ తిడుతుంది.


మీరేం టెన్షన్‌ పడకండి మేడం నేను హాస్పిటల్ నుంచి బయటకు రాగానే ఆవిడను స్మశానానికి పంపించేస్తాను అంటాడు. ఎలా చంపుతావో చెప్పు అంటూ నిలదీస్తుంది మనోహరి. ఇది నీతో అయ్యే పని కాదని నాకు అర్థం అయింది వెంటనే ఆ ఘోరాను పట్టుకోవాలి అనగానే.. బాబ్జీ ఈ పని ఆ ఘోర  వల్ల కూడా కాదు మేడం. ఆ పని చేయడానికి ఒకరున్నారు అని చెప్పగానే.. మనోహరి ఎవరు అని అడుగుతుంది. మీరే మేడం ఆత్మలను గుప్పిట్లో పెట్టుకునే ఘోరాను, నన్ను మీ గుప్పిట్లో పెట్టుకున్నారు కాబట్టి ఆవిడను చంపేది మీరే మేడం అని బాబ్జీ చెప్పగానే అవును నిజమే దాని చావు నా చేతుల్లో రాసి పెట్టి ఉంది కాబట్టే అది ఇన్ని సార్లు తప్పించుకుంది. మిస్సమ్మ ఇక నీ చావును ఎవ్వరూ ఆపలేరు అంటుంది.

ఇంటికి వచ్చిన మిస్సమ్మ, రాథోడ్‌ డల్లుగా ఉండటంతో ఏమైందని శివరాం అడుగుతాడు. పెద్ద యాక్సిడెంట్‌ మిస్‌ అయిందని లారీ వచ్చి గుద్దబోతే నేను పక్కింటి అక్క తప్పించుకున్నామని చెప్తుంది. దీంతో శివరాం, నిర్మల షాక్‌ అవుతారు. ఇక నువ్వెప్పుడు ఒంటరిగా బయటకు వెళ్లొద్దని జాగ్రత్తలు చెప్తారు. తర్వాత అందరికీ ప్రసాదం ఇచ్చి అమర్‌ దగ్గరకు వెళ్తుంది మిస్సమ్మ. ప్రసాదం ఇవ్వబోతే వద్దని చెప్తాడు అమర్‌. తర్వాత మిస్సమ్మ బొట్టు పెట్టబోతుంటే వద్దని తప్పించుకుంటాడు. దీంతో మిస్సమ్మ బలవంతంగా బొట్టు పెడుతుంది. అమర్‌ తప్పించుకునే ప్రయత్నం చేయగానే జారిపోయి అమర్‌కు కిస్‌ చేస్తుంది మిస్సమ్మ. దీంతో ఇద్దరి మధ్య రొమాంటిక్‌ సీన్‌ క్రియేట్‌ అవుతుంది.

గార్డెన్‌లో కూర్చున్న ఆరు లారీ యాక్సిడెంట్‌ గురించే ఆలోచిస్తుంది. బాలికా ఈ శిరోభారము మోయుట మా వల్ల కావడం లేదు. నువ్వు ఇంకొకసారి చేయోద్దన్న పని చేస్తే.. కాపాడుటకు నేను రాను అంటాడు గుప్త. దీంతో ప్రమాదం జరిగి ఉండుంటే అని ఆరు అడుగుతుంది. ఏమున్నది నీ స్నేహితురాలు పన్నిన పన్నాగానికి నీ సోదరి అంటూ గుప్త ఆగిపోగానే.. ఆగిపోయారేం గుప్త గారు చెప్పండి. ఆ లారీ మిస్సమ్మను గుద్దేసేది. నా లాగే ఒకరి పంతానికి మిస్సమ్మ ప్రాణాలు కోల్పోయేది అంటుంది.

మిస్సమ్మ నా తోడ బుట్టిన చెల్లెలు గుప్త గారు తాను చేయని తప్పుకు. మనోహరి దుర్బుద్దికి మిస్సమ్మ ఎందుకు బలి కావాలి అంటూ ఆరు ప్రశ్నించగా.. బాలిక ఎందుకు అట్లా మాట్లాడుతుంటివి ఏమీ కాలేదు కదా అంటాడు గుప్త. అసలు మిస్సమ్మ ఏం తప్పు చేసిందని చావాలి. మనోహరి కుట్రకు ఎందుకు బలి కావాలి. నీవు అడుగుతున్న ఏ ప్రశ్నకు నా దగ్గర సమాధానం లేదు బాలిక. నీలాగే మేము కూడా జరుగుతున్నది వీక్షించుట తప్ప ఏమీయూ చేయలేము అంటాడు గుప్త. ఆ జగన్నాథుడిని నమ్మి ముందుకు వెళ్లుట తప్ప ఏమీ చేయలేము అంటాడు. ఇంతలో మనోహరి ఇంటికి రావడంతో ఆరు కోపంగా గట్టిగా మను అని పిలుస్తుంది. మనోహరి భయంతో ఆగిపోతుంది. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

 

ALSO READ: ఫస్ట్‌ టైం అరుణాచలం వెళ్తున్నారా..? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే..?

 

Related News

Serial Heroine : సీక్రెట్ గా పెళ్లి.. ఏడాదికే విడాకులు..ఇప్పుడు ఏం చేస్తుంది..?

Today Movies in TV : ఆదివారం టీవీల్లోకి వచ్చేస్తున్న సూపర్ హిట్ సినిమాలు.. అస్సలు మిస్ అవ్వకండి..

Big tv Kissik Talks: చైతన్య మాస్టర్ మరణం పై రాజు ఎమోషనల్… ఆఖరి మాటలు అవే అంటూ!

Big tv Kissik Talks: జానీ మాస్టర్ అరెస్ట్ .. అలా చేయకుండా ఉండాల్సింది.. ఢీ రాజు కామెంట్స్ వైరల్!

Big tv Kissik Talks: సూసైడ్  ఆలోచన చేసిన ఢీ రాజు.. ఊపిరి ఆడలేదంటూ!

Sai Kiran: 46 ఏళ్ల వయసులో తండ్రి.. ఘనంగా నటి సీమంతం.. వీడియో షేర్‌ చేసిన హీరో!

Nindu Noorella Saavasam Serial Today November 8th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌:  బ్లాక్ మ్యాన్ గురించి నిజం తెలుసుకున్న మిస్సమ్మ 

Illu Illalu Pillalu Today Episode: నర్మదకు భద్ర స్ట్రాంగ్ వార్నింగ్.. ఇంట్లో రచ్చ చేసిన శ్రీవల్లి..భాగ్యం దెబ్బకు ఆనందరావుకు షాక్..

Big Stories

×